మనం : 21-06-2018 : గురువారం 

కళ్ళముందు వాస్తవాన్ని కనిపెట్టిన ఘనుడు
జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన వీరుడు
సీమాంధ్ర కుట్రలను పసిగట్టిన ధీరుడు
తెలంగాణ గొంతుకను వినిపించిన ధీమంతుడు

అతడే...తెలంగాణ జాతిపిత
తెలంగాణ వేగుచుక్క
తెలంగాణ కేతనాన్ని ఎగరేసిన  జండా
మన నీళ్లు మన నిధులు దక్కాలనే నిండా

తెలంగాణ అస్తిత్వపు చిరునామా అతడు
తెలంగాణ జ్యోతిని వెలిగించిన సూర్యుడు

తల్లి తెలంగాణ స్వేచ్ఛకోసం తల్లడిల్లిన పేగుబంధం
స్వీయజాతి రక్షణ కోసం ఎదురొడ్డిన అగ్నిగుండం

ప్రతినిత్యం ఆరాటం తెలంగాణ పోరాటం
స్వరాష్ట్ర ఆకాంక్షయే అతని జీవితాశయం

అనునిత్యం తెలంగాణకు పాటుపడిన ఉద్యమం
నిరంతరం కుట్రలకు అడ్డుపడిన కేతనం

నిబద్ధతతో జీవించిన నిజాయితీ అతని కిరీటం
సామాన్యుడిగా బతికిన అసామాన్యం అతని చరితం
 
నాన్ ముల్కీ ఉద్యమానికి గొంతుకను వినిపించినాడు
సాంబార్-ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమానికి అండగా నిలిచినాడు

తెలంగాణ ఉద్యమానికి జీవితమే అంకితం
సిద్ధాంతమే ప్రాణంగా బతకడం అతని నైజం

తెలంగాణలో వలసపాలనకు చరమగీతం పాడినాడు
ఆంధ్ర పాలకుల గుండెల్లో పెనుమంటై రగిలినాడు
సమస్యలను ఎక్కుపెడుతూ సమరభేరి మోగించినాడు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ప్రతిక్షణం పలవరించినాడు

ఉద్యమమే జీవితంగా నిరంతరం బతికినాడు
ప్రత్యేక తెలంగాణకు దిక్సూచిగా నిలిచినాడు
వచ్చిన తెలంగాణను చూడకుండా పోయినాడు
ఊపిరిచ్చి తెలంగాణకు గుండెకాయ అయినాడు

అసాధ్యమన్న తెలంగాణను సాధించి చూపినాడు
కళ్ళారా చూడకుండా తనువును చాలించినాడు

జోహారు జయశంకరా ! జోహారు విజయశంకరా !!


(నేడు జయశంకర్ జయంతి)



డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 


ఆంధ్రప్రభ : 18-06-2018 : సోమవారం 


పుట్టి గిరిధర్ 



సాక్షి : మహబూబ్ నగర్  : 25-06-2018

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

తెలంగాణా జల కవితోత్సవం 





**********************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
భ్యాగనగర్ పోస్ట్ : మాసపత్రిక : జూన్ : 2018



 ఒరవడి  e-పత్రిక  గ్రీష్మ సంచిక  మే - జూన్  2018 
 పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటి  తెలుగు e - పత్రిక  




ఎన్ని మొగ్గలను చిగురింపచేస్తేనో కదా 
ఇల్లంతా నందనవనమై గుభాళించేది
ఆడపిల్ల అంటేనే సువాసనల గంధపుచెట్టు

ఎన్ని చిరునవ్వులను వెలిగిస్తేనో కదా
ఇల్లంతా వెన్నెలహారమై ప్రకాశించేది
ఆడపిల్ల అంటేనే ఇంటికి వెలుగు

ఎన్ని పలుకులతో సందడి చేస్తేనో కదా
ఇల్లంతా బృందావనమై కళకళలాడేది
ఆడపిల్ల అంటేనే నవ్వుల జలపాతం

ఎన్ని బాధలను తట్టుకుంటేనో కదా
గుండె నిబ్బరంగా జీవితాన్ని గెలిచేది
ఆడపిల్ల అంటేనే సబలగా సాక్షాత్కారం

ఎన్ని అనుబంధాలను ఆరాధిస్తేనో కదా
అనురాగదేవతై అవనిలో వెలిగేది
ఆడపిల్ల అంటేనే ఇంటిని వెలిగించే జ్యోతి

కవి మనస్సు గాయపడితేనే కదా
గాయం గేయమై ఆవిష్కృతమయ్యేది
కవి గేయం గుండెను తాకే ఆయుధం

గాలి పరిమళాన్ని మోస్తేనే కదా
పువ్వు వాసంతసమీరమై అల్లుకునేది
గాలి పువ్వును మోసే సుగంధరాజం

గండుకోయిల కమ్మగా కూస్తేనే కదా
వసంతాగమనం పరవశించి అరుదెంచేది
ప్రకృతికే పూసిన ఋతువు వసంతం

గాయపడిన మనిషి గేయమైతేనే కదా
బాధలను గేయాలుగా అక్షరీకరించేది
గేయం గాయపడిన మనిషి జ్ఞాపకం

పచ్చని నేల పరవశంగా ప్రసవిస్తేనే కదా
విత్తనం పసిమొగ్గలా నవ్వి విచ్చుకునేది
కొత్తజన్మకు ఊపిరిపోసేది నేలనే ఎప్పటికీ 

  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  
మొగ్గలు 
 మొగ్గలు 


🌷 ముసీ 🌷 మాసపత్రిక 🌷 జూన్ 🌷 2018 🌷

అక్షరాలు ప్రసవవేదన పడుతూనే ఉంటాయి        
కవిత్వమై వెలుగు చూడడానికి
అక్షరం సమాజాన్ని వెలిగించే దీపిక

పువ్వులు పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటాయి
వాసంతసమీరమై సుగంధాన్ని పంచడానికి
పువ్వు ప్రకృతిలో పూచే సుమధుర వీచిక

కవితలు నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాయి
అక్షరాల కవాతుతో సమాజాన్ని గెలవడానికి
కవిత్వం అనంతభావాల అక్షరవేదిక

చినుకులు నేలతల్లిని అభిషేకిస్తూనే ఉంటాయి
బీడువడిన పొలాలను పండించడానికి
వానచినుకు నేలపై నాట్యమాడే గోపిక

ప్రేమలు జీవితాన్ని గెలిపిస్తూనే ఉంటాయి
అనురాగపందిరియై నీడలా ఉండడానికి
ప్రేమంటే అనుబంధాల ఆత్మీయవేడుక

🌷భీంపల్లి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

ఆధునిక నూతన వచన కవితా ప్రక్రియ ''మొగ్గలు''



డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
జూన్ 2018
ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వారి వార్షిక సంచిక ''సింగిడి''

🌷 మనం 🌷 06-06-2018 🌷 బుధవారం


💧 నీటి మొగ్గలు💧


పంచభూతాల్లో ప్రాణపదమైనది కదా
సహజ వనరైన నీరు ప్రాణాలను నిలిపేది
నీరు జగతికి ప్రకృతి ఇచ్చిన వరం

భూగర్భజలాలు అడుగంటిపోతేనే కదా
నీరు మానవాళికి దక్కకుండాపోయేది
సర్వప్రాణకోటికి నీరే ప్రాణాధారం

నీటి ఎద్దడి మనిషికి ఎదురైతేనే కదా
ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టుకునేది
నీరే లోకంలోని జీవులకు జీవనాధారం

నీటిని అందరూ పొదుపు చేస్తేనే కదా
భూగర్భజలాలు ఇంకిపోకుండా ఉండేవి
నీటిని కాపాడుకుంటేనే రేపటికి భవిష్యత్తు

మంచినీరు అందరికీ దక్కితేనే కదా
మానవాళి సుభిక్షమై ఆనందంగా ఉండేది
ప్రతి నీటిబొట్టు అందరి ప్రాథమిక హక్కు


🌷 ⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘ 🌷