💧 నమస్తే  తెలంగాణ 🌷 దినపత్రిక  🌷 06-05-2018 🌷💧

💧 మన తెలంగాణ 🌷 దినపత్రిక  🌷 06-05-2018 🌷💧
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: 

ఈనెల 6న వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ వికాస సమితి.. రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జల కవితోత్సవ రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.  జలమే మానవాళికి జీవనాధారమని జలమే సమస్త జీవకోటికి ఆధార మని జలంలేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. జలమే అందరికి ప్రాణప్రదం. అలాంటి జల వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని సద్వినియోగపరచని కారణం గానే పాలమూర్ గతంలో వలసలకు  నిలయ మైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన ప్రథమ ప్రాధాన్య తలలో నీటిపారుదల ఒకటి. తడారి పోయిన తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా గొంతు తడిపేవే జలవనరులు. అలాంటి జల వనరులను ఒడిపి పట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. పాలమూర్ వల స జిల్లా నే కాదు పచ్చని పైరుల ఖిల్లా అని నిరూపించే సమయం ప్రారంభమైం ది. ఒకప్పుడు బీడు పొలాలతో దర్శనమిచ్చిన పొలాలలు ఇప్పుడు పచ్చ ని పంటలతో కళ కళలాడుతూ స్వాగతిస్తున్నాయి. వట్టిపోయిన చెరువులు ఇప్పుడు తెలంగాణ లో జలవనరులతో ఉరకలేస్తున్నాయి. అలుగు లు దుంకుతూ  పొలాలను అభిషేకం చేస్తున్నాయి.
మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా సాకారమైన కల ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియమాకాల కోసం . ఇప్పు డు తెలం గాణ అంతటా నెరలిచ్చిన పొలాలు పచ్చని పొలాలతో సుందరంగా దర్శ నమిస్తున్నాయి. ఒకనాడు ఏడాదికోసారి లేని పంట ఇప్పుడు రెండుసార్లు పంటల తో రైతుల ఇంట పసిడి కురిపిస్తుంది. అన్నదాతకు ఆయువు పోస్తు జలవనరులు మన ముంగిట జాలువారు తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉమ్మడి పాలమూర్ జిల్లాలోని చెరువు లు నిండడమే. సాగునీరు లేక ఇతర ప్రాంతాలకు వలస వెలఙ్లన ప్రజ లు ఇప్పుడు తిరిగి తమ స్వంత ఊళ్లకు చేరుకుం టున్నారు. మిషన్ కాక తీయ, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రజలకు సాగునీరు చేరు వవుతుంది. గత పాలకుల నిర్లక్షాల వల్ల చెరువులు, కాలువలు పూర్తిగా ధ్వంస మయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి పున రుద్దరణకు అంకిత భావంతో పని చేయడంతో చెరువులు, కాలువలు ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతు న్నాయి. పల్లెప్రజలు ఆనందంగా వ్యవ సాయం చేసుకుంటున్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా సా కారమయ్యేందుకు అహర్నిషలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్న పాల మూర్‌లో కృష్ణమ్మ పరుగులతో దక్షిణ తెలంగాణ ధన్యాగారం గా త్వరలోనే మారనుంది.ఈ సందర్బాన్ని పురస్కరిం చుకొని ఉమ్మడి పాలమూర్ జిల్లాకు సాగునీరు. తాగునీరు అందుతున్న సందర్భంగా వనపర్తి జిల్లా లో ఈనెల 6న రాష్ట్రస్థాయి జల కవితోత్సవం పేరుతో బృహత్ కవి సమ్మేళనం ఏర్పాటుచేసి న ట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
జలం అనే అంశాన్ని ప్రాతిపాదికన తీసుకొని కవి సమ్మేళనం జరుగుతుంది. నీటి ప్రా ముఖ్యతను తెలిపే వచన,పద్య, గేయ, కవితా రూపాల్లో కవులు తమ కవిత లను వినిపించవచ్చు.ఉమ్మడి పాలమూర్ ఘన చరిత్రను తెలంగాణ రాష్ట్ర నలుమూ లల కు తెలియజేసేలా ఈ కవి సమ్మే ళనం జరుగనుంది.  చరిత్ర సుప్రసిద్దమైన జల కళ గురించి పాఠకుల హృదయాలను హత్తుకునేలా కవులు తమ కవితా గానాన్ని చే యాలని వనపర్తి జిల్లా కవులు కోరుతున్నారు. వచ్చిన కవితలన్నింటిని పుస్తక రూ పంలో వెలువడనుంది.ఈ కవిసమ్మేళనానికి రాష్ట్రంలోని 31జిల్లాలోని కవులు పా ల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లా కవులు కోరారు. జలం ప్రాముఖ్యతను భావితరాలకు తె లియజేయాలని కవిగా మన బాధ్యతలను నెరవేర్చాలని కోరారు.  జిల్లా కవులు అధ్యక్షులు డా.వీరయ్య, కన్వీనర్ జయంతి, సభ్యులు బలరాం, మల్యాల బాల స్వామి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్, గోపి, సుబ్బయ్య. జిల్లా కవుల పరిచయం.
✍✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷💧



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి