ప్రజాస్వామ్య ఉద్యమ కవి కబీర్ దాసు 























***********************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
పాలమూరు సాహితీ అధ్యక్షులు
22-07-2018


సామాజిక చైతన్యానికి ప్రతీక 
''పుట్టెడు నానీలు'' ఆచార్య. ఎన్. గోపి  


********************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
పాలమూరు సాహితీ అధ్యక్షులు
25-07-2018

పుట్టి గిరిధర్ తోలి కవితా సంపుటి  
''పుట్టెడు నానీలు'' ఆవిష్కరణ సభ 








*****************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
పాలమూరు సాహితీ అధ్యక్షులు 



"తెలంగాణ ముత్తైదువ"
===============

సకలజనులు సల్లంగుండాలంటూ
సపరివారం చేసే పండుగ బోనం
ప్రకృతినే మాతగా ఆరాధించే
అరుదైన తెలంగాణ పండుగ బోనం

తెలంగాణంటే
బోనాల జాతరకు వేదిక
సంబరాలు అంబరాన్నంటే వేడుక
ఆడబిడ్డల బోనాల మొక్కులు
పోతురాజుల దశావతార విన్యాసాలు
శివసత్తుల వీరావేశ పూనకాలు
కళ్ళు చెదిరే డప్పుల దరువులు

ఘటాలతో ఎదుర్కోల ఉత్సవం
దేవతా పలుకుల భవిష్యవాణి
ఊరేగింపుతో సంబరాల వీడ్కోలు
ఆడబిడ్డల ఆనందాల సందడి
తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ
మన  జాతర .... మన బోనం

బోనాల పండుగంటే
పుట్టింటికి వచ్చినంత సంబురం
ప్రతి ఇంటిని పలకరించే ఆత్మీయనేస్తం
ఏ ఇంటిని పలకరించినా 
బోనం ముత్తైదువై పలకరిస్తది
ప్రతి ఆడబిడ్డను ఆత్మీయంగా
సుమంగళియై దీవెనలిస్తది

బోనమంటే....
ఒక ఉత్సవం... ఒక ఉల్లాసం...
ఊరుఊరంతా కలిసి చేసే సంబరం
అందరిని ఒక్కటిగా చేసే ఏకతాస్వరం

బోనం...మా ఇంటి ఇలవేల్పు
            మా ఇంటి ఆడపడుచు
బోనమెత్తడమంటే
మన బతుకుల్ని మనమే వెలిగించుకోవడం
పచ్చగా మన బతుకులను పండించుకోవడం

బోనం పూనకమై ఊరేగిందా
ఊరు ఊరంతా జనజాతరే
బోనం రంగమై నాట్యం చేసిందా
పల్లెపల్లెంతా పసుపు తోరణాలే

బోనమంటే.... 
అనుబంధాలను పెంచే వారధి
ఆత్మీయులను కలిపే రథసారధి
బోనమంటే....
కష్టాలను మైమరపిస్తూనే
సంతోషాలను పంచే సల్లకుండ
జీవితం ఆనందంగా ఉండాలనే
బతుకుబండిని నడిపే రథచక్రం

ఆషాఢం మొదలైందా
తెలంగాణ పూనకమై ఊరేగుతది
ఆడపడుచులు పుట్టింటికి వస్తారా
బోనం పెయ్యంతా కళ్ళై ఎదురుచూస్తది

చరిత్ర ఎప్పటిదైనా
బోనం ఎప్పుడూ పచ్చబొట్టే
జీవితాలను పండించే నుదుటిబొట్టే

మైసమ్మ , పోశమ్మ , మాంకాళమ్మ
ఏ పేర్లతో పిలిచినా గ్రామదేవతలే
బోనాలతో సంతసించే పూనకాలే

తెలంగాణ సిగలో పూచిన 
బతుకుపువ్వులు బోనాలు
కులమతాలకు అతీతంగా
సందడి చేసే సబ్బండ బోనాలు

పోతురాజుల విన్యాసాలు
రంగం చెప్పే జాతకాలు
బోనాలకు నిండుదనాలు

బోనం మత్తడి దుంకిందా
ఊరంతా జనసంధ్రమే
జాతరలా ఊరేగిందా
ప్రతి మనిషి ఆనందపరవశమే

మనిషి బతకడం ఇవాళ
నిత్యం గగనమంత శోకం
గాయాలను మోస్తున్నంత భారం

యాడాదికోసారి ఊరికొస్తుందా
జాతరలా ఉప్పెనవుతుంది బోనం
గల్లిగల్లి తిరుగుతూ పలకరిస్తుందా
బతుకుపై ఆశలను రేకెత్తిస్తుంది

అవును....
బోనం మన పాలిట కల్పతరువు
మన బతుకులను బాగుచేసే ఆదరువు

బోనం....
తెలంగాణ నుదుటిన దిద్దిన కుంకుమతిలకం
జీవితాలను పచ్చగా పండించే పచ్చతోరణం
జీవితాలను వెలిగించే వెన్నెల సంతకం

**********************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నేటినిజం : 19-07-2018 
తెలంగాణ తొలి నవల ''ఆశాదోషం'' 


*************************************
 ✍ ✍ డాక్టర్ గుంటి గోపి 
 మూసీ మాసపత్రిక : పుస్తక సమీక్ష
సంపుటి : 20, సంచిక : 09
జులై  :  2018 





🌷 ప్రయాణం 🌷 


జీవితం ఒక ప్రయాణం         
బహుదూరపు ప్రయాణం 
అనంతంగా సాగే ప్రవాహం
                   
అన్ని ప్రయాణాలు ఒకేలా ఉండవు               
ఒక్కో ప్రయాణం ఒక్కో అనుభూతి             
                    
ఏ ప్రయాణమైనా దూరతీరాలను చేరడానికే  
ఆ తీరాలను తనివితీరా ఆలింగనం చేసుకోవాలని    
ఏ ప్రయాణమైనా నలుగురిని కలుసుకోవడానికే
ఆ నలుగురితో ఆనందాలను పంచుకోవాలని
ఏ ప్రయాణమైనా బంధువులను కలుసుకోవడానికే
ఆ బంధువుల ప్రేమామృతాలను ఆస్వాదించాలని  
అన్ని ప్రయాణాలు ఒకేలా ఉండవు       
ఒక్కో ప్రయాణం ఒక్కో మజిలీ   

ప్రయాణం చేసినప్పుడల్లా
ప్రకృతి పలకరిస్తూనే ఉంటది
అడుగులు వేసినప్పుడల్లా
చరిత్ర అడుగడుగునా దర్శనమిస్తూనే ఉంటది   
 పాదముద్రలు పడినప్పుడల్లా
ఆదిమానవ చరిత్ర కళ్ళముందే సాక్షాత్కరిస్తూనే ఉంటది 

              ఏ ప్రయాణమైనా చరిత్రను తెలుసుకోవడానికే           
చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావడానికే
ఒక్కో చరిత్ర ఒక్కో ఇతిహాసం
మానవ నాగరికత వికాసం
                                                           పాదయాత్రల పలకరింపులతోనే                                                                                                              
ఏ యాత్రలైనా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే
చరిత్రను లోకానికి అందించడానికే
                  చరిత్రను కౌగిలించుకుంటేనే కదా                 
తరతరాలు నవ్వుతాయి 
గతాన్ని స్మరించుకుంటేనే కదా
                      భవిష్యత్తులో పూలు పూస్తాయి                            
జీవితమంటే ప్రయాణమే
                          ప్రయాణమంటే జీవితమే                           
అవును జీవితం ఒక ప్రయాణం

************************************
✍ ✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 గణేష్ దినపత్రిక 🌷
🌷 07-07-2018 🌷





వందేళ్లక్రితం బరారు శ్రీనివాసశర్మ రాసిన చారిత్రక నవల ‘ఆశాదోషము’  పరిశోధకుల కృషితో ఇప్పటికి వెలుగు చూసింది. నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక గ్రామంగా ఉన్న కోయలకొండ గోలకొండ సుల్తానుల పాలనలో కీలకమైన దుర్గం. ఆ ఊరి వాస్తవ్యులైన శ్రీనివాసశర్మ ఊళ్లో ఉన్న దుర్గాన్ని అణువణువూ పరిశోధించి, శిలాశాసనాలను చదివి చరిత్రను అర్థం చేసుకుని, సరళ గ్రాంథికంలో ఆసక్తికరమైన నవలగా మలిచారు. 70 కోటలు వశపర్చుకున్న కుతుబ్‌షా ఈ కోటను వశపర్చుకోడానికి 9 నెలలు కష్టపడాల్సి వచ్చిందట. స్వతంత్రరాజ్యంగా ఉన్న కోయలకొండను మోసంతో ఆక్రమించిన వైనాన్నీ; ఆనాటి పాలన, సాహిత్య, జీవన శైలుల గురించీ తెలుసుకోవాలనుకునేవారికి ఉపయోగపడే తెలంగాణ తొలి నవల ‘ఆశాదోషము’.


ఆశాదోషము (నవల) 
రచన: బరారు శ్రీనివాస శర్మ 
పేజీలు: 178; వెల: రూ.100/-; 
ప్రతులకు: ఫోన్‌- 9849084918
- శ్రీ

  🌷 జీవిత మొగ్గలు 🌷


స్వచ్ఛమైన బాల్యం ఆహ్వానం పలుకుతుందా
సుకుమారమైన కౌమారప్రాయం అరుదెంచుతుంది
బాల్యం ఎప్పటికీ మనిషి జ్ఞాపకాల గంధపుచెట్టు

కౌమారం ఎగిసే యవ్వనానికై ఆరాటపడుతుందా
వింతవింత కోరికలను కలగంటూనే ఉంటుంది
కౌమారం ఎన్నటికీ చంచలస్వభావపు చిత్తరువు

యవ్వనం ఎగిసిపడే కెరటంలా దూసుకొస్తుందా
ఆశల కలలసౌధాన్ని నిర్మించుకుంటూనే ఉంటుంది
యవ్వనం రెక్కలపూలు పూచే ఊహల పూలవనం

ప్రౌఢవయసు నడిసంధ్రంలో నావలా పయనిస్తుందా
ఆటుపోట్ల అలజడులను తట్టుకుంటూనే ఉంటుంది
ప్రౌఢవయసు జీవితాన్ని రాపిడిపట్టే బాధలయంత్రం

వృద్ధాప్యం జీవిత చరమాంకంలోకి అడుగేస్తుందా
ముందుతరాలకు దారిచూపే దిక్సూచి అవుతుంది
వృద్ధాప్యం అనుభవాలను బోధించే పాఠశాల గది

*****************************
✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 మనం 🌷 దినపత్రిక 🌷
🌷 జులై 03 🌷 2018 🌷

🌷 నేను...!!🌷 



నేను... కాస్తూనే ఉంటాను !
మొగ్గనై వికసించి పరిమళించాలని
వెన్నెలనై చలువదనపు పందిరవ్వాలని

నేను... పూస్తూనే ఉంటాను !
పూవునై సుగంధాలను వెదజల్లాలని
రోజునై ఉదయాలను మొలకెత్తించాలని

నేను... రాస్తూనే ఉంటాను !
కవినై కవితామాలలు అల్లుకోవాలని
కళారవినై ఆనందాలను పంచాలని

నేను... పాడుతూనే ఉంటాను !
అన్యాయాలపై గాండీవం మోగించాలని
అక్రమాలపై సమరశంఖం పూరించాలని

నేను... వెలుగుతూనే ఉంటాను !
దివిటినై సమాజాన్ని పహారాకాయాలని
చీకటిసామ్రాజ్యాన్ని అంతమొందించాలని

నేను... చాటుతూనే ఉంటాను !
మానవాళికి మానవతాజ్యోతిని పంచాలని
సమతమమతలే సమాజానికి వెలుగుదివ్వెలని 

నేను... కలమవుతూనే ఉంటాను !
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కరదీపికవ్వాలని
రాజ్యాంగాన్ని సంరక్షించే చట్టమవ్వాలని

నేను... గొంతెత్తుతూనే ఉంటాను !
అరాచకాలను అడుగడుగున నిలదీయాలని
అంటరానితనాన్ని ఆమడదూరం ఉంచాలని

నేను... ఊపిరవుతూనే ఉంటాను !
మూగరోదనల అభాగ్యులకు ఆసరవ్వాలని
అన్నార్థుల ఆర్తనాదాలకు గొంతుకవ్వాలని

నేను... కాగడవుతూనే ఉంటాను !
దోపిడీ దౌర్జన్యాలను అంతమొందించాలని
చీకట్లో చిరుదివ్వెలను వెలిగించాలని

**************************************
✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 పాలపిట్ట 🌷 మాసపత్రిక 🌷
 🌷 జులై 🌷 2018 🌷

స్ఫూర్తిదాయకం ప్రభులింగ శాస్త్రి రచనలు





 ***********************************
✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
02-07-2018 : మహబూబ్ నగర్