*మొగ్గలు* Jan 2, 2018


మనిషి ఎదలోతుల్లోకి తొంగిచూస్తేనే కదా
ఆటుపోట్ల అలజడులు కనిపించేవి
జీవితం అనంత కల్లోల సముద్రం

జీవితంలో తప్పటడుగులు వేస్తేనే కదా
అసలైన పాదముద్రలు గమ్యాన్ని చేరేవి
అడుగులు విజయాన్ని ముద్దాడే సూచికలు

పోరాటంలో గెలుపోటములు సహజమే కదా
స్వయంకృషితోనే విజయానికి బాటలు పడేది
సంకల్పబలమే మనిషికి విజయసోపానం

నిత్యం కవి గుండె గాయపడితేనే కదా
కవితలు కన్నీటిప్రవాహమై జాలువారేవి
కవి కవిత్వం సమాజాన వెలిగే సూర్యబింబం

మనిషి కోరికలను అణచివేస్తేనే కదా
జీవితం నిత్యం సుఖసంతోషాలతో గడిచేది
కోరికలు మనిషిని పిప్పిచేసే జలగలు


                   ✍ *భీంపల్లి శ్రీకాంత్*

                                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి