గాయాలను నిత్యం ముద్దాడుతూనే ఉంటాను
అనుభవాల గేయాలను ఆవిష్కరించడానికి
రాపిడి పడితేనే మనిషి వజ్రంలా మెరిసేది

నిశీథిని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాను
ఒంటరి జీవితాన్ని సదా అనుభవించడానికి
చీకటిలోనే వెలుగు రవికిరణమై వెలిగొందేది

ఒంటరితనాన్ని నిత్యం అనుభవిస్తూనే ఉంటాను
గాయపడ్డ హృదయాన్ని లేపనమై ఓదార్చడానికి
గాయపడితేనే మనిషి గేయమై ప్రభవించేది
జీవితపోరాటాన్ని నిత్యం సాగిస్తూనే ఉంటాను
బతుకుబాటలో పద్మవ్యూహాన్ని చేధించడానికి
అలుపెరుగని పోరాటం మనిషి అస్తిత్వగానం
ఓటమిని కెరటంలా ఆహ్వానిస్తూనే ఉంటాను
అపజయాల ఆటుపోట్లను గెలపొందడానికి
ఓటమి విజయాన్ని ముద్దాడే తొలిమెట్టు



✍✍ డాక్టర్  భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
నవ్య మీడియా 04-04- 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి