*మొగ్గలు*

చిన్నారుల చిరునవ్వులు నక్షత్రాలుగా వెలిగితేనే కదా
బడిలో బాల్యం బంగారమై మెరిసిపొయ్యేది
పసిడిబాల్యం జీవితాన పూచే మల్లెపరిమళం


ఎన్ని నవ్వులు బడితోటలో విరగబూస్తాయో కదా
ప్రతి నవ్వులో మందారమకరందాల సోయగాలు
బాల్యమంటే జీవితంలో అందమైన తీపిజ్ఞాపకం


ఎన్ని సంతోషాలు ఆనందతాండవం చేస్తేనో కదా
బడిలో బాల్యం కాంతిపుంజాలతో వెలిగిపొయ్యేది
బడి అంటే వేవేలరంగుల ఇంధ్రధనుస్సు


చదువులమ్మ గుడిలో దేవతలై నర్తిస్తేనే కదా
బాల్యం ఓనమాల అక్షరాలతో ప్రతిధ్వనించేది
ప్రతి అడుగులో నీతినిజాయితీల పాదముద్రలు


బాల్యానికి సమానతా సూత్రాన్ని ప్రభోదిస్తేనే కదా
రేపటికి బాల్యం మానవతాదీపాలై ప్రకాశించేది
బడి అంటే బతుకుదారి చూపే అసలైన చుక్కాని


*భీంపల్లి శ్రీకాంత్* 
11-01-2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి