మొగ్గలు


రివ్వున ఎగిరిపోయే పక్షులకు తెలుసు
దారిలేని గమనానికి పయనం ఎంతో
విహంగం ఒక స్వేచ్ఛా వాయులీనం

నిత్యం అడుగులేసే పాదాలకు తెలుసు
గమ్యాన్ని చేర్చే ఆగమనం ఇంకెంతో
చివరి మజిలీ ఒక అంతిమవిజయం

సాగరాన పడిలేచే కెరటాలకు తెలుసు
ఆటుపోట్ల అలజడుల అలసట ఎంతో
కెరటం అనంతకల్లోల దుఃఖసముద్రం

చెక్కిలిపై జారిపడే కన్నీటికి తెలుసు
గాయపడిన గుండెల్లోని బాధల బరువెంతో
జీవితం దుఃఖాన్ని ఒంపుకునే కన్నీటిజలపాతం

కవితాలతలు అల్లే అక్షరపూలకు తెలుసు
పరిమళించే సాహిత్యం సమాజానికెంతో
కవిత్వం సమాజాన ప్రకాశించే మణిరత్నం

✍ *భీంపల్లి శ్రీకాంత్*
ఆంద్రజ్యోతి మహబూబ్ నగర్ 
19-01-2018



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి