మనిషి విశాలమై ప్రవహిస్తేనే కదా
లోకం ఆనందపు అంచులను తాకేది
స్వార్ధాన్ని విడనాడితేనే జీవితం నందనం
ఉత్తమమైన వ్యక్తిత్వం ఉంటేనే కదా
భావి జీవితానికి రాచబాటలు వేసేది
ఉన్నతమైన ఆలోచనే విజయానికి సోపానం

ఓటమిలోని ఆనందాన్ని చవిచూస్తేనే కదా
విజయాన్ని చేరుకునే మార్గాలు తెలిసేది
ఓటమి చెందడమే విజయానికి నాంది

మానవతాలతలు చిగురులై వికసిస్తేనే కదా 
సమానతాపూలు సుగంధమై వ్యాపించేవి
మానవత్వగుణమే మనిషికి గీటురాయి

గలగల పారుతున్న సెలయేరును చూస్తేనే కదా
ఊహలకు రెక్కలు వచ్చి గంతులు వేసేది
ఆలోచనలు ఎగిరే స్వేచ్ఛా విహంగాలు

 *భీంపల్లి శ్రీకాంత్*
 మనం దినపత్రిక  28-01-2018


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి