*తెలంగాణ తొలి నవల ఆశాదోషం ఆవిష్కరణ*


తెలంగాణ తొలితరం కథా రచయిత, హితబోధిని పత్రికా సంపాదకులు అయిన బరార్ శ్రీనివాసశర్మ రచించిన తెలంగాణ తొలి నవల ఆశాదోషం ను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కోయిలకొండ దుర్గ చరిత్రను రచయిత నవలగా రచించారు.వందేళ్ల క్రితం రచించిన ఈ నవలను ప్రముఖ తాళపత్ర సేకర్త,పరిశోధకులు నాగలింగ శివయోగి వెలుగులోకి తెచ్చారు. దీనికి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వం వహించగా, హేరూర్ శోభా విజయకుమార్ సహసంపాదకులుగా వ్యవహరించారు. హేరూర్ విజయకుమార్ దీనిని ప్రచురించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు,తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డాక్టర్ జె.చెన్నయ్య,తెలంగాణ క్రీడల సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, సంపాదకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సహసంపాదకులు హేరూర్ శోభావిజయకుమార్,హేరూర్ విజయకుమార్, హేరూర్ రాజేష్, పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు జిల్లా అస్తిత్వవాద కవిత్వం








సమాజానికి నిరంతరం సేవలు చేస్తాం

అత్యుత్తమ కవులున్న ఖిల్లా .. పాలమూరు జిల్లా ... 



కేంద్ర సాహిత్య అకాడమీ, ధ్వని సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు కవిత్వం - వలస వేదన అనే అంశంపై పత్ర సమర్పణ చేస్తున్న దృశ్యం



పాలమూరు వలస సాహిత్యం పై ప్రసంగిస్తున్న గుడిపాటి గారు



పాలమూరు వలస సాహిత్యంపై ప్రసంగిస్తున్న ఆచార్య ఎన్.గోపి గారు








అక్షర సేనాని


మరుగున పడిన మాణిక్యం


సామాజిక మాధ్యమం వాట్సప్ కవిత్వం


ప్రేమ రుబాయిలు


గజల్


నేటి నిజం దినపత్రిక  18-10-2017 

అతడు


పాలమూరు సాహితి ముద్రితాలు


సాహితీ వనంలో భీంపల్లి


సాక్షి 18-10-2017 మహబూబ్ నగర్ 

పాలమూరు సాహితి సుమం డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్



భీంపల్లి శ్రీకాంత్

వికీపీడియా నుండి
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
Bheempally Sreekanth.jpg
జననండాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
24.11.1976
వేముల
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
వృత్తిప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి
మతంహిందూ
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.

జీవిత విశేషాలు

భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు.పాలమూరు సాహితి అనే సాహిత్య సంస్థను, పాలమూరు కల్చరల్ అకాడమీ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక లోనూ ,సింగిడి తెలంగాణ రచయితల సంఘం లోనూ క్రియాశీలకంగా పనిచేశారు.

రచనల జాబితా

పాలమూరు సాహితి ద్వారా తన సంపాదకత్వంలో అంజలి , పాలమూరు కవితా సుమాలు అనే పుస్తకాలను వెలువరించారు. తరువాత జిల్లాకు చెందిన వందమంది కవుల కవితలను సేకరించి పాలమూరు కవిత పుస్తకాన్ని 2004 లో వెలువరించారు. ఒక జిల్లా నుంచి వచ్చిన ఏకైక వచన కవితా సంకలనమిది.తెలంగాణ మీద హైకూలు రాసి సోది పేరుతో 2004లో వెలువరించారు.అక్షర తపస్వి ఆచార్య ఎస్వీ రామారావు అనే డాక్యుమెంటరికీ రచన చేశారు.కృష్ణా పుష్కరాలకు సంబంధించి పుష్కర కృష్ణవేణి అనే ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు.ప్రేమికులు ప్రయివేట్ ఆడియో ఆల్బానికి పాటలు రాశారు. నేటి విద్యార్థి, నిజం అనే సింగిల్ ఎపిసోడ్లకు మాటలు రాశారు. నాలో ఉన్న ప్రేమ అనే సింగిల్ ఎపిసోడ్ కు కథ, మాటలు రాశారు. ఛాంపియన్ అనే టెలిఫిల్మ్ కు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం వహించారు.

సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు

తెలంగాణ అమరవీరుల కవితా సంకలనం అమరం కు సంపాదకత్వం వహించారు.సోది పుస్తకాన్ని తెలంగాణకు పెద్ద దిక్కైన కాళోజి నారాయణరావు కు అంకితమిచ్చారు.

పురస్కారాలు

1996 లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు. సాహిత్యంలో వీరు చేసిన కృషికి 2002లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డు ను అందుకున్నారు.భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి సాహిత్య రత్న అవార్డు  రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి సెమినార్లలో పాల్గొన్నారు. 30కి పైగా అవార్డులను అందుకున్నారు. వీరి కవితలకు,కథలకు బహుమతులు కూడా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు,కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక పత్రికలలో వెలువడ్డాయి.

కథ: ప్రియురాలి మనసు


గుర్తింపు సంఖ్య86651
పేరుప్రియురాలి మనసు
ప్రక్రియకథ
రచయిత15023
రచయితభీంపల్లి శ్రీకాంత్
పత్రిక130
పత్రికమయూరి
ప్రచురణ తేది1994-10-14
కథానిలయం సంఖ్య
వివరాలు
సంపుటి
అతడు నిత్యం భుజాలపై
బతుకు బరువును మోసే క్రీస్తు
బీడువారిన పొలాన్ని
ఆకుపచ్చని చందమామను చేసే
పత్రహరితం
కన్నీరింకిన పొలంలో
పన్నీరును చిలికించే అభయహస్తం
తడి ఆరని భూమి దేహానికి
దాహార్తిని తీర్చే ఒయాసిస్సు
పగుళ్లిచిన పొలానికి
పొడరసమై ప్రవహించే జలపాతం !
ఆకలితో అలమటించే
జనావళికి దాహం తీర్చే అన్నదాత వాడు
కల్పతరువుగా మార్చినవాడు
అకుపచ్చని లోకంలో
చెమటముత్యమై మెరిసేవాడు
ఆకలి సమాజానికి అనునిత్యం
అన్నంముద్ద పెట్టేవాడు
గింజగింజపై తన పేరుండే రైతన్న
వాన చినుకు కోసం
ఆత్రంగా చూస్తాడు వాడిపుడు
బీడై పగుళ్లిచ్చాడు
బతుకుబరువై బక్కచిక్కాడు
ఎడారైన పొలంలో
తన పాదముద్రలను స్వప్నిస్తున్నాడు
ఎండిన పంటను చూసి మట్టి విత్తనాలను కావలించుకుంటున్నాడు
మట్టిని మాణిఖ్యం చేసివాడు
మరణశాసనాన్ని లిఖిస్తున్నాడువాడు
అతివృష్టిలో- అనావృష్టి
అనావృష్టిలో -కర్మిష్టి
వాడికిపుడు
ఓదార్పుకాదు ఆసరాకావాలి
ఎండిన పంటకు గిట్టుబాటు కావాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  Published Sunday, 27 March 2016 ఆంధ్రభూమి 
తెలంగాణ తొలి డిటెక్టివ్ నవలా రచయిత ఎవరో తెలుసా..?

పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. కవిగా,కథా, నవలా, గేయ రచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, సహకార సంఘ ఉద్యమ నాయకుడిగా లబ్ధ ప్రతిష్టులు.తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవారు ఎదిరె చెన్నకేశవులు.
మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆగస్టు15,1918 న బాలకృష్ణమ్మ,నారాయణమ్మ అనే దంపతులకు జన్మించారు. స్వయంకృషితో తెలుగు,ఆంగ్ల, ఉర్దూ భాషలలో తగు ప్రావీణాన్ని సంపాదించారు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడు దినపత్రికలకు విలేకరిగా పనిచేశారు.సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోలకొండ ద్వైవారపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. మిలాప్‌ హిందీ పత్రికకు పత్రినిధిగా కూడా కొంతకాలం పనిచేశారు.నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ప్రచురించే ‘నేత’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత సహకార సంఘం నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. సహకార సమాచారం పత్రికకు సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత రంగంలో విశేష కృషిసల్పిన వారి గురించి ‘చేనేత ప్రముఖులు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ‘సహకార సహజీవనం’ అనే వ్యాససంపుటిని వెలువరించారు.
ఎదిరె చెన్నకేశవులు మొదటగా గోపాలపేట సంస్థానంలోని హరిజన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి వారి అభ్యున్నతికై పాటుపడ్డారు. ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.
కథా రచయితగా : తెలంగాణ తొలితరం కథల్లో లబ్ధ ప్రతిష్టులు ఎదిరె చెన్నకేశవులు. చెన్నకేశవులు కథలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.వీరి ‘అభ్యుదయ రచయిత’ అన్న కథ సుజాత పత్రికలో 1950లో మొదటగా అచ్చయింది.అనంతరం వ్రాసిన తొమ్మిది కథలతో ‘పొట్టకోసం’ అనే కథాసంపుటిని 1968లో వెలువరించారు. ఇందులో పర్యవసానం, కూలి వెంకన్న, ప్రతిఫలం,పొట్టకోసం, సహవాసం, ఉగాది, కార్మికులదేే గెలుపు, నీ కోసం, గుణపాఠం వంటి కథలున్నాయి.
నవలా రచయితగా:
ఎదిరె చెన్నకేశవులు కథకుడిగానే కాకుండా నవలా రచయితగా కూడా పేరెన్నికగన్నవాడు. తొలి తెలంగాణ డిటెక్టివ్‌ నవలారచయితగా ఎదిరే చెన్నకేశవులు లబ్ధ్ద ప్రతిష్టులు. వీరి అదృశ్యహస్తం నవల తొలి తెలంగాణ అపరాధ పరిశోధక నవల. ఇది నేత వారపత్రికలో ధారావాహికంగా వెలువడి ప్రజాదారణ పొందింది. దొంగ, హంతకుడు అయిన భయంకర్‌ బారి నుంచి అతని మేనమామ కూతరును డిటెక్టివ్‌ మోహన్‌ కాపాడడం ఇందులోని ఇతివృత్తం. వీరి నవలలు పొట్టకోసం, పతిత ఈ రెండూ సాంఘిక నవలలు.
అదృశ్యహస్తం అపరాధ పరిశోధక నవల. నేత వారపత్రికల్లో 1967లో ధారావాహికంగా ప్రచురితమైంది.1969లో పుస్తక రూపంలో వెలువడింది. ఇది సీరియల్‌గా వస్తున్నప్పుడే పాఠకుల మన్ననలను పొందింది. అపరాధ పరిశోధక నవలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ ఈ నవలలో అడుగడుగున తొంగిచూసింది.
ఎదిరె చెన్నకేశవులు రచించిన రెండవ నవల పొట్టకోసం. ఈ నవల 1969లో ప్రచురించబడింది. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసపోయి ఎలా జీవిస్తున్నారనే అంశంగా దీనిని రచించారు. రచయిత మూడవ నవల పతిత. ఇది 1970లో సహకార సమాచారం అనే వారపత్రికలో సీరియల్‌గా వెలువడింది. ఒక సినిమా నటి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నవల రాయబడ్డది.
జర్నలిస్ట్‌గా:
గోలకొండ పత్రికలో చెన్నకేశవులు పనిచేస్తున్నప్పుడే ఆనాటి నిజాంకాలం నాటి ప్రజల పరిస్థితుల గురించి, గ్రంథాలయోద్యమం గురించి మొదలైన అంశాలపై గోలకొండ, నేత వంటి పత్రికలలో పలు వ్యాసాలను ప్రచురించారు. జర్నలిస్టుగా, రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న ఎదిరే చెన్నకేశవులు ఆంధ్ర సారస్వత పరిషత్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శిగా, ఆంధ్రమహాసభ జిల్లా సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర గ్రంథాలయ సంఘ వ్యవస్థాపక కార్యదర్శిగా,హైద్రాబాద్‌ కేంద్ర చేనేత సహకార సంఘానికి ప్రధాన వ్యవస్థాపకుడిగా పలు సేవలను అందించారు. హైదరాబాద్‌ రాష్ట్ర చేనేత ఉద్యమ ముఖ్యనాయకులలో ఒకరుగా, సర్వోదయ కార్యకర్తగా ప్రజోద్యమ నాయకుడిగా, వివిధ సంస్థల బాధ్యుడిగా పనిచేసిన నిరంతర శ్రమజీవి.
గేయకవిగా:
ఎదిరె చెన్నకేశవులు గేయకవిగా కూడా ప్రసిద్ధులు. వీరి రాసిన పలు గేయాలను ‘అర్పణ, అందరి గొడవ’ పేర్లతో తీసుకొచ్చారు. అయితే అర్పణ అనువాద గేయ సంపుటి. ‘నన్నిలా ఉండనీ’ అనే వచన కవితా సంపుటిని కూడా చెన్నకేశవులు రచించారు. అయితే ప్రసిద్ధ ఉర్దూ కవయిత్రి శ్రీమతి బాను తాహరా సయీద్‌ బేగం ఉర్దూ భాషలో రాసిన గేయ సంపుటి అనువాదమే ఈ అర్పణ. బాబా భక్తబృందంలో ఈమె ఒకరు. సత్యసాయిబాబా భక్తి భావంతో ఆమె ఎన్నో మధురగేయాలను రచించారు. ఈ అర్పణ గేయ సంపుటిలో ఎక్కువగా సత్యసాయిబాబా మీద రాసిన గేయాలున్నాయి. గజల్‌ , నజమ్‌ ఫక్కీలలో ఈ గేయాలను రచించారు. వివిధ భక్తులలో ఆత్మ నివేదన ఒకటి. బాను తహరా ఆత్మ నివేదనకు అక్షర రూపమే ఎదిరె చెన్నకేశవులు అనువదించిన అర్పణ గేయ సంపుటి. ఉర్దూ మూలంలోని భావాలను తెలుగులో శక్తివంతంగా అనువదించడం విశేషం. ఈ అర్పణలో మొత్తం 26 గేయాలున్నాయి. ఎదిరె చెన్నకేశవులు మూలంలోని భావాలను యాధాతథంగా అనువదించడం విశేషం.
ఈ గేయాల్లో సర్వసంగ పరిత్యాగి అయిన సత్యసాయిబాబా మధుర భాష శ్రవణం, దివ్య రూప స్మరణం ల గురించి రాసిన గేయాలు రచయిత భక్తి తత్పరతను తెలియజేస్తాయి.
నా ప్రాణదాతవు నీవే
నా హృదయ మూర్తివి నీవే
అంటూ తన సర్వస్వం బాబానే అంటూ కీర్తిస్తారు.
భగవంతుడితో భక్తుడు తన నివేదనను ఆర్తితో పలికిన గేయాలెన్నో ఇందులో ఉన్నాయి. భాగవంతుడిని ఒక మిత్రుడిగా, ప్రేమికుడిగా,సన్నిహితుడిగా భావించి రాసిన గేయాలు మనకు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాంజలిని తలపిస్తుంది.మొదటి గేయం హృదయవాణిలో
తారల్లో నిను చూచి తారసిల్లాను
వసంతంలో వెదకి వసుధ గాంచాను
నీ చూపు నా చూపు కలిసినప్పటి నుండి
నేనెచట నుంటినో నే నెరుగనైతి
అనుభూతి ప్రధానంగా రచించబడ్డ ఆత్మాశ్రయ గేయమిది. ప్రేమకు ప్రతీకగా ఈ గేయరచన సాగింది.
భగవంతుడిని స్నేహితుడిగా భావిస్తూ రాసిన గేయం అత్యంత స్నేహ మధురిమను వెల్లడిస్తుంది.
నా హృదయమెంతో కలవరపడుచున్నది నేస్తం
నా హృదయ స్పందన శబ్దం నీ చెవిలో
గింగురుమనలేదా నేస్తం
నా ఏకాంతం నా దు:ఖం
నా ఆందోళన నీకు తెలియనివికావు
అంటూ హృదయం పడే ఆవేదనను ఈ గేయంలో ఎదిరె చెన్నకేశవులు భావుకతతో వెల్లడించి మన మనసులను దోస్తారు.
ఇంకా…
నీ ఉపదేశాలే ప్రేమను నేర్పాయి. నాకు ఈ ఇల
నీ సందేశాలే నాలో జీర్ణించాయి ఈ ఇల
అంటూ సత్యసాయిబాబా ఉపదేశాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు. ఎదిరె చెన్నకేశవులు చక్కని అనువాదానికి నిదర్శనం ఈ అర్పణ గేయ సంపుటి కావ్యం.
డా|| భీంపల్లి శ్రీకాంత్‌  నమస్తే డెస్క్

రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొన్న భీంపల్లి శ్రీకాంత్
మహబూబ్‌నగర్ సాంస్కృతిక విభాగం : తంగిరాల మెమోరియల్ ట్రస్ట్, సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో జిల్లాకు చెందిన యువకవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. నాటకరంగం అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో భీంపల్లి శ్రీకాం త్ కళ తప్పిన పల్లె అనే కవితను చదివి సభికులను అలరించారు. అనంతరం సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి, ఆచార్య టి.గౌరిశంకర్, నేటి నిజం పత్రిక సంపాదకులు బైన దేదవాసు, జీవీఆర్. ఆరాధన కల్చరల్ పౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకట్‌రెడ్డి, సా హితీ కిరణం పత్రికా సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తంగిరాల చక్రవర్తి, పె ద్దూరి వెంకటదాసులు భీంపల్లి శ్రీకాంత్‌కు శాలువా, మెమెం టో, ప్రశంసాపత్రంతో సన్మానించారు.

9/26/2017 1:55:39 AM MAHBOOBNAGAR NEWS

బ్రెయిలి లిపిలో శ్రీ పద్మకల్ప ప్రకాశిక, మార్కండేయ చరిత్ర ఆవిష్కరణ
బ్రెయిలి లిపిలో శ్రీ పద్మకల్ప ప్రకాశిక, మార్కం డేయ చరిత్రను ఆగస్టు 29న ఆవిష్కరించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహబూ బ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్ట ణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో యాదేశ్వరి జయ శంకర్ బ్రెయిలి లిపిలో అనువ దించిన గ్రంథాలను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ పానుగంటి బాలరాజు మాట్లాడుతూ బ్రెయిలి లిపిలో విశేష కృషి చేస్తున్న యాదేశ్వరి జయశంకర్‌ను ఈ సందర్భంగా కొనియాడారు.
జిల్లా అధ్యక్షుడు సాక బాల్‌నారాయణ మాట్లాడుతూ పద్మశాలి సమాజంలో అనేక మంది ప్రతిభావంతులైన వారున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. రాష్ర్టపతి అవార్డు గ్రహీత అయిన యాదేశ్వరి జయశంకర్ మన వంశ చరిత్రలను బ్రెయిలి లిపి లోకి అనువదించడం గర్వకారణమన్నారు. కలెక్టరేట్ సి సెక్షన్ ఇం చార్జ్ ఎం.ప్రభాకర్ రావు మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు మాట్లాడుతూ బ్రెయిలి లిపిలో కేవలం రామాయణ, భారతం, భాగవతాలను మాత్రమే కాకుండా రాష్ర్ట ప్రభుత్వ పాఠ్యపుస్తకాలైన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల అన్ని పాఠ్యపుస్తకాలను బ్రెయిలి లిపిలో అనువదించి ఉచి తంగా ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అప్పం అనంతరా ములు, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కోడి సుకుమార్, జగదీశ్, బిజ్జ శంకర్, బిజ్జ విశ్వనాథం, సూరప్రతాప్, పవన్‌కుమార్, భీంపల్లి నారా యణ, మత్కరాజేందర్, కొంగరి లక్ష్మినారాయణ, ఒగ్గు సత్యనారా యణ, కొంగరి సత్యనారాయణ, కొంతి గోపాల్ పాల్గొన్నారు. 


మహబూబ్‌నగర్‌ : నేడే ఆంగ్ల కవితాసంపుటి ఆవిష్కరణ
ప్రముఖ ఆంగ్లకవి, విశ్రాంత ఆర్‌ఐఓ రవిఠాకూర్‌ రచించిన ఆంగ్ల కవితా సంపుటిని ఆదివారం 10.30 గంటలకు పాలమూరు పట్టణంలో గల లిటిల్‌ స్కాలర్స్‌ హైస్కూల్‌లోని కాళోజి హాల్‌లో ఆవిష్కరించనున్నట్లు పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, ప్రముఖ కవికోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆవిష్కరణ కర్తగా ప్రముఖ విద్యావేత్తగా, కవి జలజం, సత్యనారాయణ, సభాధ్యక్షులుగా ప్రముఖ సామాజికవేత్త ఆర్విణి రాజేంద్రబాబు, పుస్తక సమీక్షకులుగా పాలమూరు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంగీపురం శ్రీనాథచారి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని కవి మిత్రులు, రచయితలు, సాహిత్యాభిమానులు తప్పక పాల్గొనాలని వారు కోరారు.

 


కేంద్ర సాహిత్య అకాడమి, అధ్వని రైటర్స్‌ ఫోరమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న మహబూబ్‌నగర్‌ పట్ఠణంలోని మొట్టుగడ్డలోని లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌ ప్రాంగణంలో గల కాళోజహల్‌లో వలస సాహిత్యంపై ఒక రోజు సాహిత్య సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జలజం సత్యనారాయణ, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం రోడ్లు భవనాల అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సాహిత్య సదస్సును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఉదయం ప్రారంభోత్సవ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌. పి. మహాలింగేశ్వర్‌ స్వాగతం పలుకుతారని, సాహిత్య అకాడమి తెలుగు సలహ మండలి సంచాలకులు ఎన్‌. గోపీ అధ్యక్షత వహిస్తారన్నారు. అలాగే ముఖ్య అతిథిగా పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా బి. రాజారత్నం విచ్చేస్తారని తెలంగాణ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ కీలకోపన్యాసం ఉంటుందన్నారు. మొదటి సదస్సుకు గుడిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారన్నారు. పాలమూరు కథలు – వలస బతుకులుపై గుంటి గోపీ, అద్య కవిత్వం పాలమూరు గోసుపై పల్లెర్ల రాంమోహన్‌రావు, పాలమూరు మనన సాహిత్యం వలస వివరణపై కొల్లాపురం విమల పత్ర సమర్పణ చేస్తారన్నారు. మధ్యాహ్నం జరిగే రెండవ సదస్సుకు జాకంటి జగన్నాథం అధ్యక్షత వహి స్తారన్నారు. పాలమూరు నవలలు వలసజీవన చిత్రణపై జె. నీరజ, పాలమూరు క విత్వం వలస వేదనపై భీంపల్లి శ్రీకాంత్‌ , పాలమూరు పాటలు వలస ల వలపోతపై పి. భాస్కరయోగి పత్ర సమర్ధణ చేస్తారన్నారు. ముగింపు సమావేశానికి ఎన్‌.గోపీ అధ్యక్షత వహిస్తారని, ప్రముఖ పరిశోధనలు ఆచార్య ఎస్వీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.
అనంతరం ప్రముఖ తెలుగు కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవిసంధ్య ఉంటుందని, ఈ కవి సంధ్యలో కవితన కవితంను వినిపిస్తారన్నారు. కావున ఈ సాహిత్య సదస్సు కు జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు.

 
మొగ్గలు

అక్షరాలతో ఆడుకుంటేనే కానీ
కవిత్వం విజయమై పలకరించదు
అక్షరాల పోరాటమే కవిత్వం

అక్షరాలకు మకరందాన్ని పంచితే కానీ
కవిత్వం రుచికరమై తియ్యదనాన్ని పంచదు
అక్షరాల నైవేద్యమే కవితాస్వాదనం

అక్షరాలకు సుగంధాన్ని అద్దితే కానీ
కవిత్వం సౌరభమై వికసించదు
అక్షరాలు కవితా పరిమళాలు

అక్షరాలకు సంస్కారాన్ని నేర్పితే కానీ
కవిత్వం మానవతాదీపాలను వెలిగించదు
అక్షరాలు సమాజాన్ని వెలిగించే దీపాలు

అక్షరాలను నిండుగా ప్రేమిస్తేనే  కానీ
కవిత్వం ప్రియురాలై వెంటపడదు
అక్షరమే సమాజానికి ప్రేమకానుక



        🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్       
Dec 17,2017 నవ తెలంగాణ