🔹రుబాయిలు🔹


1.నీ కోసం నిరంతరం ఎదురుచూస్తుంటాను 
   రోజుకు  ఒకసారైనా నీ పేరు జపిస్తుంటాను
   ఎదురుచూపులోనే ఆనందం ఎంతో ఉంది
   నీవస్తావనే ఆశతో కాలం గడుపుతున్నాను
                          ****
2. నీ కోసం ఎన్నో ప్రేమ కవితలు రచించాను 
    నీకై మరెన్నో విరహ గీతికలు రచించాను
    నీవే ఒక ప్రేమ కావ్యం నాకు
    నీ కోసం ఎన్నో ప్రణయ కావ్యాలు లిఖించాను
                           ****
3.  నీ కోసమేగా నేను బతుకు తున్నది
      నీ పిలుపుకోసమే నేను వేచి ఉన్నది
      ప్రేమంటే ఎన్నో యుగాల తపస్సు
      నీ రాకకోసం మనసు ఉవ్విళ్లూరుతున్నది
                            ****
4.పూవులా వచ్చి నువ్వు పరిమళమైవ్యాపిస్తావు 
   జాబిలివై వచ్చి నువ్వు వెన్నెలను వెదజల్లుతావు
   ప్రకృతికి నువ్వు ప్రతిరూపానివి
   వసంతంలా వచ్చి నువ్వు పూలు పూయిస్తావు

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి