31వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో సాహిత్య సమాలోచనలో భాగంగా వర్తమాన వచన కవిత్వం వేదికపై తెలంగాణ తొలి నవల ''ఆశాదోషం'' నవల ఆవిష్కరణ
![]() |
నేటినిజం 25-01-2018 |
తొలితరం తెలంగాణ రచయిత బరారు శ్రీనివాస్ శర్మ రచించిన తొలి తెలంగాణ నవల ఆశాదోషం నవలను శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరుగుతున్న 31వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో వర్తమాన వచన కవిత్వం అనే సదస్సు కు ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత డాక్టర్ నాళేశ్వరం శంకరం వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ పగడాల నాగేందర్, ఎం.నారాయణ శర్మ, మెర్సీ మార్గరెట్, కార్యక్రమం సమన్వయకర్త ,పుస్తక సంపాదకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

January 19 at 05.00pm
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి