సహస్ర కవిసమ్మేళనంలో పాల్గొన్న భీంపల్లి శ్రీకాంత్ 
భాగ్యనగర్ పోస్ట్ మాసపత్రిక : మార్చి 2018 

నేటి నిజం 28-02-2018



🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷


 ** *శ్రీదేవి మొగ్గలు***

నేటి నిజం 20-02-2018

సినిమా జగత్తులో సిరిమల్లెపువ్వులా వికసించి
అభిమానుల్లో అభినయపరిమళాలను వెదజల్లింది
శ్రీదేవి నటనకు ఆచంద్రార్కం దాసోహం

నటనలో నవరసాలను అవలీలగా ఒలికించి
ప్రేక్షకుల హృదయాలను మధురంగా కొల్లగొట్టింది
శ్రీదేవి సినీవినీలాకాశపు అతిలోకసుందరి

అందమైన సౌందర్యాన్ని అందంగా గుమ్మరించి
కోట్లాది అభిమానుల మనసులను దోచుకున్నది  
శ్రీదేవి వెండితెరపై వెలిగిన వెన్నెల మహారాణి

చిలుకపలుకుల నటనతో చక్కగా అభినయించి
ఆబాలగోపాలాన్ని ఆనందంగా అలరించింది
శ్రీదేవి కళామతల్లికి ముద్దులొలికే ముద్దుబిడ్డ

పదహారణాల పడుచుపిల్ల పువ్వులా పరిమళించి
సినీబృందావనంలో సిరిమల్లెలా విరబూసింది
శ్రీదేవి చిత్రసీమలో వెలిగిన ఇంద్రధనస్సు 

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

మొగ్గలు
అక్షరనేత్రం పక్ష పత్రిక 
ప్రపంచాన్ని అద్ధంలాగా చూపించినప్పుడల్లా
అమ్మ చెప్పే నీతికథలే జ్ఞాపకమొస్తాయి
జీవితాంతం జ్ఞానరుచిని పంచేది పుస్తకం

మనలోని కల్మషాలను కడిగేసుకున్నప్పుడల్లా
వెలుగుబాటయై దారి చూపిస్తూనే ఉంటుంది
కారుచీకట్లో కాంతిరేఖయై ప్రకాశించేది పుస్తకం

అక్షరాలతో ఆలింగనం చేసుకున్నప్పుడల్లా
భావప్రకాశనాన్ని కలిగిస్తూనే ఉంటుంది
విశ్వమయ జగత్తుకు విజ్ఞాన కేంద్రం పుస్తకం

బాధలబరువుతో మనసు అల్లాడిపోతున్నప్పుడల్లా
సేద తీర్చే ప్రియురాలై సాంత్వన పరుస్తుంది
హృదయానికి హత్తుకునే ఆత్మీయనేస్తం పుస్తకం

మనిషి జీవితంలో విజయాన్ని సాధించినప్పుడల్లా
గమ్యానికి పునాదిరాయై దారిచూపుతూనే ఉంటుంది
తీరాన్ని చేర్చే బతుకు చుక్కాని పుస్తకం

✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
























నమస్తే తెలంగాణ 27-02-2018
ముప్పై ఏండ్ల తర్వాత గణప సముద్రం నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రచయితల సంఘం కమిటీ, జిల్లా కవులు, రచయితలు సందర్శించిండ్రు. రాష్ట్ర సాధన ఫలాలను కనులారా చూసి స్వీయ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్న తీరుకు ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు

తెలంగాణ వస్తే ఏమొస్తదన్న దానికి నిదర్శనం కండ్ల ముందు కనిపిస్తున్నది. అందుకు వనపర్తి జిల్లా ఖిల్లా గణపురంలోని గణ పసముద్రం ప్రబల తార్కాణం. సప్త సముద్రాలలో గణపసముద్రం ఒకటి. ముప్పై ఏండ్లుగా బీడుపడిన గణప సముద్రం నిండి అలుగు పారుతున్నది. ప్రతి చెరువు అలుగు పారాలన్న తెలంగాణ ప్రభు త్వ ఆకాంక్ష గణప సముద్రంతో తీరినట్లయింది. రైతు బతుకుదెరువుకు చెరువులే జీవనాడులు. దశాబ్దాలుగా ఎండిన చెరువులు మిషన్ కాకతీయతో నిండుకుండలైనవి. భూములన్నీ పచ్చబడుతున్నవి. కాలువలు, కుంటలు పారుతున్నవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేండ్లకు చెరువులు ఆనందతాండవం చేస్తున్నాయి. దీంతో వలసపోయిన ప్రజలంతా దమ ఊళ్లకు తిరిగి వస్తున్నరు. మూడేండ్లలోనే వేలాది ఎకరాలకు నీరందిస్తున్న చెరువులిపుడు సముద్రాలను తలపిస్తున్నవి.

సప్త సముద్రాలలో ఒకటైన గణపసముద్రాన్ని ఆనాడు కాకతీయ సామం త పాలకుడు గోనగన్నారెడ్డి గణపతిదేవుడి పేరుమీద ఈ చెరువును తవ్వించిండు. ప్రజలందరి జీవనానికి జీవనాడిగా ఉండే చెరువులను ఆనాడు ప్రతి ఊరులో ఒక చెరువును తవ్వించిండ్రు. అయితే వలసాంధ్ర పాల కుల నిర్లక్ష్యం, వివక్ష కారణంగా కరువుకు కేంద్ర బిందువైన పాలమూరు జిల్లాలో చెరువులన్నీ ఎండిపోయినవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చెరువులన్నీ మురికి తుమ్మల పాలయినవి. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక చెరువులన్నీ ఇప్పుడు నీళ్ళతో కళకళలాడుతున్నవి. మిషన్ కాకతీయను ఒక ఉద్యమంలా చేపట్టడం వల్లనే చెరువులీనాడు నీళ్ళతో నవ్వుతున్నవి. ఊహకందని విధంగా సాగునీరు పారుతున్నది. వాగులు వంకలు నిండుతున్నవి. ఇంక రావనుకున్న నీళ్ళు కండ్లముందరే నిండుతుంటే సంబురమేస్తున్నది.

పాలమూరు జిల్లాకు వరప్రదాయిని అయిన కృష్ణాజలాలు గతంలో పాలమూరు దాటిపోయేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మన నీళ్ళను మనమే ఒడిసిపట్టుకుంటున్నం. సమైక్యపాలనలో పోగొట్టుకున్నది మూడేండ్లలోనే తెచ్చుకున్నమంటే అది తెలంగాణ ప్రభుత్వ ఘనతే. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం 29 ప్యాకేజీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం ఊహకందని విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దీక్షా దక్షతలతో అసాధ్యమనుకున్నది సుసాధ్యం అయ్యింది. కెఎల్‌ఐ ఎత్తిపోతల పథకంలో మన వాటా 25 టీఎంసీలు ఉన్నదానిని 40 టీఎంసీలకు పెంచిన ఘనత ఈ ప్రాంత నేత నిరంజన్ రెడ్డిది. ఏడాదిగా ఖిల్లాగణపురానికి కెఎల్‌ఐ నుంచి సాగునీరు అందిస్తానని మాట ఇచ్చిన నిరంజన్‌రెడ్డి ఆ మేరకు తన మాట ను నిలబెట్టుకున్నడు. దీంతో గణపురంలోని ప్రజలే గాక చుట్టుముట్టూ గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నరు. కేవలం గణపురం ప్రజలే కాదు తెలంగాణలోని ప్రతి ఊరు ఇపుడు చెరువులతో కళకళలాడుతున్నది. 

సమైక్యపాలనలో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి 3.67 లక్షల ఎకరాలకు నీరు తీసుకొచ్చేందుకు పాలనాపరమైన అనుమతి తీసుకున్నా దానికి సరైన కాల్వల డిజైన్ లేకపోడంతో పనులు చేపట్టలేదు. దాంతో ప్రాజెక్టులు ఆరంభ దశలోనే ఆగిపోయినవి. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టుల మీద పడ్డది. ప్రాజెక్టులు నీటితో కళకళలాడితేనే రైతన్నలు, ప్రజలు పచ్చగుంటరని తెలంగాణ ప్రభుత్వం నిండుమనస్సుతో ఉన్నది. ఆ మేరకు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలను సమన్వయం చేసి ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేస్తున్నది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా వనపర్తి నియోజకవర్గమే కాకుండా నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు కూడా లబ్ధి చేకూరనున్నది. మన నీటిని మనకు కాకుండా సమైక్య పాలకులు చేసిన ద్రోహం ఇపుడు జనాలకర్థమవుతున్నది. ఇన్నాళ్ళుగా సాగునీటికోసం చేసిన భగీరథ ప్రయత్నం ఫలించింది. దశాబ్ధాలుగా నీటి ఆదరువులేని గుట్టల ప్రాంతానికి నేడు కృష్ణమ్మ గలగలా పరుగులు పెడుతుంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలాలే నని చెప్పక తప్పదు. 

ఎన్నేళ్ళో వేచిన ఉదయం అంటూ ఎదురుచూసిన క్షణాలు తెలంగాణ సాకారమై సాక్షాత్కారమైంది. తెలంగాణ అభివృద్ధికి ఎట్లా తిప్పలు పడుతున్నరో అర్థమవుతున్నది. పాలమూరు జిల్లాలో కరువు కాటకాలు, వలసలు ఎప్పుడు పోతాయోనంటూ ఎదురుచూసిన వాళ్ళకు నేడు నిండుతున్న చెరువులే జవాబు చెబుతున్నవి. నీళ్ళునిధులు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చెరువులు నిండుతుంటే ఉద్యమం లో విన్నది నేడు సాకారమైతుంటే తెలంగాణ ఎందుకో అర్థమవుతున్నది. ఇన్నాళ్ళు అరిగోసపడిన వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం స్వాంతన చేకూర్చుతున్నది. 

వచ్చే వానాకాలం నాటికి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. సీమాంధ్ర పాలనలో రైతుల ఆత్మహత్యలు,ఆకలిచావులు, ప్రజల కన్నీళ్ళే ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి. ఒకవైపు పాలమూరు జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా, మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత పాల కులు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. దీంతో పసిడి పంటలు పండాల్సిన భూములు బీళ్ళుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీడు భూములన్నీ సాగులోకి వస్తున్నవి. గణప సముద్రం పూర్తిగా నిండంతో ఆ మండలమంతా సస్యశ్యామలమవుతున్నది. అరువై ఏండ్ల చరిత్రలో గణప సముద్రం అలుగు పారటం తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే కావడం విశేషం. అలాగే మండలంలోని మామిడిమాడలోని నేరెడు చెరువుతోపాటు ఖిల్లా గణపురం తాండ సమీపంలో ఉన్న ఎర్రకుంటను రిజర్వాయరుగా మార్చితే ఖిల్లాగణపురం మండలానికి శాశ్వతంగా నీరు అందుతుంది. 

ఆ ప్రయత్నంలోనే భాగంగా ఆయా మండలాల్లోని చెరువులను, కుంటలను నీటితో నింపి ఆయకట్టు భూములకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయటం హర్షణీయం. అంతేకాదు గణప సముద్రం నిండిన తర్వాత మండలంలోని మామిడిమాడ, సల్కెలాపూర్, కమాలొద్దీన్‌పూర్, వెంకటాంపల్లి చెరువులను నింపుతూనే పక్కనున్న మూసాపేట మండలంలోని నిజాలాపూర్, కందూర్ వరకు కృష్ణమ్మ నీటిని తరలించేందుకు కూడా అవకాశం ఉంది. ఈ గణప సముద్రం పూర్తిగా నిండడానికి 109 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు కూడా తీసుకున్నరు.

ముప్పై ఏండ్ల తర్వాత గణప సముద్రం నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రచయితల సంఘం కమి టీ, జిల్లా కవులు, రచయితలు సందర్శించిండ్రు. రాష్ట్ర సాధన ఫలాలను కనులారా చూసి స్వీయ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్న తీరుకు ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధమై న పాలనతీరుతో రాష్ట్రం సస్యశ్యామల పైరు పచ్చల తెలంగాణగా మారు తుందనటంలో సందేహం లేదు. 
bheeempalli




సహస్ర కవి సమ్మేళనంలో జిల్లా కవులకు సన్మానం 

ఈనాడు మహబూబ్ నగర్ 26-02-2018
 నమస్తే తెలంగాణ  మహబూబ్ నగర్ 26-02-2018 



సాక్షి మహబూబ్ నగర్ 26-02-2018


ఆంధ్రప్రభ మహబూబ్ నగర్ 26-02-2018

నవ తెలంగాణ మహబూబ్ నగర్ 26-02-2018

మన తెలంగాణ మహబూబ్ నగర్ 26-02-2018

   మనం  మహబూబ్ నగర్  26-02-2018

✍✍భీంపల్లి  శ్రీకాంత్ 


* 🌷రాత్రి  మెగ్గలు🌷*

గణేష్ దినపత్రిక 25-02-2018

అలసిన దేహానికి ఆపన్నహస్తమవుతూనే
పిల్లతెమ్మెరలా నిద్రపుచ్చుతూనే ఉంటుంది
రాత్రి అంటే మనిషిని సేదతీర్చే లేపనం

పగలంతా ప్రపంచాన్ని చుట్టుతూ వస్తూనే
రాత్రయ్యేసరికి చీకటికౌగిట్లోకి జారుకుంటాను
రాత్రి అంటే అలసిన మనసుకు ఉపశమనం

మనసును మరిపించే కష్టాలను మరిపిస్తూనే
అది నెచ్చెలిలా సాంత్వనపరుస్తూనే ఉంటుంది
రాత్రి అంటే మనసుకు ఆనందనిలయం

కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతూనే
సరికొత్త ప్రపంచాన్ని కలగంటూ ఉంటాడు
రాత్రి అంటే కవికి అక్షరాలా తపస్సు

కాలం ఒడిలోని రాత్రి పాన్పుపై నిద్రిస్తూనే
ఆశలదీపాలను వెలిగిస్తూనే ఉంటాడు
రాత్రి అంటే కవికి ఉదయించే రవికిరణం


✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
* 🌷కవితా మెగ్గలు🌷*

గణేష్ దినపత్రిక 23-02-2018

కవిత్వం మనసును పులకింపచేస్తేనే కదా
అక్షరలతలు నలుదిశలా పరిమళించేది
కవిత్వం సాహితీ కుసుమాల సౌరభం

కవిత్వం తరంగమై ప్రవహిస్తేనే కదా
కొత్తదారులను లోకానికి పరిచయం చేసేది
కవిత్వం నవరాగాల నవరససమ్మేళనం

కవిత్వం సాగరమై పోటెత్తితేనే కదా
గుండెలోని బాధల దుఃఖాన్ని ఒంపుకునేది
కవిత్వం కనిపించని రహస్యనేత్రం

కవిత్వం నదీప్రవాహమై పారితేనే కదా
కవితావింజామరలు వికసించి నాట్యమాడేది
కవిత్వం నవపల్లవుల మృదంగనాదం

కవిత్వం అక్షరసౌరభాలను వెదజల్లితేనే కదా
తెలుగు సాహిత్యం కలకాలం నిలిచిపోయేది
కవిత్వం వెలుగుపంచే సహస్ర రవికిరణం

✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷






అలసిన దేహానికి ఆపన్నహస్తమవుతూనే
పిల్లతెమ్మెరలా నిద్రపుచ్చుతూనే ఉంటుంది
రాత్రి అంటే మనిషిని సేదతీర్చే లేపనం

పగలంతా ప్రపంచాన్ని చుట్టుతూ వస్తూనే
రాత్రయ్యేసరికి చీకటికౌగిట్లోకి జారుకుంటాను
రాత్రి అంటే అలసిన మనసుకు ఉపశమనం

మనసును మరిపించే కష్టాలను మరిపిస్తూనే
అది నెచ్చెలిలా సాంత్వనపరుస్తూనే ఉంటుంది
రాత్రి అంటే మనసుకు ఆనందనిలయం

కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతూనే
సరికొత్త ప్రపంచాన్ని కలగంటూ ఉంటాడు
రాత్రి అంటే కవికి అక్షరాలా తపస్సు

కాలం ఒడిలోని రాత్రి పాన్పుపై నిద్రిస్తూనే
ఆశలదీపాలను వెలిగిస్తూనే ఉంటాడు
రాత్రి అంటే కవికి ఉదయించే రవికిరణం

నవ్య మీడియా :: Feb 23, 2018
✍✍🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
సాక్షాత్కారం 



 *భీంపల్లి శ్రీకాంత్*


ఐదవ శక్తి పీఠం జోగులాంబ 

అక్షర నేత్రం దినపత్రిక 05-02-2018


 *భీంపల్లి శ్రీకాంత్*


ఆచార్య ఎస్వీ రామారావుకు ఘన సన్మానం
ఈనాడు  మహబూబ్ నగర్ 22-02-2018
నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 22-02-2018
సాక్షి మహబూబ్ నగర్ 22-02-2018
ఆంధ్రజ్యోతి మహబూబ్ నగర్ 22-02-2018

ఆంధ్రప్రభ మహబూబ్ నగర్ 22-02-2018

 *భీంపల్లి శ్రీకాంత్*
*భాష మొగ్గలు*


మౌనానికి మాటలు నేర్పించినప్పుడల్లా
అది అనుభవాలపేటికను పేరుస్తూనే ఉంటుంది
ఎదలోని భావాలకు వారధి మాతృభాష

మదిలోని అనుభూతులను చిలికినప్పుడల్లా
అనుభవం అమృతాన్ని పంచుతూనే ఉంటుంది
కమ్మనైన భాష మన తీయని తెలుగుభాష

మనిషి సుగంధమై పరిమళించినప్పుడల్లా
మంచిమాట ఆణిముత్యమై మెరుస్తూనే ఉంటుంది
భావాలకు ప్రాణవాయువు మన మాతృభాష

అనుభవాల జ్యోతులను వెలిగించినప్పుడల్లా
అజ్ఞానాంధకారం తొలిగిపోతూనే ఉంటుంది
విజ్ఞాన వికాసానికి విత్తు మన మాతృభాష

గుండెలనిండా భావాలు పొంగినప్పుడల్లా
భాష మణిదీపమై వెలుగుతూనే ఉంటుంది
మమత పంచు తెలుగు మన మాతృభాష

(అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా)


 *భీంపల్లి శ్రీకాంత్*
పాలకొండ పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవ  వేడుకలు


ఈనాడు మహబూబ్ నగర్  18-02-2018
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 


డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కు  సహస్ర కవిమిత్ర బిరుదు ప్రధానం 

గణేష్ దినపత్రిక 20-02-2018
🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
మొగ్గలు 

గణేష్ దినపత్రిక 16-02-2018
కవిత్వంలోకి అక్షరాలను ప్రవహింపచేస్తానా
అవి కవితాపరిమళాలను వెదజల్లుతాయ్
అక్షరాలు ఎప్పుడూ వికసించే కవితాలతలు

అక్షరాలలోకి అనంతభావాలను ఒంపుతానా
అవి రసరమ్యభావనలను ఆవిష్కరిస్తాయ్
భావాలు ఎప్పుడూ విరబూసే అక్షరలోగిళ్ళు

మనస్సులోకి ఆలోచనలను నింపుతానా
అవి అక్షరాలను కవితాభిషేకం చేస్తాయ్
ఆలోచనలు ఎప్పుడూ ఎగిసే తరంగాలు

సాహిత్యంలోకి కవితలను కురిపిస్తానా
అవి మధురభావాలను చిగురింపచేస్తాయ్
కవితలు సప్తవర్ణాల ఇంద్రధనుస్సులు

గేయంలోకి రాగాలను ఒలికింపచేస్తానా
అవి సప్తస్వర నాదాలను పలికిస్తాయ్
రాగాలు రసగంగ ప్రవాహ జలపాతాలు

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

*మొగ్గలు*

గణేష్ దినపత్రిక 20-02-2018
ఉదయాలను ఆలోచనలతో వెలిగిస్తానా
అవి భావచైతన్యాలకు ఊపిరిపోస్తూనే ఉంటాయి
ఆలోచనలు ఎగిసిపడే చైతన్యప్రవాహాలు

గుండెలోని బరువును దించుకుంటానా
మనస్సు ఆనందడోలికల్లో విహరిస్తూనే ఉంటుంది
అక్షరాలు ప్రసవించే పురుటినొప్పులే కవిత్వం

సమాజాన్ని కలంతో కాగడా పడుతుంటానా
అది కాలాన్ని పహారాకాస్తూనే ఉంటుంది
కలం సమాజాన్ని చైతన్యపరిచే గాండీవం

నిత్యం అక్షరాలతో దోస్తీ కడుతుంటానా
అవి కవితామాలలై పరిమళిస్తూనే ఉంటాయి
అక్షరాలు కవితలహారాలకు నైవేద్యాలు

గాయాలను అక్షరాలలోకి ఒంపుకుంటానా
అవి మనసును సాంత్వనపరుస్తూనే ఉంటాయి
అక్షరాలు కన్నీటిని ఓదార్చే ఆపన్నహస్తాలు

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷