*సంక్రాంతి మొగ్గలు*



మురిపించే ముత్యాల ముగ్గులతోనే కదా
సంక్రాంతి ముంగిలి నిత్యం కళకళలాడేది
రంగవల్లులు జీవితాన వెలిగే ఇంద్రధనుస్సులు

హరిదాసుల హరినామ సంకీర్తనలతోనే కదా
సంక్రాంతి పండుగ సరిగమల తానమయ్యేది
సంకీర్తనలు పల్లెను మేల్కొలిపే సుప్రభాతాలు

డూడూ బసవన్నల ఆటపాటలతోనే కదా
ప్రతి పల్లె పరవశంతో ఆనందతాండవం చేసేది
గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు శోభాయమానాలు

ఆరుగాలం పంట పండించినప్పుడే కదా
నవధాన్యాలను రైతన్న ఇంటికి తీసుకు వచ్చేది
అసలైన సంక్రాంతికి అదే సిరుల పండుగ 

భోగి మంటలతో కాచుకున్నప్పుడే కదా
మనలోని మాలిన్యాలను తొలగించుకునేది
సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన పండుగ


                   ✍  *భీంపల్లి శ్రీకాంత్*
                          నమస్తే తెలంగాణ 
                              15-01-2018            
                          మహబూబ్ నగర్ 

                                                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి