![]() |
ప్రేమ పరిణయంగా మారితేనే కదా
జీవితం పూలవనమై పరిమళించేది
ప్రేమంటే నవజీవనల మాధుర్యం
ప్రేమలో నిజాయితీ ఉంటేనే కదా
అనుబంధం చిరకాలం నిలిచిపోయేది
ప్రేమంటే మమతానురాగాల ఆలింగనం
హృదయంలో ప్రేమను వెలిగిస్తేనే కదా
కలకాలం ఆత్మీయతానురాగాలు బలపడేది
ప్రేమంటే మధురానుభూతుల సంగమం
ప్రేమయాత్రలో ఆటంకాలు ఎదురైతేనే కదా
కాలంతో పోటీపడి విజయతీరాన్ని ముద్దాడేది
ప్రేమంటే పండువెన్నెల వసంతోదయం
ప్రేమలో పడి నిలిచి గెలిస్తేనే కదా
వసంతాలను గుప్పిట్లో పట్టుకునేది
ప్రేమంటే కొత్త జీవితానికి నాందీవాచకం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి