*తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు*
***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 9 & 10 : 2018

మహిళ శక్తి స్వరూపిణి 


***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 10 : 2018

*నేడు, రేపు తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు****************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 82018


గుండెల్లో నిత్యం ఎన్నో బాధల గునపాలు దిగుతున్నా
పెదవులపై చిరునవ్వులను వెలిగిస్తూనే ఉంటాను
బాధలు జీవితాన్ని రాపిడిపట్టే అసలైన వజ్రకవచాలు

కళ్ళల్లో ఎన్నో కన్నీటి సముద్రాలు పొంగిపొర్లుతున్నా
ముఖంలో నిట్టూర్పులను కనుమరుగు చేస్తుంటాను
వేదనలు జీవనతీరాన్ని చేర్చే అనంతమైన కెరటాలు

మదిసాగరంలో ఆటుపోట్ల అలజడులు రేగుతున్నా
మనసులో బాధఛాయలను కప్పిపెడుతూనే ఉంటాను
జీవితంలోని కష్టాలు కనురెప్పల్లో దాగిన కడగండ్లు

వసంతంలాంటి జీవితంలో శిశిరగ్రీష్మాలు ప్రవేశిస్తున్నా
హేమంతశరత్ రుతువుల్లా వెన్నెలై వెలుగుతుంటాను
ఆరురుతువులు జీవితంలో వచ్చే వెన్నెలవడగాడ్పులు

కలికాలపు సుడిగుండంలో క్షణాలన్నీ కొట్టుకుపోతున్నా
రోజూ జీవితాన్ని ఎండమావిలా గడుపుతూ ఉంటాను
కష్టాలు సుఖాలు కాలానికి పూచిన ఎండిపోని పూలు

***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 22 : 2018
నవ్య మీడియా నీ ప్రేమఊసులు చుట్టుముడుతున్నప్పుడల్లా
జ్ఞాపకాల వరదలో నిత్యం కొట్టుకుపోతుంటాను
ప్రేమంటే అనుభూతుల పరిమళపు సాగరం

నీ స్నేహ పరిమళాన్ని ఆస్వాదిస్తున్నప్పుడల్లా
అనుభూతి తరంగాలలో ఓలలాడుతుంటాను
ప్రేమంటే అనురాగపుతోటలో పూచిన సుగంధం

నీ తలపుల జడివానలో తడిసిపోతున్నప్పుడల్లా
వలపుల సాగరంలో అలలా ఎగసిపడుతుంటాను
ప్రేమంటే ప్రణయతోటలో విరబూసిన మల్లెతీగ

నీ విరహపు వేదనలో చిక్కుకున్నప్పుడల్లా
సాగరంలోని చేపపిల్లలా కొట్టుమిట్టాడుతుంటాను
ప్రేమంటే చేదుగుళికలా ఎడబాటు పరీక్ష 

నీ గుండెగుడిలో కొలువుతీరాలనుకున్నప్పుడల్లా
ఊహల కెరటాల్లో ఉక్కిరిబిక్కిరైపోతుంటాను
ప్రేమంటే ఆనందవిషాదాల అనురాగసంగమం


***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 మార్చి 24 : 2018
నవ్య మీడియా