భీంపల్లి నానీలు 

గణేష్ దినపత్రిక 30-05-2018

⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 అంతర్జాల మొగ్గలు 🌷 

 🌷  గణేష్ దినపత్రిక 🌷 31-05-2018 🌷

అంతర్జాల ప్రపంచంలో నిత్యం ఆవిరైపోతూనే
నన్ను నేను నిత్యం పోగొట్టుకుంటూనే ఉన్నాను
అంతర్జాలం మనిషిని చంపేసే కాలరక్కసి

ప్రపంచాన్ని అరచేతిలో అందంగా చూపిస్తూనే
ఇంద్రధనుస్సులా ఆహ్లాదపరిచే అపరంజిబొమ్మ
అంతర్జాలం ఆనందాన్ని పంచే ప్రపంచనేస్తం

అందరినీ నిత్యం చైతన్యవంతం చేస్తూనే
విశ్వవార్తలకు అనంతవేదిక అవుతుంది
అంతర్జాలం సూర్యున్ని తలపించే నిత్యకిరణం

కాలాన్ని హారతికర్పూరంలా ఆహుతి చేస్తూనే
రోజూ అనేక సందేశాలతో చేతనాగీతికవుతుంది
అంతర్జాలం మనిషిని మెల్కొలిపే సూక్తిసుధాకరం

విశ్వమానవుల గొంతుకలకు ఏకతాస్వరమవుతూనే
విరిసే సరికొత్త స్నేహాలకు స్నేహగీతం పాడుతుంది
అంతర్జాలం అపరిచితుల పరిచయక సంగమం

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే పాలమూరు జిల్లా రూపురేఖలు మారినవి. కరువు జిల్లా పోయి పసిడి జిల్లాగా పాలమూరు చరిత్రకెక్కిపోతున్నది. భావితరాలను బంగారంలా పాలమూరు తయారవుతున్నది. ప్రాజెక్టుల రాకతో పాలమూరు పచ్చగా పండుతున్నది. బంగారు తెలంగాణే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నడు. కేసీఆర్ చేపట్టిన ప్రతీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నది. అలాంటివాటిలో రైతుబంధు పథకం అగ్రస్థానంలో నిలుస్తున్నది.

దేశానికి వెన్నెముక రైతన్న. దేశానికి అన్నం పెట్టేది రైతన్న. రైతు బాగుంటేనే దేశం బాగుండేది. ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, సరికొత్త పథకాలతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచి రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నది.సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా. రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి పోనంత వలసలు పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్ళేవారు. ఏటా 14 లక్షలు మంది వలసపోయే జిల్లాగా పాలమూరు ప్రఖ్యాతిగాంచింది. అనావృష్టితో పాలమూరు జిల్లాలో రైతు ల పరిస్థితి అధ్వానం. పంట పొలాలున్నా పండించలేని దుస్థితి. ఏ ప్రభు త్వం కూడా వ్యవసాయరంగాన్ని పట్టించుకోకుండా పాలన సాగించిందే తప్పా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వచ్చిన తర్వాతనే రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుదన్న మానవీయ ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాల వల్ల పాలమూరు జిల్లాలో వలసపోయిన కూలీలు వలస జిల్లాకు తిరిగి వస్తున్నారు.

తెలంగాణలో 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉన్నది. రైతన్న పంటలు పండించాలంటే సాగునీరు ప్రధానం. దీనికోసం ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్న యి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తయి రైతులకు సాగునీరును అందిస్తున్నది. ఏనాడు నిండని కాలువలు నేడు స్వరాష్ట్రంలో నిండుకుండలా పారుతున్నవి. రైతులకు సబ్సిడీ విత్తనాల నుంచి ఎరువుల వరకు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతీది కష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రాజెక్టు లు పరుగులు తీస్తున్నవి.

వ్యవసాయాన్ని పండుగలా చెయ్యడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. రాష్ట్రంలోని రైతులను సూక్ష్మ నీటిపారుదల సేద్యం వైపు మళ్ళించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులకు 80 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని లాభాల బాటలో కొనసాగుతున్నరు.
ఇక నుంచి రైతన్న పంటకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లవలసిన అవసరంలేదు. వ్యవసాయరంగంలో పెట్టుబడే ప్రధాన సమ స్య. ఈ పెట్టుబడి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దశాబ్దాలుగా అప్పుల్లో కూరుకుపోయి న రైతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అన్నదాతలు తల ఎత్తుకొని జీవించే లా రూపొందిన రైతులకు పథకం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. యాభై ఏండ్లలో కాంగ్రెస్ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తున్నది. ప్రతి ఊరి చెరువులను ఎత్తిపోతల పథకాలతో నింపుతున్నది. చెరువులు నిండితేనే రైతన్నలకు పండుగ. రైతన్న లు నవ్వితేనే ప్రజలకు నిత్యపండుగ. సాగునీటి వనరులు బుద్ధారం, ఖిల్లాగణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లతో వనపర్తి సస్యశ్యామలం కానున్నది.119 కోట్లతో ఖిల్లా ఘనపురం కెనాల్ 11 నెలల్లోనే పూర్తయి చరిత్ర సృష్టించింది. 30 ఏండ్ల తర్వాత గణప సముద్రం ఇక్కడ నీళ్లతో కళకళలాడుతున్నది. 25 కోట్లతో 24 కిలోమీటర్ల పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ముందుకు సాగుతున్నది.

2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేంతవరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి నియోజకవర్గానికి సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎం సీ ల కేటాయింపులే ఉండేది. దీని కి అదనంగా 15 టీఎంసీ లకు పెంచి ప్రస్తుతం 40 టీఎం సీల కు పెంచడం జరిగింది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం 29 ప్యాకేజీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచి కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం నిజంగా ఊహకందని విషయం. వచ్చే వానకాలం నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకుసా గుతున్నరు.

🌷 ప్రేమ మొగ్గలు 🌷 

 గణేష్ దినపత్రిక 🌷 21-05-2018 

ప్రేమ పరిణయంగా మారితేనే కదా
జీవితం పూలవనమై పరిమళించేది
ప్రేమంటే నవజీవనల మాధుర్యం

ప్రేమలో నిజాయితీ ఉంటేనే కదా
అనుబంధం చిరకాలం నిలిచిపోయేది
ప్రేమంటే మమతానురాగాల ఆలింగనం

హృదయంలో  ప్రేమను వెలిగిస్తేనే కదా
కలకాలం ఆత్మీయతానురాగాలు బలపడేది
ప్రేమంటే మధురానుభూతుల సంగమం

ప్రేమయాత్రలో ఆటంకాలు ఎదురైతేనే కదా
కాలంతో పోటీపడి విజయతీరాన్ని ముద్దాడేది
ప్రేమంటే పండువెన్నెల వసంతోదయం

ప్రేమలో పడి నిలిచి గెలిస్తేనే కదా
వసంతాలను గుప్పిట్లో పట్టుకునేది
ప్రేమంటే కొత్త జీవితానికి నాందీవాచకం

⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘

 కన్నీటి మొగ్గలు 

గణేష్ దినపత్రిక 20-05-2018

జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా
ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి
కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు

ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా
మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది
కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర

కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా
మనసులో కన్నీటి అలజడులే ఎగిసిపడుతుంటాయి
కన్నీరు బతుకుపోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం

అనంతమైన విషాదజీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా
మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది
కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం

దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా
జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది
కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 తెలంగాణ భాషా, సాహిత్య వికాసం సదస్సు 🌷

🌷 సహజ వాక్యం🌷

🌷✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 గణేష్ దినపత్రిక 🌷15-05-2018🌷

🌷 నది మొగ్గలు 🌷

నది జలపాతంలా ప్రవహిస్తుంటుందా
ప్రాణుల దాహార్తి కోసమే దాని పరుగు
సకల ప్రాణికోటికి నది నీరే అమృతం

నది కొండలు కోనలు దాటుకుంటూనే
ప్రకృతిసిగలో వాలుజడను తలపిస్తుంది
పుడమితల్లికి ఆభరణంలా జలహారం

జీవజాలాల గొంతుకలను తడుపుతూనే
ప్రాణం పోసే అపరసంజీవని అవుతుంది
సమస్త జీవజాలానికి నది జీవనాధారం

నాగరికత పుట్టుకకు పుట్టినిల్లు అవుతూనే
చరిత్ర,సంస్కృతి వికాసానికి బాటలు వేసింది
ఆదిమానవుడికి ఆయువుపట్టు నదీమతల్లి

ప్రపంచ చరిత్రను తడిమి చూసినప్పుడల్లా
అది నది చరిత్రతోనే ప్రారంభమవుతుంది
నది మానవ నాగరికతకు నాందీవాక్యం

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
🌷 సూర్య అక్షరం 14-05-2018 🌷
🎼🎷నవ్య మీడియా 🎶🎶 13-05-2018🎷🎼

అపుడపుడు ఆసుపత్రికి వెళ్లి
అభాగ్యులను పలకరించి వద్దాం
గోడలపై నిత్యం ప్రతిధ్వనించే 
రోగుల ఆర్తనాదాలను విని వద్దాం

ఎంతమంది రోగపీడితులు అక్కడ 
బతుకుపై భరోసాతో జీవిస్తారు
ఎంతమంది బంధువులు అక్కడ
రోగులను కంటికి రెప్పలా చూసుకుంటారు

ఆసుపత్రి నిరంతరం మౌనగీతాన్ని వినిపిస్తూనే
అభాగ్యుల సేవలో ఆపద్భాంధవుడిలా తరిస్తుంటుంది
అనేక మూగరోదనలను మనసులో దాచుకుంటూనే
నిండుధైర్యంతో ఆపన్నహస్తమై ఆదుకుంటుంది

గంపెడంతా ఆందోళనతో ఇంటికి దూరమవుతాడా
సజలనేత్రాలతో ఇల్లు వీడ్కోలు పలుకుతుంది
బరువెక్కిన గుండెతో భారంగా అడుగులు వేస్తాడా
ఆసుపత్రి ఆత్మీయనేస్తమై పలకరిస్తుంది

రోగి బాధలను తన బాధగా చేసుకుని
ఆవేదనభారాన్ని దించే లేపనమవుతుంది
రోగులకు స్నేహహస్తాన్ని అందిస్తూనే
గుండెభారాన్ని దించే నేస్తమవుతుంది

రోగుల హాహాకారాలను విన్నప్పుడల్లా
బంధువులు అచేతనశిల్పాలవుతుంటారు
బతుకుపై ఆశతో జీవిస్తున్నప్పుడల్లా
నిశ్చేష్టులై ఒంటరిబతుకు గడుపుతుంటారు

అపరసంజీవనేదో వారికి ఆసరా అవుతుందని
వేయికళ్ళతో నిత్యం ఎదురుచూస్తుంటారు
వైద్యుల చికిత్సతో నయం అవుతుందని
ఆశాజీవులై పడిగాపులు గాస్తుంటారు

అపుడపుడు ఆసుపత్రిని పలకరించి వద్దాం
గుండెగొంతుకలో తండ్లాడే బాధను విందాం
బాధాసర్పదష్టుల బాగోగులను చూద్దాం
కాసింత ఉపశమనమై ఊపిరి పోద్దాం

✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 ప్రయాణం 🌷

గణేష్ దినపత్రిక 13-05-2018

జీవితం ఒక ప్రయాణం         
బహుదూరపు ప్రయాణం 
అనంతంగా సాగే ప్రవాహం
                   
అన్ని ప్రయాణాలు ఒకేలా ఉండవు               
ఒక్కో ప్రయాణం ఒక్కో అనుభూతి             
                    
ఏ ప్రయాణమైనా దూరతీరాలను చేరడానికే  
ఆ తీరాలను తనివితీరా ఆలింగనం చేసుకోవాలని    
ఏ ప్రయాణమైనా నలుగురిని కలుసుకోవడానికే
ఆ నలుగురితో ఆనందాలను పంచుకోవాలని
ఏ ప్రయాణమైనా బంధువులను కలుసుకోవడానికే
ఆ బంధువుల ప్రేమామృతాలను ఆస్వాదించాలని  
అన్ని ప్రయాణాలు ఒకేలా ఉండవు       
ఒక్కో ప్రయాణం ఒక్కో మజిలీ   

ప్రయాణం చేసినప్పుడల్లా
ప్రకృతి పలకరిస్తూనే ఉంటది
అడుగులు వేసినప్పుడల్లా
చరిత్ర అడుగడుగునా దర్శనమిస్తూనే ఉంటది     
పాదముద్రలు పడినప్పుడల్లా
ఆదిమానవ చరిత్ర కళ్ళముందే సాక్షాత్కరిస్తూనే ఉంటది 

            ఏ ప్రయాణమైనా చరిత్రను తెలుసుకోవడానికే 
 చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావడానికే
ఒక్కో చరిత్ర ఒక్కో ఇతిహాసం
మానవ నాగరికత వికాసం
పాదయాత్రల పలకరింపులతోనే 
ఏయాత్రలైనా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే
చరిత్రను లోకానికి అందించడానికే
            చరిత్రను కౌగిలించుకుంటేనే కదా                  
తరతరాలు నవ్వుతాయి 
గతాన్ని స్మరించుకుంటేనే కదా
                    భవిష్యత్తులో పూలు పూస్తాయి                            
జీవితమంటే ప్రయాణమే
 ప్రయాణమంటే జీవితమేఅవును 
జీవితం ఒక ప్రయాణం

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 తెలంగాణా భాషా సాహిత్య వికాస సదస్సులో భీంపల్లి శ్రీకాంత్ 🌷

ఈనాడు మహబూబ్ నగర్ 12-05-2018

సాక్షి మహబూబ్ నగర్ 12-05-2018

ఆంధ్రజ్యోతి మహబూబ్ నగర్ 12-05-2018

ఆంధ్రప్రభ మహబూబ్ నగర్ 12-05-2018
నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 12-05-2018

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 మొగ్గలు 🌷

గణేష్ దినపత్రిక 12-05-2018

ఆలోచనలకు భావాలతో అంకురార్పణ చేస్తేనే కానీ
అక్షరాలు రసగంగకవితాప్రవాహాలై పరుగెడుతాయి
ఆలోచనలు మేధస్సుకు పూచిన పువ్వులు

ఉదయాలు సుప్రభాతగానాలను వినిపిస్తేనే కానీ
మట్టిమనుషులు వేకువను ముద్దాడే వెలుగవుతారు
ఉదయాలు కోడికూతల రాగాలకు ప్రతీకలు

కెరటాలు అలజడులతో పోరుసల్పితేనే కానీ
సాగరం గంభీరమైన తన అస్తిత్వాన్ని చాటుకోదు
కెరటాలు ఆటుపోట్లను భరించే నిర్ణిద్రగానాలు

కిరణాలు వెలుగుబాణాలను సంధింపజేస్తేనే కానీ
తిమిరం ఎప్పటికైనా ఓటమి అంచున నిలబడాల్సిందే
కిరణాలు అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివిటీలు

మనిషి చీకటి బాధలను అనుభవిస్తేనే కానీ
వెలుగుతీపి రుచులను సదా ఆస్వాదించలేడు
జీవితమంటే చీకటివెలుగుల సంగమక్షేత్రం

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 మొగ్గలు 🌷

గణేష్ దినపత్రిక 11-05-2018

మనసులో దిగులు మేఘం కమ్ముకున్నప్పుడల్లా
బాధలకన్నీళ్ళు చినుకులుగా రాలుతూనే ఉంటాయి
గాయపడిన మనసుకు వసంతకాలమే ఉపశమనం

ఒక అక్షరం కవితాతోరణమై అల్లుకున్నప్పుడల్లా
సాహితీ కుసుమాలు విరగబూస్తూనే ఉంటాయి
అక్షరం సాహితీశ్వాసకు అసలైన ప్రాణవాయువు

జలం కలంసిరాలో ఒలికిపోయి ప్రవహిస్తున్నప్పడల్లా
జలసిరులు ఎండినచెరువులను వెలిగిస్తుంటాయి
జలం కవితాప్రవాహమై సాగే అనంతసాగరం

వసంతాన్ని ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నప్పుడల్లా
అది గ్రీష్మాన్ని తాపంతో పలకరించిపోతూనే ఉంటుంది
వసంతం కాలానికి పూచిన పూలచెట్టుపరిమళం

జీవితంలో ప్రతిక్షణం కన్నీరై రాలిపడుతున్నప్పుడల్లా
వెతలవేదనతో గుండెపగిలి రగిలిపోతూనే ఉంటాను
జీవితమంటే దుఃఖాన్ని ఒంపుకునే ఒక అక్షయపాత్ర

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
🌷 ఆసుపత్రి గీతం 🌷

గణేష్ దినపత్రిక 09-05-2018

వైద్యుడు నారాయణుడే
రోగుల ప్రాణాలను కాపాడే దేవుడే

కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
రోగులకు ప్రాణభిక్షపెట్టే అపరధన్వంతరి
సత్తువ కోల్పోతున్న శిథిల దేహాలకు
లేపనం పూసే అపరసంజీవని

బాధల బరువుతో భారంగా అడుగులు వేస్తామా
ఆసుపత్రి ఆపన్నహస్తమై స్నేహహస్తమందిస్తుంది
అనుమానాల మెట్లతో ఆసుపత్రిని పలుకరిస్తామా
దిగులు చీకటికి వెలుగురేఖయై ప్రసరిస్తుంది

గుండెలో తొలుస్తున్న అనుమానాలకు
వైద్యుడి పలకరింత ఒకింత ఉపశమనం
వట్టిపోయిన మనిషి గాయాలకు
వైద్యుడి చికిత్స వేకువ రవికిరణం

అక్కడ బతుకు ఒక నిత్యపోరాటం
జీవించాలన్న తపనకు మూలసూత్రం
దినదినగండంగా బతకడమే
ఆసుపత్రి నేర్పిన జీవనసూత్రం

వైద్యపరీక్షల ఫలితాలు తేలనిదే
రోగులకు బతుకు తెల్లారదు
పరీక్షల మీద పరీక్షలు చేపట్టనిదే
వైద్యుల నాడీ అంతుపట్టదు

ఎన్ని రోజులు పడుతుందో 
రోగి జబ్బు నయం కావడానికి
ఎన్ని రాత్రులు తెల్లవారాల్లో
రోగం ప్రపంచాన్ని పలకరించడానికి

వైద్యసేవలు అనునిత్యం అందిస్తున్నా
రోగం నవ్వుతూ రోగిని వెక్కిరిస్తుంటుంది
గంటలు యుగాల్లా గడిచిపోతున్నా
వైద్యం మౌనరాగాలను ఆలపిస్తుంటుంది

ఆసుపత్రిలో అడుగు పెట్టినామంటే
బతుకుపై ఆశలు ఆవిరవుతుంటాయి
వైద్యుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరవుతున్నామంటే
బతుకుపై ఆశలు సన్నగిల్లుతుంటాయి

సూర్యుడు ఉదయిస్తున్నాడంటే 
అస్తమయానికి దగ్గర అవుతున్నట్టే
వెలుగు కాంతికిరణమై ప్రసరిస్తుందంటే
చీకటిగాయాల తోకలు ముడిచినట్టే

అవును...
వైద్యుడు నారాయణుడు
వైద్యో నారాయణో హరి !

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷💧తెలంగాణ జల కవితోత్సవ సంబరాలు💧

ఈనాడు మహబూబ్ నగర్ 07-2018

నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 07-05-2018
ఆంధ్రజ్యోతి మహబూబ్ నగర్ 07-05-2018

సాక్షి మహబూబ్ నగర్ 07-05-2018

మన తెలంగాణ మహబూబ్ నగర్ 07-05-2018

🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷