నానీలు 
గణేష్ దినపత్రిక 🌷 03-06-2018 
అక్షరాలను
పదాలతో వెలిగించాను
కవిత్వమై 
వెలుగుచూసింది

కవిత్వం
సమాజ ప్రతిబింబం
పహారా కాసే
చీకటి సూర్యుడు 

అక్షరాలు
కవితా దీపాలు
పదాల ఒత్తులతో 
వెలిగే కిరణాలు

కవిత్వం
నిత్యచేతనం
సమాజాన్ని మేల్కొలిపే
అక్షర దివిటి

అక్షరాలకు
ఆయుస్సు పోస్తే
అది పదాలతో
కవిత్వమై వెలిగింది

⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి