*నానీలు* Jan 2, 2018

అతడు
కవిత్వం రాస్తున్నాడు
మరో ప్రపంచం కోసం
కలలు కంటున్నాడు

చిత్రం
వేవేల భావాల దృశ్యమానం
ఊహకందని
రహస్య లిపి

అబద్ధానికి
ఆయుస్సు ఎక్కువ
ప్రపంచమంతా
దాని మురికిలోనే

అందరూ చదివింది
పేదరికంలోనే
వెలిగింది మాత్రం
ఉన్నతోద్యోగంలో

ఎన్నాళ్ళనీ
మనసులో దాచుకుంటావు
జ్ఞాపకాలు
నెమలీకలు

తొందరపాటు
మన గ్రహపాటు 
సాలోచనతోనే
అన్నీ సత్ఫలితాలు

ఆమెతో
మనసంతా విప్పాను
అంతే
ఏకతాస్వరం వినిపించింది

మాతృత్వం
మధురమైనది
జీవితాంతం
మరచిపోలేనిది

నిత్యం సమస్యల 
సుడిగుండంలో నేను 
దుఃఖమే
నన్ను సాంత్వన పరిచేది

జీవితాన్ని
రాపిడి పట్టాను
కవిత్వంలో
తొంగిచూస్తూనే ఉంది

 - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి