సాహితి పరిశోధనలకు చిరునామా పాలమూరు

ఈనాడు మహబూబ్ నగర్ 31-01-2018

 పరిశోధకుల ఖిల్లా.. పాలమూరు జిల్లా

నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 31-01-2018

పాలమూరు జిల్లా.. పరిశోధకుల  ఖిల్లా ..

సాక్షి మహబూబ్ నగర్ 31-01-2018

పాలమూరు జిల్లా.. పరిశోధకుల  ఖిల్లా ..
మనం మహబుబ్ నగర్ 01-02-2018

డాక్టర్ సల్ల విజయకుమార్ పిహెచ్.డి పరిశోధన గ్రంథం "ఆధునిక తెలంగాణ కవిత్వం - జనజీవన చిత్రణ" ను మంగళవారం ఆవిష్కరించిన పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.రాజారత్నం. చిత్రంలో ఆచార్య మసన చెన్నప్ప, జలజం సత్యనారాయణ, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ గుంటి గోపి, డాక్టర్ గోపినాథ్ రాథోడ్ లు.
31 -01 -2018  *భీంపల్లి శ్రీకాంత్*

''ఆధునిక తెలంగాణ కవిత్వం జన జీవన చిత్రణ'' ఆవిష్కరణ 

సాక్షి మహబూబ్ నగర్ 30-01-2018











నేడు డాక్టర్ సల్లా విజయకుమార్ పిహెచ్.డీ పరిశోధన
గ్రంథం ఆవిష్కరణ  
నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 30-01-2018
 నేడు ''ఆధునిక తెలంగాణ కవిత్వం - జనజీవన చిత్రణ''ఆవిష్కరణ 
ఆంద్రజ్యోతి మహబూబ్ నగర్ 30-01-2018


114. గజల్ 


''పలుకు'' కవితా సంపుటిలో ప్రచురించబడిన కవిత 


క్షణాలను మోస్తూ కాలమై వెలుగుతుంటాను
అక్షరాలను వెలిగిస్తూ కవితనై ప్రకాశిస్తుంటాను

నిరంతరం కవితాలతలను అల్లుతూనే                
లోకంలో కవితాజ్యోతులను వెలిగిస్తుంటాను

అక్షరాలను కాలరేఖపై నిత్యం చిత్రిస్తూనే 
చరిత్రను ఒడిసిపట్టి భవిష్యత్తుకు అందిస్తుంటాను

వర్తమానాన్ని కలం కవాతుతో పరుగులు పెట్టిస్తూనే 
ప్రతి క్షణాన్ని పహారా కాస్తూ చరితగా లిఖిస్తుంటాను

సమాజాన్ని కలంతో చిత్రిక పడుతూనే
వాస్తవాన్ని కౌగిలించుకొని కవితను రాస్తుంటాను

కాలయవనికపై పాదముద్రలు బలంగా వేస్తూనే
కాలనాళికనై కవిత కరవాలం ఝళిపిస్తుంటాను

ఎన్ని కవితలు రాశావని కాదు భీంపల్లి              
కాలానికి నిలబడేవి ఎన్నని ప్రశ్నిస్తుంటాను

 *భీంపల్లి శ్రీకాంత్*
28-01-2018




మన తెలంగాణ ఆదివారం హరివిల్లు ప్రత్యేకం 28-01-2018
 *భీంపల్లి శ్రీకాంత్*

లూయిస్ బ్రెయిలీని ఆదర్శoగా తీసుకోవాలి   

ఈనాడు మహబూబ్ నగర్ 28-01-2018

సాక్షి మహబూబ్ నగర్ 28-01-2018

నమస్తే తెలంగాణ మహబూబ్ నగర్ 28-01-2018

ఆంద్రజ్యోతి మహబూబ్ నగర్ 28-01-2018

ఆంధ్రభూమి మహబూబ్ నగర్ 28-01-2018


నవ తెలంగాణ మహబూబ్ నగర్ 28-01-2018


 *భీంపల్లి శ్రీకాంత్*



మనిషి విశాలమై ప్రవహిస్తేనే కదా
లోకం ఆనందపు అంచులను తాకేది
స్వార్ధాన్ని విడనాడితేనే జీవితం నందనం
ఉత్తమమైన వ్యక్తిత్వం ఉంటేనే కదా
భావి జీవితానికి రాచబాటలు వేసేది
ఉన్నతమైన ఆలోచనే విజయానికి సోపానం

ఓటమిలోని ఆనందాన్ని చవిచూస్తేనే కదా
విజయాన్ని చేరుకునే మార్గాలు తెలిసేది
ఓటమి చెందడమే విజయానికి నాంది

మానవతాలతలు చిగురులై వికసిస్తేనే కదా 
సమానతాపూలు సుగంధమై వ్యాపించేవి
మానవత్వగుణమే మనిషికి గీటురాయి

గలగల పారుతున్న సెలయేరును చూస్తేనే కదా
ఊహలకు రెక్కలు వచ్చి గంతులు వేసేది
ఆలోచనలు ఎగిరే స్వేచ్ఛా విహంగాలు

 *భీంపల్లి శ్రీకాంత్*
 మనం దినపత్రిక  28-01-2018





ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతిక ధృక్పధం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవిత ప్రక్రియనే భీంపల్లి శ్రీకాంత్ గారు సృష్టించిన " మొగ్గలు " కవిత ప్రక్రియ.
ఇదీ 3 పాదాలుగా సాగే ప్రక్రియ.( మరీ ఇలా 3 పాదాలు తో సాగే ప్రక్రియలు తెలుగు లేవా అంటే ...వున్నాయి) జపాన్ ప్రభావం తో వచ్చిన హైకూ 3 పాదాల తో 17 మాత్రాలు కలిగిన త్రిపద. దీనిని తొలిసారిగా గాలినాసర రెడ్డిగా అనువాదం చేశారు.అయితే తొలి తెలుగు హైకూ అనువాదం మాత్రం పెన్నా శివరామ కృష్ణగారి " రహస్య ద్వారం" .
హైకూ లక్షణాల విషయంకూ వస్తే జపాన్ లో అక్షరాల దృష్యా 3 పాదాల లో (5-7-5) అక్షరాలుగా వారు లక్షణికరించుకున్నారు.కానీ తెలుగు లో అక్షరాల సంఖ్య దృష్ట్యా ఇదీ కష్టసాధ్య విషయం . అందుకే చాలా మంది హైకూలను మూడు పొట్టి పాదాలు అనే భావంతోనే రాసారు.
ఇక త్రిపద విషయం కు వస్తే మూడు పాదాల తో త్రిపదలను బోయి భీమన్న గారు రాసారు.
" నీవూ నా శరీరం కోరడం లేదు
నేనూ నీ శరీరం కోరడం లేదు
శరీరాలు మనల్ని కోరుతున్నాయి "
ఇలా భీమన్న గారు మూడు పాదాలుగా త్రిపదలు రాసారు. అయితే పై లక్షణాలకు భిన్నమైన కవిత్వం " మొగ్గలు".
మొగ్గలకు ఉన్న లక్షణాలను గమనిస్తే భీంపల్లి గారు చెప్పీనట్లు...
" మొగ్గలు మూడు పాదాల కవిత్వం.
మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే మూడవ పాదం దానిని సమర్థించేదిగా ఉంటుంది " .
అయితే వీరూ ప్రత్యేకం గా చెప్పని నియమం ఏమిటంటే మూడు పాదాలలో మొదటి పాదంకు కొనసాగింపుగా రెండవ పాదం వుండాలి. అంటే మొదట పాదం లో వాక్యం అంతం కారాదు.ఉదాహరణకు బోల యాదయ్య గారి మొగ్గ
" సెమట గుండె కండ్లల్లో
పల్గిపోయిన పంటకాల్వ కన్నీరై పారింది
పొలమారిన పాలమూరు బతుకు చిత్రం "
మరో విధంగా చెప్పాలంటే కొన్ని సార్లు మొదటి రెండు పాదాలు ఒక
" సంశ్లిష్ట వాక్యం" లా ఉండాలి . ఇదే విషయం భీంపల్లి గారు రాసినా మొగ్గలలో 2;3 పాదాల లో ఉండడం నేనూ గమనించాను. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చు అనీ తెలుస్తుంది
మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికం గా మొదలు పెట్టారు. మొగ్గలను మొదటగా Nov- 20 / 2017 నాడు అంకురార్పణ చేసారు. అలా నేటి వరకు దాదాపుగా 200 కు పైగా మొగ్గలను రాసారు. వారి సహచర్యం లోనే మరో కవి బోల యాదయ్య గారు శతాధిక మొగ్గలను రాసారు.
. కవిత్వంలో వుండే కవిత ప్రక్రియలకు ఎందుకీ నియమాలు అంటే ఏం చెబుతాం. ఆ నియమాలే ఆ ప్రక్రియలకు వన్నె తెస్తాయి.
" ప్రవాహనికైనా
కట్టడి లేకపోతే
అదీ
ప్రళయమవుతుంది "
మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదు.అర్ధం చేసుకోని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదిక లాంటి ప్రక్రియ.
ఇప్పుడీప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు ప్రక్రియలో ధశాధిక (10) కవులు . మొగ్గలు పూయించుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఆ కవులు రాసినా కొన్ని మొగ్గలను ఇప్పుడు చూద్దాం....
" పండగకని ఊరొచ్చిన ప్రతిసారీ
స్వర్గం చేరినంత హాయిగా అనిపిస్తుంది
పుట్టిన ఊరే అసలైన స్వర్గం"
--- రవివర్మ ఆకుల
"ప్రతి అక్షరం లో తొంగి చూసి
హృదయాoతరంగాన్ని ఆవిష్కృతం చేస్తది
కావ్య నాయక నా చెలి"
--- వి.పుష్పలత
" ఆయన పోరాటం ఎప్పుడూ
భూమితోనే చావైనా,బతుకైనా
భూతల్లితో విడదీయరాని బంధం రైతన్నది
- కె.పి.లక్ష్మీ నరసింహ
" ఎటూ చూసీనా అంధకారమే అనుకోకులే
కటిక చీకట్లలోనూ తారలు వెలుగుతుంటాయి
తరగని అక్షయ పాత్ర ఆత్మస్థైర్యం "
- ఐ.చిదానందం
" ప్రపంచాన్ని చూపించే పాఠశాల
ప్రగతిదారులను చూపే విజ్ఞానమందిరం
పాఠశాల వికసించే విజ్ఞాన పూదోట --- టి.అంబుజ
"మనిషిని మహోన్నతంగా తీర్చి దిద్ది
మనిషి విలువను మరింత పెంచుతుంది
పుస్తకమే కదా హస్తభూషణం
--- శ్రీదాస్యం లక్ష్మయ్య
" సుఖదుఃఖాల్లో వాడు సగభాగమై
ఆపద కొండంతైన అండగా నిలుస్తడు
స్నేహితుడు వెన్నంటి ఉండే నీడ
--- పొన్నగంటి ప్రభాకర్
" అజ్ఞానాంధకారం ఆవహించినప్పుడల్లా
విజ్ఞాన రేకై విచ్చుకుంటూనే ఉంటుంది
జ్ఞానాన్ని పంచే వెలుగు దివిటి పుస్తకం
--- భీంపల్లి శ్రీకాంత్
" కనుపాపలు నిప్పులపై నడిచిన
నీ రూపాని దహించ లేదు
ఆమే నా రక్తంలో మెులిచిన నక్షత్రం
--- బోల యాదయ్య
" ఐక్యంగా ముందుకు సాగితేనే కదా
జీవితాన అఖండ విజయాలు
ఐకమత్యమే మహాబలం
--- రూప
" అమ్మ నన్ను ప్రేమతో లాలించినప్పుడల్లా
నాన్న స్నేహహస్తం చెలెమెనే అవుతుంది
అమ్మానాన్నలే ఆదర్శం అఖిల ప్రపంచానికి "
---- అంజయ్య గౌడ్

దాదాపు గా పదికీ పైగా కవులు మొగ్గలు రాస్తున్న శిల్ప పరంగా ; వస్తు పరంగా మంచి కవితలు రాస్తున్నవారు మాత్రం శ్రీకాంత్ గారు ; బోల యాదయ్య గార్లే. మిగతా కవులు ఉత్సాహంగా రాస్తున్న వారింకా ఆ ప్రక్రియకు అలవాటు పడలేదు. మొగ్గలు రాస్తున్న కవులను ప్రోత్సాహం ఇస్తూ వారి శైలి లో లోపాలను సరిచేయాలిసిన అవసరం వుంది. నిజానికీ విషయంను శ్రీకాంత్ గారు భాధ్యత గా నిర్వహిస్తున్నారు.ఎక్కడ అతిగా పోకుండా వినయం తో వ్యవహరిస్తూ వున్న పరిధిలో కవులను ప్రోత్సాహీస్తున్నారు శ్రీకాంత్ గారు.
ఇక విమర్శల విషయంకు వస్తే ఒకప్పుడు కవిత్వంలో విమర్శ అంటే భాద్యత గా వ్యవహరించడమే .కానీ నేటి కాలం లో అదీ మారింది.
ఆత్మాభిమానం కు విఘాతం కలిగించేలా కవిత్వ పరంగా కాకుండా వ్యక్తిగతం గా అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు.ఇదీ వారి పలాయన వాదం ; పిరికితనం . మరో విధంగా అమానుషం కూడా.
వి.ఆర్.విద్యార్ధి కవి అన్నట్లు " కవిత్వం చదవాలనుకున్నప్పుడు ముందుగా కవి పేరు చూడవద్దు.కేవలం కవితనే చదవాలి.ఒకవేళ నీకూ ఆ కవిత నచ్చితే అప్పుడే ఆ కవి పేరు చూడాలి "
ఏదైనా కవితా ప్రక్రియ తెలుగు లో ప్రారంభం అయిదంటే మొదట దానినీ సమీక్షించిన తరవాతనే విమర్శించాలి. విమర్శకు నిదానం కావలి. అలాంటి విమర్శయే ఈ మొగ్గలకు అవసరం.వ్యక్తిగత వివాదాలతో వివక్షతో మొగ్గలోనే కవిత్వంను తుంచరాదు. ఎందుకంటే విషం ఒక్కసారే ప్రభావం చూపును.కానీ విమర్శ చాలా కాలం వరకు ఇతరులను విషమయం చేస్తున్నై వుంటుంది. అలా అనీ అస్సలు విమర్శయే వద్దన రాదు . ఎందుకంటే " సాన బెడితేనే వజ్రం మెరుస్తోంది " .
నిజానికీ వచనకవిత్వం పై వచ్చినంత విమర్శ మినీ కవిత్వ ప్రక్రియల పై రాలేదు. అందుకే కొన్నీ మంచి ప్రక్రియలు త్వరగా మరుగున పడ్డాయి. తెలుగు కవిత్వం లో ప్రచారం లేక వెనుకబడిన ప్రక్రియలు ఎన్నో కలవు. పొట్టిలు ; చిట్టిలు ; టంకాలు ( ఎన్.ఎస్.మూర్తి ) ; వీక్షణాలు ( ఈట్ల సమన్న); నానోలు ( ఈగ హనుమంత రావు ) వంటి కవితా ప్రక్రియలు శిల్పపరంగా కంటే ప్రచారంపరంగానే దూరమయినవని తెలుస్తుంది.
మరో కవితా ప్రక్రియ " వ్యంజాకాలు " . దీని సృష్టికర్త పోత్తూరి సుబ్భారావు గారు. ఈ ప్రక్రియ కూడా మొగ్గలు లాగానే శిల్ప పరంగా మంచి పక్రియ. 4- పాదాలు గల వ్యంజాకాలు మొదటి రెండు పాదాలు ఒక విషయం చెబితే ఆ విషయం ను విభేదిస్తు చివరి రెండు పాదాలు వుంటాయి. ఈ ప్రక్రియను సుబ్బారావు గారు తన " సాహితీ కిరణం " పత్రిక ద్వారా ప్రచారంలోకీ తెస్తున్నారు. అలాంటి ప్రచారం నే భీంపల్లి గారు అవలంబిస్తే ఈ కవితా ప్రక్రియలో మరిన్ని మొగ్గలు మొలకెత్తవచ్చు.
ఏ కవితా ప్రక్రియనైన సాహిత్యంలో నిలదొక్కుకుకోవడం అంత ఈజీ యేం కాదు.ఎన్నో అటుపోట్లను సూటిపోటీ మాటలను ఎదుర్కొనవలిసి వస్తుంది. అయినా సరే వాటికీ తట్టుకొని రాటుదేలిన కవితా ప్రక్రియలేన్నో . ఉదాహరణ కు నానీలు. ఈ నానీలు తొలినాళ్ళ లో తీవ్ర విమర్శల పాలైనది . అయిన సరే నిలబడి దాదాపుగా 300 కు పైగా కవులు నానీలు రాసారు. దానికీ కారణం నానీల సృష్టికర్త గోపి గారు మరియు నానీ తొలి తరం కవి డా.ఎస్.రఘు గారు విమర్శల విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించి నానీలను ప్రచారం చేయడంలో నానీ కవులకు వెన్నుదన్ను గా నిలిచి విజయవంతం సాధించారు. అలాంటి ఖచ్చితత్వమే మొగ్గలు ప్రక్రియకు బలం ను ఇస్తుంది.
మొగ్గలు కవితా పక్రియ ఇప్పటి వరకు ఒక్క కవితా సంపుటం కూడా విడుదల కాలేదు. కవితా సంపుటికీ కావాలిసిన కవితాసంపద వున్నా " మొగ్గలు నాన్న " శ్రీకాంత్ గారు దాదాపుగా 300 కు పైగా మొగ్గలను పూయించిన తర్వాతే సంపుటి గా ప్రచురించాలనీ సంకల్పించారు. ఈ దశలోనే వారు 200 ల మొగ్గలను ఆవిష్కరణ చేసారు.
అలాగే పాలమూరు యువకవి కిశోరం " మొగ్గల బాబాయి " బోల యాదయ్య గారు కూడా వందకు పైగా మొగ్గలను రాసారు. ఇవీ త్వరలోనే సంపుటిలు గా వస్తాయి. కవితాభిమానులను తప్పక అలరిస్తాయి. ఈ కవిత పక్రియ ఆదరణ పొంది మరింత కవులు రావాలనీ ఆశిస్తూ ......

* ఐ.చిదానందం *
పరిశోధక విద్యార్థి 

ఉస్మానియా విశ్వవిద్యాలయం  
చరవాణి :- 8801444335




పరులకు సేవ చేసినపుడే కదా
నలుగురిలో నానుతాడు
మానవసేవయే మాధవసేవ

పరిమళించే పూబాలలే కదా
రేపటి ఉషోదయ కిరణాలు
బాల్యం అందమైన ఉదయం

అక్షరాలను రాపిడి పడితేనే కానీ 
కవిత్వం వజ్రంలా మెరవదు          
కవిత్వం వెలిగే వెన్నెల

సాగరమెంతా పొంగిపొరలినా
దాని గమ్యం తీరం వరకే
మనసు అదుపుకో సంకేతం

దురాలోచనలు వీడితేనే కదా
మనసు ప్రశాంతంగా ఉండేది
సదాలోచనే మనిషికి ఆభరణం

 *భీంపల్లి శ్రీకాంత్*
సూర్య అక్షరం 22-01-2018


                      


తెలంగాణ సాహిత్యాన్ని పరిశోధిస్తున్న సాహితీవేత్తలు, పరిశోధకులు తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుతున్న సందర్భంలో రాత ప్రతులను వెలుగులోకి తెస్తున్నారు. అట్లా తెలుగు సాహిత్యంలో ఇప్పటికే ముద్రపడిపోయి న అనే ప్రక్రియలకు తెలంగాణ సాహిత్యం కేంద్ర బిందువు కావ డం గమనించాల్సిన విషయం. ఎవరికివారు ఇదే తొలి రచన అం టూ పేర్కొంటూ వ్యాసాలు, వ్యాఖ్యానాలు రాస్తున్నారు. కానీ తెలంగాణ సాహిత్యాన్ని తవ్వుతున్నకొద్దీ వెలుగులోకి రాని ఎన్నో రచనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో తెలంగాణ నవల ప్రక్రియ ఒకటి. సాహిత్యాన్ని పరిశోధిస్తున్న వారందరూ తడకమళ్ల వారి కంబుకంధర చరిత్ర రచననే పేర్కొంటున్నారు. అది అలభ్యము, అముద్రితము కూడా. అది యక్షగాన రచన శైలి లో ఉందని సాహితీవేత్తల అభిప్రాయం. (తడకమళ్లవారే స్వయంగా వచన ప్రబంధమని పేర్కొన్నారు) తెలంగాణ పరిశోధకులు మాత్రం కంబుకంధర చరిత్రనే తొలి నవలగా పేర్కొంటూ వస్తున్నారు. కానీ ఇది 8 అశ్వాసాల వచన ప్రబంధం. ఇందులో అక్కడక్కడ పద్యాలున్న ఇప్పటికిది అలభ్యంగా ఉందని పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర (పుట 652)లో ప్రస్తావించారనేది గమనించాల్సిన విషయం.

అయితే తెలంగాణలో తొలిపత్రిక హితబోధినిని వెలువరించిన బరారు శ్రీనివాస శర్మ 1910లోనే ఆశాదోషము అనే నవలను రచించారు. ఇది నేటి వరకు అలభ్యంగానే, అముద్రితంగానే ఉన్నది. దీన్ని సేకరించి భద్రపరిచినవారు తాళపత్ర పరిశోధకుడైన నాగలింగ శివయోగి. వీరు దాదాపు 600 తాళపత్ర గ్రంథాలను అప్పట్లోనే సేకరించి తార్నాకలోని ప్రాచ్యలిఖిత భాండాగారానికి అప్పగించారు. నాగలింగ శివయోగి 60 ఏండ్లుగా ఆశాదోషము నవలను భద్రపరిచిండు. తెలంగాణ సాహిత్యంతో పాటు పాలమూ రు సాహిత్యాన్ని తవ్వితీస్తున్న ప్రముఖ పాలమూరు పరిశోధకుడు భీంపల్లి శ్రీకాంత్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంపాదకత్వంలో ఈ నవలను వెలుగులోకి తీసుకువచ్చి వెలువరించడం అభినందించాల్సిన విష యం. వందేండ్ల కిందటనే రాయబడిన ఈ నవల తెలంగాణ తెలుగు ప్రపంచసభ ల సందర్భంగా వెలుగులోకి రావడం సం తోషించాల్సిన విషయం.తెలంగాణ సాహిత్యాన్ని రాస్తున్న పెద్దలు కొందరు ఆశాదోష ము నవల పేరును ఎక్కడా కూడా పేర్కొనలేదు. మరికొందరు అలభ్యం, అముద్రితమని పేర్కొంటూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ కూడా తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథండ లో ఆశాదోషము నవల అలభ్యమని, అముద్రితమని పేర్కొనడం గమనార్హం. సాహిత్య భీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఆశాదోషం లిఖిత ప్రతిని తాను చూశానని, మహబూబ్‌నగర్ జిల్లా విజ్ఞాన సర్వస్వంలో 1993లోనే పేర్కొన్నారు. పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ కూడా ఆశాదోషము నవల కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఆయనకు ఎక్కడా ఈ నవల లిఖితప్రతి దొరుకలేదు. ఈ ఆశాదోషము తొలి తెలంగాణ నవల ఇప్పటికైనా వెలుగుచూడటం కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వారికి ఆనందం కలిగించే విషయం. ఇలాంటి మరుగున పడి ఉన్న ఆణిముత్యాలను పరిశోధకులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అప్పడే సాహిత్యం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. అప్పడే తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం జెండాలా రెపరెపలాడుతుంది. 

తెలంగాణ తొలి తెలుగు పత్రికను వెలువరించిన బరారు శ్రీనివాసశర్మ పత్రికను వెలువరించకముందే 1910లో దీనిని రచించడం గొప్పవిషయం. ఈ నవల పూర్తిగా కోయిలకొండ దుర్గం చరిత్రను చాటి చెబుతుంది. ఇది సరళ గ్రాంథికంలో రచించబడిన నవ ల. నాటి కోయిలకొండ దుర్గాన్ని అసఫ్‌జాహీ వంశస్థులు ఎలా చేజిక్కించుకున్నారో ఈ నవల కళ్ళకు కడుతుంది. ఇది తెలంగాణ తొలి తెలుగు నవలనే కాదు తెలుగులో తొలి చారిత్రక నవల కూడా ఇదే కావ డం విశేషం. 20 ప్రకరణాలు గల ఈ నవల ఆద్యంతం ఉత్సుకతతో చదివిస్తుంది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ నవల పాఠకులను ఆగకుండా చదివిస్తుంది. తర్వాత ఏమవుతుందనే తాపత్రయాన్ని రచయిత కలిగించాడు. ఈ నవలను ఒక ప్రకరణం చదివి మూసివేయలేమని, తర్వాతి ప్రకరణంలో ఏం జరుగుతుందనే ఆతృతను రచయిత కల్పించాడని పుస్తక సంపాదకులు అభిప్రాయపడ్డారు. ఈ నవలలో యుద్ధాలే కాదు, ప్రేమలు ఉన్నాయి. మాయా పాత్రలున్నాయి, కపట వేషాధారణలున్నాయి. ఈ నవలను రాసిన శ్రీనివాస శర్మ దీన్ని ముద్రించే ప్రయత్నం చేయలేదు. హితబోధిని పత్రి క వ్యవహారంలో పడి ఈ నవలను పట్టించుకోలేదు.వాస్తవానికి తడకమళ్ల వారి కంబుకంధర చరిత్ర తెలంగాణ తొలి నవల కాదు. అది యక్షగాన మూలాలున్న వచన ప్రబంధమే. బరారు శ్రీనివాసశర్మ రాసిన ఆశాదోషము నవలనే తెలంగాణ తొలి నవలగా తెలంగాణ సాహిత్య నిర్మాతలు పేర్కొనవల్సిందే. శ్రీనివా సశర్మనే స్వయంగా దీన్ని నవల అని పేర్కొన్నాడు.

- డాక్టర్ గుంటి గోపి, 80198 08207



31వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో  సాహిత్య సమాలోచనలో భాగంగా  వర్తమాన వచన కవిత్వం వేదికపై తెలంగాణ తొలి నవల ''ఆశాదోషం'' నవల ఆవిష్కరణ 
  



నేటినిజం 25-01-2018















తొలితరం తెలంగాణ రచయిత బరారు శ్రీనివాస్ శర్మ  రచించిన తొలి తెలంగాణ నవల ఆశాదోషం నవలను శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరుగుతున్న 31వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో వర్తమాన వచన కవిత్వం అనే సదస్సు కు ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత డాక్టర్ నాళేశ్వరం శంకరం వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ పగడాల నాగేందర్, ఎం.నారాయణ శర్మ, మెర్సీ మార్గరెట్, కార్యక్రమం సమన్వయకర్త ,పుస్తక సంపాదకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

 *భీంపల్లి శ్రీకాంత్*
January 19 at 05.00pm