మానవతా దీప్తితో వెలిగితేనే కదా
సమాజంలో మనిషికి సమున్నత గౌరవం
మంచి ఎప్పుడూ వాడిపోని సుగంధం

మధురమైన మనస్సుతో పలికితేనే కదా
మనిషికి నిండుగా నీరాజనం 
మాట ఎప్పుడూ పరిమళభరితం

అక్షరాలకు రెక్కలు మొలిపిస్తేనే కదా 
కవిత్వమై సాహిత్యంలో విహంగవీక్షణం చేసేది
అక్షరం వేవేల భావాల అమృతసూక్తం

అక్షరాలను భావాలతో వెలిగిస్తేనే కదా
సాహిత్యంలో కవితా కిరణమై భాసించేది
కవిత్వం భావోద్వేగాల సంగమం

నిండు మనస్సుతో పలకరిస్తేనే కదా
ఆత్మీయత గుండెల నిండా పరుచుకునేది
ఆప్యాయత ఒక  అనురాగబంధం

        🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి