*నానీలు* Jan 2, 2018


చరిత్ర సృష్టించేవాడిదే
చరిత్ర
కాలరేఖపై
పాదముద్రలు

నడకను బట్టే
నడత
వ్యక్తిత్వాన్ని పట్టించే
ముఖచిత్రం

పలకరింపు
మనిషి లక్షణం
వాదాలేముంది
వ్యక్తిగతం

దుఃఖాన్ని
ఒంపుకోవాల్సిందే
భారమైన మనసు
తేలికవుతుంది

ఆవేశానికి
హద్దు ఎక్కువ
ఆలోచిస్తేనే
మానవ మనుగడ

ముసురు పట్టేది
వానకాలంలోనే
మనసులోనే
జీవితమంతా

చీపురే ఇంటిని
శుభ్రం చేసేది
మేమంటే
దానికి అమితప్రేమ

ఆలోచనలకు
అక్షర రూపం
ఆవిష్కరిస్తే
కవితామయం

మండుతున్న
పల్లె గుండెలు
వానలకోసం
మనిషి ఆరాటం

నానీలు
నడిచి వస్తాయి
నావి నీవి కాదు
మనందరివి కదా

          - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి