*మొగ్గలు*
ఈర్ష్యాసూయలు దరికి చేరనివ్వకపోతేనే కదా
ప్రపంచం నిత్యం సుందరప్రదమై భాసించేది
సంకుచిత స్వభావం మనిషికి మాయని మచ్చ

నిజాయితీని ఆభరణంగా ధరిస్తేనే కదా
వ్యక్తిత్వం మకుటాయమానమై తళుకులీనేది
నీతిగా బతికేవాడికే లోకంలో సుస్థిరస్థానం

కులమతాలకు అతీతంగా జీవిస్తేనే కదా
అంతస్థుల అడ్డుగోడలు తొలగిపోయేది
మానవత్వమే మనిషికి అసలైన గీటురాయి

చెమటగంధాన్ని రైతు పారిస్తేనే కదా
పంట కళకళలాడుతూ పకపక నవ్వేది
రైతు సమాజాన్ని బతికించే అన్నంముద్ద

కవి నదీ ప్రవాహమై ప్రవహిస్తేనే కదా
కొత్త దారులను సరికొత్తగా ఆవిష్కరించేది
కవిత్వం కవికి అక్షరాలా వెన్నముద్ద

*భీంపల్లి శ్రీకాంత్*
 January 15 at 11:38pm

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి