🌷 పత్రికా 🌷 మొగ్గలు🌷 
గణేష్ దినపత్రిక 02-05-2018


అన్యాయాలపై నిత్యం జూలు విదిలిస్తూనే
సమాజాన్ని కాగడాపట్టే కాంతిరేఖలవుతాయి
పత్రికలు ప్రజాస్వామ్యపు ముద్దుబిడ్డలు

ప్రజల గొంతుకలకు వాహికలవుతూనే
నిజాలను చాటే నిప్పుకణికలవుతాయి
పత్రికలు పహారాకాసే వెలుగుదివిటీలు

అక్రమాలను అడుగడుగున ఎండగడుతూనే
పాలకవర్గాలను పదేపదే దునుమాడుతాయి
పత్రికలు రాజ్యాంగానికి పూసిన పువ్వులు

కటికనిజాలను నిర్భయంగా ఆవిష్కరిస్తూనే
చీకటిబాగోతాలను వెలుగులోకి తెస్తాయి
పత్రికలు వాస్తవాలను ఆవిష్కరించే దీపికలు

సమాజసేవలో నిరంతరం తలమునకలవుతూనే
ప్రజలపక్షాన నిలబడి సత్యాలకు భరోసానిస్తాయి
పత్రికలు చీకటిసూర్యులకు చిరునామాలు




🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి