🌷 నది మొగ్గలు 🌷


నది జలపాతంలా ప్రవహిస్తుంటుందా
ప్రాణుల దాహార్తి కోసమే దాని పరుగు
సకల ప్రాణికోటికి నది నీరే అమృతం

నది కొండలు కోనలు దాటుకుంటూనే
ప్రకృతిసిగలో వాలుజడను తలపిస్తుంది
పుడమితల్లికి ఆభరణంలా జలహారం

జీవజాలాల గొంతుకలను తడుపుతూనే
ప్రాణం పోసే అపరసంజీవని అవుతుంది
సమస్త జీవజాలానికి నది జీవనాధారం

నాగరికత పుట్టుకకు పుట్టినిల్లు అవుతూనే
చరిత్ర,సంస్కృతి వికాసానికి బాటలు వేసింది
ఆదిమానవుడికి ఆయువుపట్టు నదీమతల్లి

ప్రపంచ చరిత్రను తడిమి చూసినప్పుడల్లా
అది నది చరిత్రతోనే ప్రారంభమవుతుంది
నది మానవ నాగరికతకు నాందీవాక్యం


✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
🌷 సూర్య అక్షరం 14-05-2018 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి