*అతడుNov 18, 2017


అతడు ఎవరైతేనేం
ఎండమావుల్లో చెలెమెను వెతికేవాడు
బీడుపొలాల్లో పంటను పండించేవాడు

అతడు ఎవరైతేనేం
విజయలక్ష్యాన్ని సునాసయంగా చేధించేవాడు
నిత్యం విజయతీరాన్ని ముద్దాడేవాడు

అతడు...
సాహసమే ఊపిరిగా బతుకుతున్నవాడు
ఆశతో జీవితాన్ని గెలుస్తున్నవాడు

అతడు...
కారుచీకట్లో కాంతిరేఖలా వెలుగుతున్నవాడు
మబ్బుల దాగిన మెరుపులను వెలిగిస్తున్నవాడు

అతడు...
బరువుల బాధ్యతను భారంగా మోస్తున్నవాడు
సంసార సాగరాన్ని  నావలా నడిపిస్తున్నవాడు
కష్టాలతో పోటీపడుతూ పరుగెత్తుతున్నవాడు
నష్టాల జీవితాన్ని అనుభవిస్తున్నవాడు

అతడు అతడే...
సుఖదుఃఖాల సుడిగుండాలను అవలీలగా దాటుతూ 
కష్టాలను మైమరపించేవాడు
సామాన్యుడిగా బతుకుతూనే జీవితంతో పోరాటం చేస్తున్నవాడు

అతడు...
ఎన్నిసార్లు ఓడిపోతున్నా గెలుపుకై ఆరాటపడుతున్నవాడు
ఎన్నిసార్లు పోటీపడుతున్నా విజయానికై 
అడుగులు వేస్తున్నవాడు 

అతడు అతడే...
గుండె గాయపడినా... నవ్వుల్ని పూయిస్తున్నవాడు
కష్టాలు వెంటాడినా... ధీరుడిలా బతుకుతున్నవాడు
బతకడానికి నిత్యం కష్టాల విషాలను మింగుతున్నవాడు
ఎన్ని కష్టాలొచ్చినా చెలియలికట్టను దాటుతున్నవాడు

అవును... అతడెవరో కాదు
అతడు... మరెవరో కాదు
మనిషిగా జీవిస్తున్నవాడు
జీవితాన్ని గెలుస్తున్నవాడు !!

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి