హామీల రాజ్యం

నవ్య మీడియా 28-04- 2018

🌷📚  పుస్తకం మొగ్గలు 📚🌷

గణేష్ దినపత్రిక 28-04-2018

మనిషి గమనానికి చుక్కాని అవుతూనే
వెలుగు పంచే రవికిరణం అవుతుంది
పుస్తకం జీవితానికి దారిచూపే మార్గదర్శి

మనిషిని ఉన్నతశిఖరాలకు చేరుస్తూనే
ఉత్తముడిని చేసే పనిముట్టవుతుంది
పుస్తకం సంస్కారాన్ని నేర్పే సహవాసి

మనిషి ఆలోచనలకు పదునుపెడుతూనే
సరికొత్త ఆవిష్కరణలకు బాట వేస్తుంది
పుస్తకం విజ్ఞానాన్ని పంచే భాండాగారం

మనిషికి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూనే
భావిజీవితానికి వెలుగుబాటలు వేస్తుంది
పుస్తకం రెక్కలు తొడిగిన విజ్ఞానపక్షి

మనిషి విజ్ఞానానికి పునాది అవుతూనే
జ్ఞానసంపదను పంచే దివిటి అవుతుంది
పుస్తకం చీకటిని తరిమేసే జ్ఞానఖడ్గం

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

వార్త దినపత్రిక 23 ఏప్రిల్ 2018 సోమవారం 

కన్నీళ్ళను దాటుకుంటూ సంసారాన్ని మోస్తాను
కడలి కెరటాకోసం ఆదర్శంగా తీసుకుంటాను
కన్నీరే జీవితాన్ని స్వాంతనపరిచేది ఎప్పుడూ
బాధల బరువులతోనే బతుకును సాగిస్తాను

కష్టసుఖాలుంటేనే జీవితాన బతుకంటే
అలజడులుంటేనే ఆటుపోట్ల కడలంటే
చీకటివెలుతురులే జీవితంలో ఎప్పుడూ
కలిమిలేములుంటేనే బతుకు సాగడమంటే

జాబిల్లిన్నడుగుతాను చలువపందిరేయమని
సూర్యుడిన్నడుగుతాను వెచ్చనికౌగిలీయమని
రాత్రిపగలు జోడుగుర్రాలే కాలానికి ఎప్పుడూ
సాగరాన్నడుగుతాను తీరానికి చేర్చమని

ఎన్నెన్నో ముసుగులు కనపడని మనిషిలో
ఎన్నెన్నో ముసురులు అలుముకున్న చీకటిలో
కుట్రలుకుతంత్రాలే బతుకుదారిలో ఎప్పుడూ
ఎన్నెన్నో మాయలు కనిపించని గమనంలో

కనిపించని మానవతను కాగడాతో వెతుకుతాను
అగుపించని సమానతను దివిటితో పహారాకాస్తాను
సమతమమతలే మానవాళికి ఆదర్శం ఎప్పుడూ
అడుగడుగున దానవతను కలంతో తరుముతాను

 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


సూర్య దినపత్రిక 16 ఏప్రిల్ 2018 సోమవారం 

*పాపం పసివాళ్ళు*

ఏమిటి ఈ ఘోరం...!
ఏమిటి ఈ నరమేధం...!!

మల్లెపువ్వులా పరిమళించాల్సిన బాల్యం
కసాయి ముష్కరుల చేతిలో 
తుపాకిగుళ్ళకు బలికావడమేమిటి
బుడిబుడి నడకలతో బడికెళ్ళాల్సిన బాల్యం
తీవ్రవాదుల దారుణమైన రాక్షసక్రీడలో 
రక్తపుమడుగులో ఊయలలూగడమేమిటి

పిల్లలు రేపటి ఆశాకిరణాలు కదా !
భావికి బాటలు వేసే పునాదులు కదా !!
                 *        *        *
ఏమిటి ఈ రాక్షసత్వం !
ఏమిటి ఈ మరణమృదంగం !!

అగ్రరాజ్యాల అహంకార రక్తదాహానికి
సిరియా ఉగ్రవాదుల కర్కశ చేతుల్లో
బంగరుబాల్యం సమిధగా మారడమేమిటి
నియంతల నిరంతర ఆధిపత్యకాంక్షకు
నరరూప రాక్షసుల క్రూరత్వానికి
సిరియా మృత్యుశాలై శ్మశానం కావడమేమిటి

పిల్లలు కల్లాకపటమెరుగని నవ్వులు కదా !
రేపటి సూర్యోదయానికి విచ్చుకునే మొగ్గలు కదా !!

అగ్రరాజ్యాల ఉగ్రవాద ఉన్మాదానికి
ఏ పాపమెరుగని బోసినవ్వులపై  
మారణహోమం సృష్టించడమేమిటి
నియంతృత్వ ఆధిపత్య అరాచకానికి
కల్మషమెరుగని పసికూనలపై
రక్తం ఏరులై కాలువగా పారడమేమిటి
                                                                          
పిల్లలు అమాయక జీవులు కదా !
లేలేత హృదయాల శాంతిసుమాలు కదా !!
                 *          *          *
ఓ నియంతలారా...!
పసిపిల్లల ఆర్తనాదాలు మీరెపుడైనా విన్నారా
ఓ ఉగ్రవాదులారా...!
చిన్నారుల హాహాకారాలు మీరెపుడైనా కన్నారా

వెళ్ళండి...!
మళ్ళీ మళ్ళీ వెళ్ళండి...!
మీ బాల్యాన్ని జ్ఞాపకాలతో తడమండి
ఉక్కిరిబిక్కిరి చేసే అల్లరితో ఊపిరవ్వండి

ఏ పాపం చేశారని వారికీ మరణం
ఏ నేరం చేశారని వారికీ నరకం

వెళ్ళండి...!
మళ్లీ మళ్ళీ మళ్ళీ వెళ్ళండి...!
మీ పాపాలను కడిగేసుకుని రండి
మీ చేతులతో బాల్యాన్ని కాపాడండి
చిన్నారుల నవ్వులను మళ్ళీ బతికించండి !
బంగారు బాల్యాన్ని పూలతోటలా మార్చండి !!

 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


పూర్వ సాహిత్యం పద్యంలో రాజ్యమేలితే ఆధునిక సాహిత్యం వచన కవిత్వంలో రాజ్యమేలింది. ఈ వచన కవి త్వం కూడా అనేక రూపాల్లో విస్తరించి తన అస్తిత్వాన్ని నిలుపుకుంది. కాలానుగుణంగా మా ర్పులు వచ్చినట్లే సాహిత్యంలో నూ అనేక విప్లవాత్మక మార్పు లు చోటుచేసుకున్నాయి. ఆధునిక కవిత్వంలో వచన కవిత్వం, మినీ కవిత్వం, దీర్ఘ కవిత్వంలతో పాటు హైకూలు, రెక్కలు, నానీలు, నానోలు, ముక్తకాలు, టుమ్రీలు, చుక్కలు, వ్యంజకాలు, ముత్యాల సరాలు, మొగ్గలు వంటి నూతన కవితా ‘రూప ప్రక్రియ లు’ తెలుగులో వచ్చాయి.ఇందులో హైకూలు ఒక్కటే విదే శీ కవితా ప్రక్రియ కాగా, మిగతావి తెలుగు సాహిత్యంలోనే పురుడుపోసుకోవడం విశేషం.
తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం, మినీ కవిత్వం బాటలో ‘నానీలు’ కవితారూప ప్రక్రియ ఒక సంచలనాన్నే సృష్టించింది. దీని సృష్టికర్త డా.ఎన్.గోపి. దీనిని ఆయన 1997లో ప్రారంభించాడు. ఈ ‘నానీలు’ ప్రారంభించిన అనతికాలంలోనే అనేకమంది కవులు అక్కున చేర్చుకున్నా రు. వర్ధమాన కవుల నుంచి ప్రముఖ కవుల దాకా ‘నానీలు’ను సృష్టించినవారే ఇప్పటికీ ఈ కవితా ప్రక్రియలను రచిస్తున్నారంటే దీని ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు. ఇరవై ఏళ్ళుగా అప్రతిహతంగా కొనసాగుతున్న ప్రక్రియగా నానీలను చెప్పుకోవచ్చు.
నానీలు మొట్టమొదటిసారిగా ‘వార్త’ దినపత్రికలో 20 వారాలపాటు సంపాదకీయ పేజీలో ధారావాహికంగా ప్రచురించబడి తెలుగు సాహిత్యలోకానికి కొత్త చూపును ప్రసరించింది. అనంతరం 1998లో ‘నానీలు’ తొలిసారిగా పుస్తకరూపంలో వెలువడింది. 1997లో తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రక్రియగా ఆవిర్భవించిన ‘నానీలు’ నేడు ఎందరో కవులు నిత్యం రాస్తూ ‘నానీలు’ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారణం నాలుగే పాదాలలో నానీలను ఆవిష్కరించడం. ఈ నాలుగు పాదాల్లో కూడా 20 నుంచి 25 అక్షరాలు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. 20కి తగ్గకుండా, 25కు మించకుండా నానీలను రాయగలగాలి. అయితే మొత్తం నాలుగు పాదాల్లోని మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే, చివరి రెండు పాదాలు మరో అంశాన్ని చెబుతూ సమర్థించేదిగా ఉంటుంది. మొదటి రెండు పాదాలకు చివరి రెండు పాదాలు సమర్థింపు అన్నమాట.
‘నానీలు’ అంటే ‘నావీ నీవీ వెరసి మనవి’ అని అర్థం. అంటే నానీలు మనవేనని అర్థం చేసుకోవాలి. మన ఇళ్ళ ల్లో చిన్న పిల్లవాడిని ‘నానీ’ అని పిలుస్తుంటాం. అలా తెలుగు కవిత్వంలో ‘నానీలు’ చిన్నవి. చిన్న చిన్న పదాలతోనే పెద్ద పెద్ద భావాలను ఆవిష్కరించే ప్రయత్నమే ‘నానీలు’ యొక్క కవితాగుణం. దీనికి అక్షర నియమం తప్పి తే ఛందో నియమం లేదు. నాలుగు పాదాల పద్యాన్ని ఛం దస్సులో ఆవిష్కరిస్తే, అవే నాలుగు పాదాల నానీలను ఛందస్సు లేకుండా ఆవిష్కరించడం.
డా.ఎన్.గోపి ‘నానీలు’ను ఒక ప్రతిభావంతమైన వచన మినీ కవితాప్రక్రియగా సృష్టించాడు. అల్పాక్షరాలలో అనంతమైన భావాలను, ఆవిష్కరించే ప్రయత్నం ఈ ‘నానీలు’లో కనబడుతుంది. సంక్షిప్తత, సరళత, సూక్ష్మత, గాఢత, సాంద్రత ‘నానీలు’కు పట్టుగొమ్మలు. ఈ కొమ్మలుంటేనే నానీల చెట్టూ ఎదుగుతుంది. నేల సారవంతంగా ఉంటేనే వృక్షాలు సమున్నతంగా ఎదుగుతాయి. నానీలు కూడా అంతే. నానీల్లో ముఖ్యంగా భావ సాంద్రత ఉంటేనే అవి నిలుస్తాయి. కవిత్వపాలు ఉంటేనే మనుగడ సాగిస్తాయి. నానీలు రాస్తున్న కవులంతా దీనిని దృష్టిలో ఉంచుకొనే రాస్తున్నారు. ఇదొక విలక్షణత కల్గిన ఆధునిక నూతన ప్రక్రియ. ఇప్పటికీ వందల సంఖ్యలో ‘నానీలు’ను కవులు రాస్తున్నారు. వస్తు వైవిధ్యంతో నేటికీ నానీలు వివిధ పత్రికల్లో వెలుడుతూనే ఉన్నాయి. వందల సంఖ్య లో కవితా సంపుటాలు వెలువడ్డాయి.
గోపి రాసిన ఈ నానీ చూడండి
‘కుండ ముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరోరూపం కోసం/ సిద్ధమౌతుంది’ ఇందులోని రెండు పాదాలు ఒక భావాంశాన్ని చెబితే, మిగతా రెండు పాదాలు సమర్థించేవిగా చెప్పబడింది. చిన్నపాదాలలోనే అనంతమైన భావా న్ని ఈ నానీలో ఆవిష్కరించబడింది. అనేక విభిన్న వస్తువుల సమాహార రూపం ‘నానీలు’. సమాజంలోని భిన్న ప్రవృత్తులను ఆవిష్కరించే ప్రయత్నమే ‘నానీలు’ ఆవిష్కరించిడానికి కారణం. జీవితాన్ని రాపిడిపడితేనే అనుభవాలు అక్షరాలుగా మారి నానీలుగా రూపాంతరం చెందుతాయి. ఒక్కో అనుభవం మానవసంవేదనల ప్రతిరూపం. అనుభూతుల్లో తడిసిన ప్రతి అక్షరసుమాలను ‘నానీ’ కవితామాలగా ధరిస్తే అది తెలుగు సాహిత్యంలో పరిమళభరితమవుతుంది. సాహితీలోకానికి సుగంధాలను వెదజల్లుతుంది. ఇంతవరకు వెలువడిన నానీల్లో సామాజికాంశాలతో పాటు ప్రాకృతికత, తాత్వికతలే కాక అమ్మ, నాన్న, గురువు, భక్తి, రైతు, పల్లె, ప్రేమ, దేశభక్తి, చేనేత, కుటుం బం, తెలంగాణ, నగరం, వృత్తులు, జాతిరత్నాలు మొదలైన అంశాలను నానీల్లో బలంగా కవులు చాటారు. ఇంకా విభిన్నమైన వస్తువులతో నానీలను ఆవిష్కరిస్తున్నారు. రాయడానికి సులువైన కవితా ప్రక్రియలో నానీ ప్రక్రియ ఒకటి.ఇదొక దేశీయ కవితాప్రక్రియగా తెలుగు సాహిత్యం లో నిలిచిపోయింది. ఎంతోమంది ప్రసిద్ధ కవులునానీలను తమ గుండెలకు హత్తుకుని నానీ దీపాలను వెలిగించారు.
తెలుగు సాహిత్య లోకంలో నానీ ప్రక్రియకు ఊహించలేనంత  
ప్రాచుర్యం లభించడం నిజంగా నానీ ఒక కవితా ప్రక్రియగా విజయవంతంగా రావడానికి కారణమైంది. ఎన్.గోపి అనంతరం నానీలను సుప్రసిద్ధ కవులు రాయడం విశేషం. డా.ఎస్.రఘు, కోట్ల వేంకటేశ్వరరెడ్డి, ఎస్.ఆర్.భల్లం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, అంబల్ల జనార్ధన్, డా॥ ద్వానాశాస్త్రి, రసరాజు, డా॥ సి.భవానీదేవి, డా॥ నలిమెల భాస్కర్, నాంపల్లి సుజాత, అన్నవరం దేవేందర్, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య సూర్య ధనుంజయ, నేతల ప్రతా ప్ కుమార్, వల్లభాపురం జనార్ధన, డా.భీంపల్లి శ్రీకాంత్ తదితరులు నానీలను బలంగా రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. నానీలను ఎంతరాసినా అది తరగని గని. విభి న్న అంశాలను వైవిధ్యమైనరీతిలో కవిత్వంగా చెప్పడం నానీల్లోనే సాధ్యమవుతుంది. తెలుగులో ఎన్ని మినీకవితా రూప ప్రక్రియలు వచ్చినప్పటికీ ఒక బలమైన రూపప్రక్రియలుగా ‘నానీలు’తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది.
నానీ వ్యష్టిగా ప్రారంభమై సమిష్టిగా ఎదిగింది. ఒక సాహితీ శక్తిగా రూపాంతరం చెందింది.ఒక సాహిత్య ప్రక్రియగా అవతరించి వచన కవితా సరసన నిలబడింది. ప్రక్రియ సులువుగా ఉండడంతో తెలుగు కవులంతా దీనివైపు దృష్టి సారించారు.నానీలను బలంగా ఆవిష్కరించా రు. దీంతో నానీల విజయయాత్ర తెలుగు సాహిత్యంలో కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.రెండు దశాబ్దాలకు పైగా ఒక కవితా ప్రక్రియ ఇంకా సజీవంగా కొనసాగుతున్నదంటే నానీ రూపం అందరికీ నచ్చడమే. రూ పంలో చిన్నవిగా,భావంలో పెద్దవిగా ఉండడంనానీల విశే ష లక్షణం.ఆ రూపశిల్పి గోపి మీద ఉన్న అభిమానమే.
డా॥ ఎన్. గోపి నానీలు రాసిన తరువాత మొదటి సారిగా ఆ ప్రక్రియను అందుకుని ప్రముఖ కవి డా॥ ఎస్. రఘు అనేక నానీలను రచించాడు. అన్నీ బలమైన నానీలనే రచించడం విశేషం
‘వంతెన పునాదులు/నీళ్లల్లో /జీవితం పునాదులు/ కన్నీళ్లలో’ ఇలాంటి నానీలు డా॥ ఎస్. రఘు కలం నుంచి పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. జీవితాన్ని వడబోసిన నానీ ఇది. ప్రముఖ కవి కోట్ల వేంకటేశ్వరరెడ్డి ‘నగరం’ గురించి అద్భుతమైన నానీ రచించాడు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆంధ్రవలసవాదులు నగరానికి వచ్చి, నగరాన్ని ఎట్లా విచ్చలవిడితనానికి గురి చూసిందో చక్కగా నానీలో ఆవిష్కరించారు.
‘నగరాన్ని చూస్తే/ అమ్మక్కను చూసినట్లుండేవి/ వాడొచ్చిండు/ వరస మారింది’ ఒకప్పుడు నగరం అందరినీ ఆలింగనం చేసుకునే ఆత్మీయనేస్తం. వలసవాదులు అడు గు పెట్టారో లేదో వరసలు మారిపోయి నగరం విచ్చలవిడితనానికి అలవాటుపడిందని చెబుతాడు.
పదాలు మామూలువే అయిన ఆవిష్కరించడతోనే దాని విశిష్టత తెలుస్తుంది.భావవ్యక్తీకరణకు నానీలు ఆలంబన కావడంతో ప్రత్యామ్నాయ కవితా ప్రక్రియగా తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకుంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి లాంటి వారు కూడా నానీలను గుండెలకు హత్తుకోవడం విశేషం. గ్రామీణ జీవన పరిస్థితులను వర్ణి స్తూ సీమ నానీలును రాచపాళెం ఆవిష్కరించాడు.
‘వలస తలుపులకు/బ్యాంకు నోటీసా/ఏ దరికి చేరునో/ రెండో మరణశాసనం’వలసనుమొదటి మరణంగా భావిం చి, బ్యాంకు నోటీసును రెండో మరణశాసనంగా వర్ణించిన తీరు పల్లె జీవన చిత్రాన్ని కళ్ళకుకడుతుంది. పల్లె ఏ కాలమైనా వలసలకు కేంద్రమై విలసిల్లుతూనే ఉంటుంది.
ప్రముఖ రచయిత్రి డా.సిభవానిదేవి వివాహాన్ని గురించి చెప్పిన నానీ అందరినీ ఆలోచింపజేస్తుంది.
‘వివాహమా/ఎంతపని చేశావ్ ?/పుట్టింటికే/నన్ను అతిథి ని చేసేశావ్’ ఇది మహిళలందరికీ వర్తించే సజీవమైన నా ని ఆలోచింపజేసే నాని.ఇది నానీలలో బాగా పేలిన నాని.
మహిళలకు పుట్టిల్లు, మెట్టిళ్ళు రెండు ఉంటాయి. వా రికి రెండూ సమానమే. అయినా మెట్టింటి కడప తొక్కినం క పుట్టినిళ్ళు అతిథి ఇల్లుగా కన్పిస్తుంది. ఇదే భావనపై నానీలో ధ్వనించింది. ఒక వ్యంగ్యంగా, సూటిగా,ప్రశ్న గా చెప్పిన నాని ఇది. అనాదిగా రైతుది జీవన్మరణ సమ స్యే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారనిది రైతు బతుకు ఒక్కటే. అలాంటి రైతు గురించి నానీలు కూడా చాలావ చ్చాయి. ప్రముఖ కవి, విమర్శకుడు,భాషావేత్త డాక్టర్ నలిమెలభాస్కర్ నానీల్లో రైతుల వ్యధలను కళ్ళకు కట్టాడు.
‘నాగలితో / తెడ్డు వేస్తున్నాడు/ దరికి చేరునో/రైతుబిడ్డ’
రైతు జీవితాన్ని ఆవిష్కరించిన నానీ ఇది. అతని జీవితమంతా నాగలితో ముడివేసుకునే ఉంటుంది. అలాంటి నాగలి మంచి పంటను పండిస్తే రైతు జీవితం ధన్యమవుతుంది. లేకపోతే జీవితమే అల్లకల్లోమవుతుందనే ధ్వనిని ఈ నానీలో వెల్లడించాడు. కాలం కలిసి రాకపోతే మనిషై నా, మానైనా ఒకటే. ఒకప్పుడు ధాన్యరాశులతో కళకళలా డే పంటపొలాలు నేడు బీళ్ళుగా మారటాన్ని అనేకమం ది కవులు నానీల్లో ఆవిష్కరించారు.ప్రముఖ కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య ‘రెప్పల చప్పుడు’లోని ఒక నానీలో ఇలా అంటాడు.
‘పొలం/ఒకప్పుడు వాడికుండే/‘కళ్ళం’ కళ తప్పి/గాదె వొట్టిపోయిందంతే’ ‘కళ్ళం’ కళ తప్పిందంటే పంట దిగుబడి రాలేదని, పంట సరిగా పండలేదని. పంట పండితేనే రైతన్నకు ఆనందం. దేశానికి సౌభాగ్యం. పల్లెలు మమతానురాగాల పల్లెకొమ్మలు. ఇప్పుడవి వాడిపోయిన వాసంతసమీరాలు. ఒకపుడు పల్లెలు ఎలా ఉండేవో చెబుతూ దాస్యం సేనాధిపతి ఇలా  అంటాడు. ‘ఆత్మీయతానురాగాల/మమతలు పంచే/మన పల్లెలు/కాదనగలమా మనం’ ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికీ పల్లెకుపోతే అదే ఆత్మీయత కన్పిస్తుంది. కానీ,అప్పటి మనుషుల్లా నేటిమనుషులులేరన్నదే జీర్ణించుకోలేని సత్యం. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మట్టి స్వభావాన్ని నానీలలో చక్కగా ఆవిష్కరించాడు.తను పుట్టిన నేలను నానీల్లో సాక్ష్కాత్కరింపజేశాడు.ఇలా నానీలను ఎందరెందరో కవు లు కొత్తకొత్త అభివ్యక్తితో,వైవిధ్యంతో,విభిన్న అ ంశాలతో కొత్త రూపాలను సంతరించుకుంటూనే సాగిపోతోంది. ‘నానీల నాన్న’ అయిన డా.ఎన్.గోపి నానీల విత్తు వేస్తే కవులు మొగ్గలై, మొక్కలై, పూలై, రెమ్మలై , కొమ్మలై రెపరెపలాడుతూనే ఉన్నారు నానీల జెండాలను ఎగరేస్తూ.

డా॥ భీంపల్లి శ్రీకాంత్
9032844017
మన తెలంగాణ 16-04-2018 సోమవారం 
🌷 మొగ్గలు 🌷


గణేష్ దినపత్రిక 15-04-2018

నాలోకి నేను తొంగిచూసుకున్నప్పుడల్లా
భావాలెన్నో ఉదయిస్తూనే ఉంటాయి
కాలగమనంలోనే ప్రశ్నలకు సమాధానాలు

నేను ఒంటరి వాడినవుతున్నప్పుడల్లా
గతాన్ని తలుచుకుంటూనే ఉంటాను
భవిష్యత్తు ఎప్పుడూ ప్రశ్నార్ధకమే

నా మనసు గాయపడుతున్నప్పుడల్లా
కవిత్వమై కరిగిపోతూనే ఉంటాను
అక్షరాలనిండా గాయాల గుర్తులే

నాలో నేను కుమిలిపోతున్నప్పుడల్లా
కవిత్వంతో సాంత్వన పడుతుంటాను
అక్షరం నా మనసుకు ఆత్మీయనేస్తం

హృదయం బరువెక్కినప్పుడల్లా
కన్నీటి ప్రవాహమై ప్రవహిస్తుంటాను
జీవితంలో అన్నీ కనపడని గాయాలే

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
పుష్కర కృష్ణవేణి 


సాక్షి మహబూబ్ నగర్ జిల్లా 
15 ఏప్రిల్ 2018 ఆదివారం 


నీ జ్ఞాపకాలను చప్పరిస్తూ ఉంటూనే
ప్రేమ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను
ప్రేమంటే తీపి జ్ఞాపకాల ఊటచెలెమె

నా మనోసరస్సులో ఉత్తుంగతరంగలా
నిత్యం ఎగిసెగిసిపడుతుంటావు నువ్వు
ప్రేమంటే సాగర కెరటాల నిత్యహోరు

నా హృదయకోవెలలో దేవతామూర్తిలా 
నిన్ను నిత్యం అభిషేకిస్తూనే ఉంటాను
ప్రేమంటే ఆరాధానుభూతుల మౌనాభిషేకం

నా ప్రణయసీమలో ప్రేమైకమూర్తిలా
నిన్ను ప్రతిక్షణం ఆరాధిస్తూనే ఉంటాను
ప్రేమంటే ఎదురుచూపుల విరహగీతం

నీతో గడిపిన ప్రతి మధురక్షణం 
నాకు ఆనందాల హరివిల్లే అవుతుంది
ప్రేమంటే ఎదను మీటే మధురరాగం

✍✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷




వసంతం వాలని ప్రకృతిలా
బోసిపోయిన ఇల్లు
అలజడులు లేని సముద్రంలా
మూగబోయిన ఇల్లు

నిత్యం సందడి చేసే సీతాకోకచిలుకలు
వేసవిస్వప్నాన్ని కంటూ వలసపోయాయి

ఇల్లు పూలతోటలా కళకళలాడిందంటే
పసిమొగ్గల పరిమళాల గుభాళింపులతోనే

ఇంట్లో నవ్వులు హరివిల్లులా విరిసాయంటే
అల్లరి జలపాతాల అనంతసవ్వడులతోనే

ముద్దులొలికే మాటలు మురిపించాయంటే
బాలబ్రహ్మల మధురమైన వేదవాక్కులతోనే

నిత్యం కేరింతలతో నిద్రలేచే ఇల్లు
ఇవాళ ఒంటరిపక్షిలా మూగబోయింది

రోజూ కొత్తప్రపంచమై ఉదయించే ఇల్లు
ఈరోజు శూన్యావరణాన్ని కప్పుకొంది

రోజూ వెన్నెలవెలుగులను పంచే ఇల్లు
ఇవాళ అమావాస్య చీకటిని తలపిస్తుంది

వాళ్ళు ఉంటేనే ఇల్లు నందనవనమై
అందమైన పూలతోటలా పుష్పించేది

వేసవికాలంలో సరదాకై వాళ్ళు
బోసిపోయిన ఇల్లులా మేము

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
నవ్య మీడియా 15-04-2018 
అవును...నేను కవినే



నేను కవిని...!
సమాజానికి వెలుగునిచ్చే రవిని...!!

కళ్ళముందు సంఘటనలకు ప్రబలసాక్ష్యాన్ని
వాస్తవాలను చిత్రిక పట్టే కవితారావాన్ని
భవిష్యత్తుకు ప్రగతిదారులను వేసే రథచక్రాన్ని

అసమానతల అడ్డుగోడలకు కరవాలాన్ని
అన్యాయాన్ని ప్రశ్నించే అపరకాళికానాదాన్ని
అధర్మంపై పోరాటం సల్పే ధర్మయుద్ధాన్ని

అవును నేను కవిని...!
మానవతను బతికించే కవితారవిని...!!

మానవతాపూలను పుష్పించే సుగంధాన్ని
సమతమమతలను కోరే మానవత్వాన్ని
శాంతికపోతాలను ఎగరేసే తెల్లపావురాన్ని

సమాజాన్ని నడిపించే ఛోదకశక్తియంత్రాన్ని
వర్తమానాన్ని ఒడిసిబట్టే నదీప్రవాహాన్ని
సమాజ సంక్షేమాన్ని కోరే నిత్యచైతన్యాన్ని

అవును నేను కవినే...!
మనిషిని మనీషిగా మార్చే ఋషినే...!!

చీకటిసామ్రాజ్యాన్ని తరిమేసే వెన్నెలకిరణాన్ని
అభాగ్యులను ఆదుకునే ఆపన్నహస్తాన్ని
నిరుపేదల కన్నీళ్లను తుడిచే వసంతరాగాన్ని

అనుబంధాలను పెంచే ఆత్మీయనేస్తాన్ని
ఉషోదయాన్ని ఆహ్వానించే ఉత్తుంగతరంగాన్ని
సమాజ మార్పును కోరే సదా లోకహితున్ని

అవును... నేను కవిని...కవితారవిని...!
అక్షరాలను వెలిగించే నిత్యకవితాజ్యోతిని...!!

పూణె ఆంధ్ర సంఘం ఉగాది ప్రత్యేక సంచిక  "ఆమని"
✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

దిక్సూచి

10-04-2018 మంగళవారం

రుబాయిలు

గణేష్ దినపత్రిక 10-04-2018

కన్నీళ్ళను దాటుకుంటూ సంసారాన్ని మోస్తాను
కడలి కెరటాలను ఆదర్శంగా తీసుకుంటాను
కన్నీరే జీవితాన్ని స్వాంతనపరిచేది ఎప్పుడూ
బాధల బరువులతోనే బతుకును సాగిస్తాను

కష్టసుఖాలుంటేనే జీవితాన బతుకంటే
అలజడులుంటేనే ఆటుపోట్ల కడలంటే
చీకటివెలుతురులే జీవితంలో ఎప్పుడూ
కలిమిలేములుంటేనే బతుకు సాగడమంటే

జాబిల్లిన్నడుగుతాను చలువపందిరేయమని
సూర్యుడిన్నడుగుతాను వెచ్చనికౌగిలీయమని
రాత్రిపగలు జోడుగుర్రాలే కాలానికి ఎప్పుడూ
సాగరాన్నడుగుతాను తీరానికి చేర్చమని

ఎన్నెన్నో ముసుగులు కనపడని మనిషిలో
ఎన్నెన్నో ముసురులు అలుముకున్న చీకటిలో
కుట్రలుకుతంత్రాలే బతుకుదారిలో ఎప్పుడూ
ఎన్నెన్నో మాయలు కనిపించని గమనంలో

కనిపించని మానవతను కాగడాతో వెతుకుతాను
అగుపించని సమానతను దివిటితో పహారాకాస్తాను
సమతమమతలే మానవాళికి ఆదర్శం ఎప్పుడూ
అడుగడుగున దానవతను కలంతో తరుముతాను

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 


 ఆంధ్రరభూమి 09-04-2018


ఆశాదోషం
రచయత : బరారు శ్రీనివాసశర్మ
పేజీలు: 178 వెల: రూ.100
ప్రతులకు:
శ్రీమతి హేరూర్ శోభా విజయకుమార్
3-4-468, రెడ్డి వుమెన్స్ కాలేజీ ఎదురుగా
బర్కత్‌పుర, హైదరాబాద్-2
9849084918

*
దాపు పది దశాబ్దాల క్రితం పాలమూరు జిల్లా కోయిలకొండ వాస్తవ్యులు బరారు శ్రీనివాసశర్మ గారు ‘ఆశాదోషం’ పేరుతో ఓ నవల రాసి... కోయిలకొండ చరిత్రను అందులో పొందుపరిచారు. తెలంగాణ తొలి నవలగా భావింపబడుతున్న ఈ గ్రంథం చాన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది.. సరళమైన గ్రాంథికంలో రూపుదిద్దుకున్న ఈ నవలలో.. సుమారు వంద ఏళ్ల క్రితం ఆనాటి పాలకులు పరిపాలించిన తీరుతెన్నులు.. ఆనాడు పండుగలు, ఉత్సవాలు, పెళ్లిళ్లు ఎలా నిర్వహించేవారో.. ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు! 1913 ప్రాంతంలో బరారు శ్రీనివాసశర్మ రచించిన ఈ గ్రంథం అబద్ధమని భావిస్తున్న నేపథ్యంలో... డా.్భంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో పాలమూరు సాహితి వారు ప్రచురించి.. అందరికీ అందుబాటులోకి తేవడం అభినందనీయం! ఈ గ్రంథ రూపకల్పనలో.. నాగలింగ శివయోగి సేకరించిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందని తెలుస్తోంది.. శ్రీమతి హేరూర్ శోభా విజయకుమార్ దంపతులు ఈ గ్రంథ ముద్రణలో భాగస్వాములై.. మరుగున పడ్డ తెలంగాణ తొలి నవలగా చెప్పబడే.. ‘ఆశాదోషము’ పుస్తకాన్ని భావితరాలకు అందించ యత్నించడం ప్రశంసనీయం! తెలంగాణ ఆణిముత్యంగా పేరొందిన బరారు శ్రీనివాసశర్మ గారి మనుమడు బరారు విజయ్‌కుమార్ కృషితో, పాలమూరు సాహితి చొరవతో వెలుగు చూసిన ఈ నవల తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా ముస్తాబై రావడం ముదావహం!
కోయిలకొండ చరిత్రను ప్రతిబింబించేలా.. ఇందులోని పాత్రలు - సన్నివేశాలు, సంఘటనలను అందంగా ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ కానవస్తోంది.
ఈ నవల మొదటి ప్రకరణములో.. బాటసారికి పొలము ప్రక్కనే.. రాత్రికి బస ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకునేలా కాపువాడు ఆతిథ్యమివ్వడం.. బాటసారిని చూసి పడుచుపిల్ల భయపడిన ఘటనలు.. ఆసక్తికరంగా మలచబడ్డాయి. రెండో ప్రకరణములో - హిందువులు, ముస్లింలు సమానమేనన్న అంశం చక్కగా ప్రస్తావించబడింది. శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ సమేతంగా సంచరించిన పర్వతమైన రామగిరి సమాచారాన్ని అందులో పొందుపరిచిన తీరు బాగుంది. మూడో ప్రకరణములో - సీత, చంపక సంభాషణలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నాల్గవ ప్రకరణంలో - కోయిలకొండ దుర్గం యొక్క విశేషాలున్నాయి!
దుర్గం మహాద్వారం ముందర వున్న తటాకం.. చిత్రవిచిత్రమగు దుర్గం యొక్క కట్టడాలను చక్కగా దృశ్యమానం చేశారు. ఆనాటి ఫలవృక్షాలను.. తోటయందున్న గచ్చుమేడను.. వనపాలకుల గృహాలు, అంగడిలో జరిగే వ్యాపార వ్యవహారాలు.. వెలమ నాయకులు ఉండే వీధిలో గల సౌధాలను, గ్రామాధికారుల ఇళ్లను, సర్దారుల మేడలను, ఏనుగు శాలలను, తురగ శాలలను, వ్యాయామ శాలలను ఈ ప్రకరణంలో చక్కగా చిత్రించారు. వెలమ వీధిలో ఒక సౌధంపై ఏకాంత ప్రదేశంలో ఇద్దరు పురుషులు చింతాక్రాంతులై.. మాట్లాడుకున్న ముచ్చట్లను చక్కగా అక్షరబద్ధం చేశారు.
ఐదవ ప్రకరణంలో ‘కామజ్వరం’ శీర్షికన పొందుపరిచిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బలవంతరావు, కళ్యాణరావుల మధ్య జరిగే సంభాషణలు బాగున్నాయి!
ఆరవ ప్రకరణంలో.. ‘వలీదర్శనం’ శీర్షికన హిందూ తురకలు అన్న భేదం లేదనీ.. అందలి పరమాత్ముడు ఒక్కడేనన్న చక్కని సందేశాన్ని అందజేశారు. వలీ పాత్ర ఉన్నతంగా చిత్రించబడింది. ఏడవ ప్రకరణంలో.. రాజు - సన్యాసిల మధ్య న్యాయ విచారణ సంభాషణలు పొందుపరిచారు. ఎనిమిదవ ప్రకరణంలో గల కమల, చంపక, సీతల సరస సంభాషణలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తొమ్మిదో ప్రకరణంలో.. కోయిలకొండ ప్రజలు రాజభక్తి పరాయణులని తెలుసుకుంటాము.. మొగిలి రేకువల్ల వలీకి ఒనగూరిన ప్రయోజనాలను రేఖామాత్రంగా ప్రస్తావించారు. పదవ ప్రకరణంలో.. రంజాన్ అలీ శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించారు. ఆనాడు సారాయి కోసం.. బట్టలు, నాణేలు, నగదు, ధాన్యాలు, శస్త్రాలు సారాయి దుకాణదారుని వద్ద కుదువపెట్టే అంశాలను ఈ ప్రకరణంలో ప్రస్తావించారు.
పదకొండవ ప్రకరణంలో... భోజనానంతరం విశే్వశ్వరరాయుడు, పురుషోత్తమ రాయుడు మల్లెశాల యందు విశ్రాంతి తీసుకుంటూ ముచ్చటించిన మాటలను అక్షరాల్లో చక్కగా బంధించారు. పనె్నండో ప్రకరణంలో.. తురాబల్ మురావలీకి ఆతిథ్యమిచ్చే సన్నివేశాలు బాగున్నాయి! పదమూడో ప్రకరణంలో.. కోయిలకొండ రాజ్యమును కాపాడుటకు బలవంతరాయుడే సరియైన యోధుడని బసవరాజు ప్రకటించే ఘట్టాలు బాగున్నాయి! తన కూతురు సీతను బలవంత రాయుడికిచ్చి వివాహం చేస్తానని బసవరాజు ప్రకటించే సన్నివేశాలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి! బలవంత రాయున్ని ఈ ప్రకరణంలో.. మహాబుద్ధిశాలిగా.. రూపవంతునిగా.. గుణ సంపన్నుడిగా రచయిత మన ముందు నిలిపిన తీరు బాగుంది. పధ్నాలుగో ప్రకరణంలో.. దుర్గ ప్రాకారాన్ని కళ్యాణం కోసం.. రమణీయంగా అలంకరించిన సన్నివేశాలను అందంగా ఆవిష్కరించారు. ఈ ప్రకరణం ద్వారా ఆనాడు పెళ్లిళ్లలో ముఖ్యంగా కోట ద్వారాలను.. పరిసర ప్రాంతాలను ఎంత చక్కగా అలంకరించారో తెలుసుకోగలం! పదిహేనో ప్రకరణంలో.. కులీ కుతుబ్‌షాహీ రాయబారి పంపిన సందేశం సభలో వినిపించే దృశ్యాన్ని చక్కగా పొందుపరిచారు. పదహారో ప్రకరణంలో.. దండెత్తి వచ్చిన సైనికులను ఎదిరించి.. క్షణభంగురమగు శరీరమును మాన రక్షణకై తృణప్రాయంగా భావించి.. ప్రాణత్యాగం చేసిన నిండు గర్భిణి వృత్తాంతం అందరినీ కలచి వేస్తుంది. వృద్ధులు, పిల్లలు, అతివలు అన్న తారతమ్యం లేక దండుగా వచ్చిన సైనికుల ఆగడాలను కళ్లకు కట్టినట్లుగా ఈ ప్రకరణంలో దృశ్యమానం చేశాడు. పదిహేడో ప్రకరణంలో... కుతుబ్‌షాహీ సైనికులు కోయిలకొండ కోటను ముట్టడించడానికి చేసిన అరాచకాలను అక్షరీకరించారు. అయితే ఈ యుద్ధంలో తురకలను ఓడించి.. హిందువులకే విజయాన్ని చేకూర్చి.. అంతర్ దుర్గంపై విజయ పతాకాన్ని ఎగురవేసిన తీరుతెన్నులను ఈ ప్రకరణం ద్వారా తెలియజెప్పారు.
పద్దెనిమిదో ప్రకరణంలో.. శారద విరహ తాపాన్ని రమణీయంగా చిత్రించారు. కోయిలకొండ దుర్గంపైకి నవాబు వెంట వెళ్లే భర్త విశే్వశ్వర రాయుడు వెంబడి శారద వెళ్లే సన్నివేశం బాగుంది. పందొమ్మిదో ప్రకరణంలో ‘కుతుబ్ సముద్రము’ శీర్షికన రాసిన ఖండికలో.. నవాబు ఇరువది వేల సైనికులతో దుర్గంపైకి దాడికి వస్తున్నట్లు తెలిసిన నేపథ్యంలో బసవరాజు తాను ధైర్యంగా వుంటూ తన సైన్యం ధైర్యంగా పోరాడేందుకు సంసిద్ధులను చేసే ఘట్టాలు బాగున్నాయి. ప్రకరణం ఇరవైలో.. నవాబు దుర్గంపై దాడికి వచ్చిన సమయాన.. ఆనాడు యుద్ధంలో వినియోగించబడిన ఫిరంగులు, తుపాకులు తదితర ఆయుధ సామాగ్రిని వివరించారు. యుద్ధ సన్నివేశాలను ఈ ప్రకరణంలో చక్కగా పొందుపరిచారు. యుద్ధ సమయాన గ్రామస్థులు పడిన ఇక్కట్లు.. కష్టనష్టాలను ఇందులో చూడగలం! చివరకు కుతుబ్ షాహీ కోయలకొండ దుర్గాన్ని జయించలేక.. గోలకొండకు తిరిగి వెళ్లడం వంటి అంశాలు... కోయలకొండ పాలకుల ధైర్యసాహసాలు.. పరాక్రమాన్ని చాటేలా ఉన్నాయి. ఇలా ఈ నవల ద్వారా ఆనాటి పాలకుల పాలనా విధానాన్ని.. ఆనాటి ఆచార వ్యవహారాలను.. పండుగలు, వివాహాది ఉత్సవాల తీరుతెన్నులను చాటి చెప్పారు.
కోయలకొండ దుర్గం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ నవల ద్వారా తెలుసుకోగలం. ఇందలి అనేక సన్నివేశాలు.. సంఘటనలు.. ఘట్టాలు.. సందర్భోచిత వర్ణనలు.. పాత్రలు, పాత్రల మధ్య సంభాషణలు పాఠకులు ఏకబిగిన చదువుకోవడానికి ఉపయోగపడతాయి! కోయలకొండ దుర్గ చరిత్రను ప్రతిబింబిస్తూ.. తెలంగాణ తొలి తెలుగు నవలగా వచ్చిన ఈ గ్రంథంలోని అంశాలు చారిత్రక పరిశోధకులకు కావలసినంత సమాచారాన్ని అందజేయగలదన్న విశ్వాసం ఉంది.








కళ తప్పిన పల్లె

గణేష్ దినపత్రిక 09-04-2018

పల్లె అంటే
                         ఒకప్పుడు మల్లె మనసుల                            మమతల మాగాణం
ఇప్పుడు
కళ తప్పిన శ్మశానం

పల్లె అంటే 
పండుగలు పబ్బాలేనా...
యక్షగానాల హరివిల్లు
బోగమోల్ల నాటకాలు
భజనల ఆనవాళ్లు
కోలాటాల కోలాహలం
జాతరల ఉత్సాహం
బొడ్డెమ్మల ఆటలు
బతుకమ్మల పాటలు

ఇప్పుడు పల్లె
ఎండిన చెరువయ్యింది
బీడువడిన పొలమయ్యింది

ఒకప్పుడు పల్లె అంటే
నాటకాల సమూహం
నవరసాల సమ్మేళనం
ప్రతి మనిషి
పాలనురుగై ప్రవహించేవాడు
                       మమతల మల్లెను అల్లేవాడు                           
ఇప్పుడు పల్లె అంటే
ముగిసిపోయిన నాటకం
శిథిలమైన సంస్కృతి

జీవితం...
నాటకరంగమైనపుడు
ఒక్కో మనిషి
నవరసాలను ఒలికించే
సృజనాత్మక చైతన్యం
ఎన్నో కళలను ప్రదర్శించే 
కళాత్మక చేతనం

మనిషి....
ఇప్పుడు కళ తప్పిండు
అందుకే అన్ని వేషాలు
నాటకాల్లోనే ...
అన్ని పాత్రలు... 
జీవితంలోనూ...!

ఎన్ని రంగులు మారిస్తేనేం
నాటకం గుడ్డిదైపోతుందా?
ఎన్ని నాటకాలు వేస్తేనేం
జీవితం రంగు మారిపోతుందా?

నాటకం... 
రంగు వెలిసిన జెండేమి కాదు
మహా జీవితానికి ఒక కాగడా!

నాటకం...
అంతరించేది ఏమి కాదు
మనిషి ఉన్నంతవరకు దాని మనుగడ!!

జీవితమంటే నాటకమే...
నాటకమంటే జీవితమే !

✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 


నా ఉఛ్వాసలో ఊపిరివై శ్వాసిస్తూనే
ప్రతిరూపమై ప్రాణదీపాన్ని వెలిగిస్తావు
ప్రేమంటే రెండు మనసుల ఏకతాత్మ

నా తలపులో వలపులను పండిస్తూనే
వయ్యారివై తనువెళ్ళ చుట్టుముడతావు
ప్రేమంటే పులకింతల వెచ్చని కౌగిలి

నా మనస్సులో కోరికలను రేపుతూనే
సుప్రభాత వేణుగానమై పరవశింపజేస్తావు
ప్రేమంటే రాగాలను మీటే గాంధర్వగానం

నా ప్రాణంలో ప్రణవమై ఊపిరవుతూనే
హృదయసల్లాపంలో పల్లవిస్తూనే ఉంటావు
ప్రేమంటే అనురాగాలను పంచే పవిత్రబంధం

నా హృదయంలో దేవతలా కొలువవుతూనే
నిత్యం నీరాజనాలనందుకుంటూనే ఉంటావు
ప్రేమంటే ప్రేమికులకు నిత్య వేదమంత్రం

✍✍డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
 08-04-2018  ఆదివారం 
రాత్రి సూర్యుడు 

గణేష్ దినపత్రిక 07-04-2018


అతడికి
పగలు ... రాత్రి
రాత్రి ... పగలు

ప్రపంచమంతా పరుగెత్తుతున్నప్పుడల్లా
వాడు తనదైన లోకంలో విహరిస్తూనే ఉంటడు
లోకమంతా అలసిపోయి నిద్రపోయినప్పుడల్లా
అతడు రాత్రి సూర్యుడై వెలుగుతూనే ఉంటడు

అతడు నిత్యం పహారా కాస్తున్న రాత్రిలా
రహదారులను శుభ్రం చేస్తూనే ఉంటడు
మానవసేవనే మాధవసేవనంటూ
మానవాళి శ్రేయస్సుకై పరితపిస్తూనే ఉంటడు
నిత్యం మురికికూపంలో దిగబడుతూనే
మన మురికిని వదిలిస్తుంటడు

కడుపుకు తిండిలేకున్నా...కంటికి నిద్రలేకున్నా
రోజూ మహాశివరాత్రిలా...నిత్యజాగరణ చేస్తూ
ప్రతినిత్యం లోకాన్ని శుభ్రపరుస్తూనే ఉంటడు
వాడి ఆకలిని ఈ లోకం పట్టించుకోదు
అతడి దాహాన్ని ఈ ప్రపంచం తీర్చదు

అతడి పని వాడిదే...
తను నిత్యం కొత్త ప్రపంచానికై
బాటలు వేస్తూనే ఉంటడు
రాత్రి మేల్కొంటూనే 
లోకాన్ని నిద్రలోకి దించేస్తుంటడు

పొద్దు నేలను ముద్దాడేదాక
తనువును విల్లులా వంచి 
ఊపిరి సలపనంతగా పనిచేస్తుంటడు

తన రెక్కలను ముక్కలుగా మార్చినా
అతడికింత జనాదరణ ఉండదు
తన కష్టాన్ని లోకానికి ఆహుతి చేసినా
అతడి కడుపుకింత ఆకలి తీరదు

అతడు...రాత్రి సూర్యుడు
పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా
చీకటితో యుద్ధం చేస్తూనే ఉంటడు
రాత్రి మిత్రుడితో చెలిమి చేస్తూనే
నిత్యం వేగుచుక్కై వెలుగుతుంటడు

మనం వెన్నెలై వెలుగుతున్నమంటే
అతడు లోకాన్ని నిత్యం శుభ్రం చేస్తున్నందుకే 
మనం మనుషులమై తిరుగుతున్నమంటే
అతడు రాత్రిసూర్యుడై పహారా కాస్తున్నందుకే

✍⚘డాక్టర్  భీంపల్లి శ్రీకాంత్ 
🌷 కవిత్వం మొగ్గలు 🌷



కవిత రాయకుండా నేను నిద్రపోతానా
కాలం నన్ను కసిదీరా కాటేస్తూనే ఉంటది
కవిత కాలాన్ని పట్టిచూపే కాగడా

అక్షరాన్ని పలకరించకుండా పడుకుంటానా
మెలకువలో క్షణక్షణం పలవరిస్తూనే ఉంటది
అక్షరం కిరణమై వెలిగే కాంతిపుంజం

కాలాన్ని ఒడిసిబట్టుకోకుండా ఉంటానా
అక్షరాలు అలిగిపోతూనే ఉంటవి
కాలం కవిత్వమై ఎగిసే తారాజువ్వ

ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటానా
మానవజన్మ తుచ్ఛమైనదిగా గోచరిస్తది
మనిషి లోకానికి దారిచూపే దీపస్తంభం

ప్రకృతికి దూరమవుతూ ఉండిపోతానా
వసంతాలన్నీ గ్రీష్మాలవుతూనే ఉంటవి
ప్రకృతిసౌందర్యం భూతల్లి మెడలో ఆభరణం

సాహితికిరణం మాసపత్రిక ఏప్రిల్  2018
✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
🌷 మొగ్గలు 🌷

గణేష్ దినపత్రిక 05-04-2018


గాయాలను నిత్యం ముద్దాడుతూనే ఉంటాను
అనుభవాల గేయాలను ఆవిష్కరించడానికి
రాపిడి పడితేనే మనిషి వజ్రంలా మెరిసేది

నిశీథిని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాను
ఒంటరి జీవితాన్ని సదా అనుభవించడానికి
చీకటిలోనే వెలుగు రవికిరణమై వెలిగొందేది

ఒంటరితనాన్ని నిత్యం అనుభవిస్తూనే ఉంటాను
గాయపడ్డ హృదయాన్ని లేపనమై ఓదార్చడానికి
గాయపడితేనే మనిషి గేయమై ప్రభవించేది

జీవితపోరాటాన్ని నిత్యం సాగిస్తూనే ఉంటాను
బతుకుబాటలో పద్మవ్యూహాన్ని చేధించడానికి
అలుపెరుగని పోరాటం మనిషి అస్తిత్వగానం

ఓటమిని కెరటంలా ఆహ్వానిస్తూనే ఉంటాను
అపజయాల ఆటుపోట్లను గెలపొందడానికి
ఓటమి విజయాన్ని ముద్దాడే తొలిమెట్టు

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
""తెలంగాణ రాష్ట్రంలో బోధనా భాషగా తెలుగు సాధకబాధకాలు"

గణేష్ దినపత్రిక  06-04-2018

✍✍ డాాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


జాతీయ సదస్సులో పాల్గొన్న డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 







✍✍  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
           04-04-2018 ⚘📌



గాయాలను నిత్యం ముద్దాడుతూనే ఉంటాను
అనుభవాల గేయాలను ఆవిష్కరించడానికి
రాపిడి పడితేనే మనిషి వజ్రంలా మెరిసేది

నిశీథిని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాను
ఒంటరి జీవితాన్ని సదా అనుభవించడానికి
చీకటిలోనే వెలుగు రవికిరణమై వెలిగొందేది

ఒంటరితనాన్ని నిత్యం అనుభవిస్తూనే ఉంటాను
గాయపడ్డ హృదయాన్ని లేపనమై ఓదార్చడానికి
గాయపడితేనే మనిషి గేయమై ప్రభవించేది
జీవితపోరాటాన్ని నిత్యం సాగిస్తూనే ఉంటాను
బతుకుబాటలో పద్మవ్యూహాన్ని చేధించడానికి
అలుపెరుగని పోరాటం మనిషి అస్తిత్వగానం
ఓటమిని కెరటంలా ఆహ్వానిస్తూనే ఉంటాను
అపజయాల ఆటుపోట్లను గెలపొందడానికి
ఓటమి విజయాన్ని ముద్దాడే తొలిమెట్టు



✍✍ డాక్టర్  భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
నవ్య మీడియా 04-04- 2018

ఆధునిక వచన కవితా ప్రక్రియ మొగ్గలు 


✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
అక్షర నేత్రం పక్ష పత్రిక 16-31 మార్చి 2018

జాతీయ సదస్సులో పాల్గొన్న భీంపల్లి శ్రీకాంత్ 



 ✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
అక్షర నేత్రం పక్ష పత్రిక 16-31 మార్చి  2018
🌷 మాట మొగ్గలు 🌷

 గణేష్ దినపత్రిక 01-04-2018







పలకరింపు వానజల్లులా కురిస్తేనే కదా
చిరునవ్వులు పులకరించి మొలకెత్తేది
మంచిమాట మనీషిగా మార్చే పూలతోట

మాట అమృతవర్షంలా వర్షిస్తేనే కదా
మనిషిలో మానవతాదీపం వెలిగొందేది
పలకరింపు మమతలపూల పరిమళం

కల్మషహృదయాలను సదా కడిగేస్తేనే కదా
మానవతాపూలు మకరందమై పరిమళించేది
మాట మనిషిని తీర్చిదిద్దే పూలబాణం

భాషణం ఆత్మీయలతలను అల్లితేనే కదా
అనుబంధాలు గంధపుచెట్టై గుభాళించేది
పలకరింపు సువాసనను వెదజల్లే సుమగంధం

పెదాలపై వెన్నెలపదాలు పూయిస్తేనే కదా
హృదయసీమ చలువపందిరై స్వాంతనపరిచేది
మాట మంత్రం కన్నా మహిమాన్వితం

 ✍✍ డాక్టర  భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
జాతీయ కవి సమ్మేళనంలో జిల్లా కవులు









✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
          01-04-2018   సోమవారం