*మొగ్గలు*
కవి కలానికి అడ్డు పడతారా ఎవరైనా
అది స్వేచ్ఛా విహంగమై ఎగురుతూనే ఉంటుంది
కలం సమాజానికి దారి చూపే అక్షరదిక్సూచి

న్యాయానికి సంకెళ్లు వేస్తారా ఎవరైనా
అది అన్యాయంపై జూలు విదిలిస్తూనే ఉంటుంది
న్యాయం సమాజంలో వెలిగే దారిదీపం

ధర్మానికి ఎదురు వెళ్ళుతారా ఎవరైనా
అది ఆగ్రహాన్ని రుచి చూపిస్తూనే ఉంటుంది
ధర్మం అందరూ ఆచరించే సన్మార్గం

మానవత్వానికి దూరం అవుతారా ఎవరైనా
అది దానవత్వమై దహిస్తూనే ఉంటుంది
మానవత్వం మహిలో వెలిగే ఆరని దీపం

ప్రేమబంధానికి గాయం చేస్తారా ఎవరైనా
అది జ్ఞాపకాల ఊసులను మోస్తూనే ఉంటుంది
ప్రేమ జగతిలో వెలుగును పంచే జ్యోతి

*భీంపల్లి శ్రీకాంత్*
January 16 at 11:05pm

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి