*మొగ్గలు*
Dec 25, 2017
వాడు మౌనంగా ఉన్నాడంటే
ఏదో ఆలోచనకు బీజం వేసినట్టే
మౌనం ఒక మహావిస్ఫోటనం

ముళ్లబాటలన్నీ పూలబాటలుగా
మార్చడానికి ఎన్ని తిప్పలు పడాల్నో
ప్రయత్నం మనిషి సహజగుణం

అడుగులు వేసుకుంటూ పోతే కానీ
గమ్యం చివరికంటా పలకరించదు
మజిలీ ఒక అనంతపయనం

గుండెలోతుల్లోకి తొంగిచూస్తేనే కానీ
బాధల బడబాగ్నులేవి మనకంట పడవు
జీవితమంటే కనిపించని విషాదం

ఎన్నిసార్లు అక్షరాలతో ఆడుకున్నా
అవి కవిత్వాన్నే ఆవిష్కరిస్తాయి
అక్షరం కవిత్వానికి లేపనం

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి