🌻 *గజల్* 🌻 Sep 13, 2017


కవిత్వం రాస్తూ కాలంతో పోటీపడుతుంటాను  
కవితను అల్లుతూ అక్షరాలతో కుస్తీపడుతుంటాను
కళ్ళముందు వాస్తవాలు ఎన్నో కనపడుతున్నా
కలంతో అక్షరాలా తపన పడుతుంటాను

కళ్ళల్లో ఎన్ని కనిపించని సుడిగుండిలున్నా
కన్నీటి చారికలతో జతకడుతుంటాను

ప్రేమించని మనుషులెందరో సమాజంలో ఉన్నా
లోకం తీరును చూసి కలవరపడుతుంటాను

మంచిచెడులన్నవి మనిషిలో నెలకొని ఉన్నా
మంచికి నేనెపుడు సదా జైకొడుతుంటాను

గుండెల్లో ఎప్పుడూ బాధ రగులుతున్నా
కలత చెందకుండా నిదుర పడుతుంటాను

చీకటివెలుగులే ఎప్పుడూ జీవితంలో *భీంపల్లి*
గాయాలనెపుడూ నేను దూరం పెడుతుంటాను


🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి