మొగ్గలు


అక్షరమొగ్గలు వికసిస్తూనే ఉంటాయి
తెలుగు సాహిత్య మాగాణంలో
పరిమళం దాని సుగుణం

ఆకాశంలోని నక్షత్రాలుగా
మొగ్గలు వెలుగుతూనే ఉంటాయి
మెరుపులు దాని చెణుకులు

సమాజంలో అలుముకున్న చీకట్లకు
మొగ్గలు దారి దీపాలవుతాయి
సాహిత్యంలో తొలి అడుగులు

మొగ్గలు మెరుస్తూనే ఉంటాయి
మేఘాలలోని ఉరుములుమెరుపుల్లా
సాహితీ ఆకాశంలో కాంతిపుంజాలు

మొగ్గలరెక్కలు విచ్చుకుంటూనే ఉంటాయి
వేయి పూలై వికసించి పరిమళించాలని

మొగ్గలు సాహిత్యంలో తారాజువ్వలు

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి