🌷 కవిత్వం మొగ్గలు 🌷



కవిత రాయకుండా నేను నిద్రపోతానా
కాలం నన్ను కసిదీరా కాటేస్తూనే ఉంటది
కవిత కాలాన్ని పట్టిచూపే కాగడా

అక్షరాన్ని పలకరించకుండా పడుకుంటానా
మెలకువలో క్షణక్షణం పలవరిస్తూనే ఉంటది
అక్షరం కిరణమై వెలిగే కాంతిపుంజం

కాలాన్ని ఒడిసిబట్టుకోకుండా ఉంటానా
అక్షరాలు అలిగిపోతూనే ఉంటవి
కాలం కవిత్వమై ఎగిసే తారాజువ్వ

ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటానా
మానవజన్మ తుచ్ఛమైనదిగా గోచరిస్తది
మనిషి లోకానికి దారిచూపే దీపస్తంభం

ప్రకృతికి దూరమవుతూ ఉండిపోతానా
వసంతాలన్నీ గ్రీష్మాలవుతూనే ఉంటవి
ప్రకృతిసౌందర్యం భూతల్లి మెడలో ఆభరణం

సాహితికిరణం మాసపత్రిక ఏప్రిల్  2018
✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

1 కామెంట్‌: