*మొగ్గలు* Dec 31, 2017

నీ కళ్ళల్లో నవ్వులు చూస్తేనే కదా 
నా మనసంతా ఆనందతాండవం
నీ చూపులు విరిసే అరవిందాలు

నీ పలుకుల్లో తీపిని రుచి చూస్తేనే కదా
నా హృదయమంతా తేనేల సోనలు
నీ చిలుక పలుకులు వెన్నెల జలపాతాలు

నీ అడుగుల్లో నాదాల సవ్వడిని వింటేనే కదా
నా గుండెలో సరిగమల రాగాలు
నీ పాదముద్రలు ప్రేమకు ద్వారాలు

నీ ప్రేమలో అనురాగం విరబూస్తేనే కదా
నా జీవితమంతా రసగంగ ప్రవాహం
నీ ఆత్మీయత అనుబంధానికి వారధి

నీ హృదయంలో కాస్త చోటిస్తేనే కదా
నా జీవితం ఎల్లప్పుడూ ధన్యమయ్యేది
నీ ఉచ్ఛ్వాసనిశ్వాసలే నాకు ఊపిరి

✍ *భీంపల్లి శ్రీకాంత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి