🌷 మొగ్గలు 🌷

గణేష్ దినపత్రిక 11-05-2018

మనసులో దిగులు మేఘం కమ్ముకున్నప్పుడల్లా
బాధలకన్నీళ్ళు చినుకులుగా రాలుతూనే ఉంటాయి
గాయపడిన మనసుకు వసంతకాలమే ఉపశమనం

ఒక అక్షరం కవితాతోరణమై అల్లుకున్నప్పుడల్లా
సాహితీ కుసుమాలు విరగబూస్తూనే ఉంటాయి
అక్షరం సాహితీశ్వాసకు అసలైన ప్రాణవాయువు

జలం కలంసిరాలో ఒలికిపోయి ప్రవహిస్తున్నప్పడల్లా
జలసిరులు ఎండినచెరువులను వెలిగిస్తుంటాయి
జలం కవితాప్రవాహమై సాగే అనంతసాగరం

వసంతాన్ని ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నప్పుడల్లా
అది గ్రీష్మాన్ని తాపంతో పలకరించిపోతూనే ఉంటుంది
వసంతం కాలానికి పూచిన పూలచెట్టుపరిమళం

జీవితంలో ప్రతిక్షణం కన్నీరై రాలిపడుతున్నప్పుడల్లా
వెతలవేదనతో గుండెపగిలి రగిలిపోతూనే ఉంటాను
జీవితమంటే దుఃఖాన్ని ఒంపుకునే ఒక అక్షయపాత్ర

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి