*తెలుగంటే....*



తెలుగంటే మా అమ్మ
ఆత్మీయతానురాగాలను పంచే పట్టుగొమ్మ
అనుబంధాలను పెంపొందించే పూలకొమ్మ

తెలుగంటే వాడిపోని పూలచెట్టు
అక్షరాలతో పరిభళించే గంధపుచెట్టు
కవితలతో అలరారే మర్రిచెట్టు

తెలుగంటే కవితల రాణి
కవుల కలాల పూబోణి
మధుర కావ్యాల అలివేణి

తెలుగంటే ఉషోదయం
వెన్నెలను వెదజల్లే వేకువకిరణం
జీవితానికి బాటజూపే ఆశాదీపం

తెలుగంటే జలపాతం
అక్షరాల నదీ ప్రవాహం
సాగరకెరటాల  ఉత్తుంగ తరంగం

తెలుగంటే సాహిత్యం
భావాలను ప్రకటించే భావనగీతం
అనుభవాలను వెలిగించే అనుభూతి కవిత్వం

తెలుగంటే అక్షరదీపం
కవిత్వాన్ని ఆవిష్కరించే ఆత్మీయనేస్తం
సమాజాన్ని మేల్కొలిపే కవితాగానం

తెలుగంటే అమ్మ ఒడి
కవి మనసులోని చల్లని తడి
కవితావేశపు అక్షరాల అలజడి

తెలుగంటే సారధి
అనుబంధాలను కలిపే వారధి
ఆత్మబంధువై తోడుండే రథసారథి

తెలుగంటే ఆరని జ్యోతి
నిత్యనూతన చైతన్యదీప్తి
భావితరానికి దారిచూపే ఆశాజ్యోతి  

        🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి