*మొగ్గలు*

ప్రతిక్షణాన్ని మధురంగా ఆస్వాదిస్తున్నడప్పుడల్లా
ప్రేమికులకు లోకమంతా కొత్తగానే కనిపిస్తుంది
ప్రేమలోని కొత్తదనమే జీవితాన మకరందం

కళ్ళు తెరిచినా మూసినా నిరంతరం
ఆమె కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటుంది
ప్రేమంటే మధురానుభూతుల మహాకావ్యం

ఆమె ఆలోచనలు వెంటాడుతున్నప్పుడల్లా
నిరంతరం జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి
ప్రేమ ఊసులు తడి ఆరని జ్ఞాపకాలు

ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే కదా
అనుక్షణం ఆమె గురించి ఆలోచనతరంగాలే
నిజమైన ప్రేమనే నిజాయితీకి దర్పణం

ఆమె జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా
విరహవేదనతో మనసు ఊగిపోతూనే ఉంటుంది
ప్రేమంటే అనంత భావోద్వేగాల సంగమం


                     ✍ *భీంపల్లి శ్రీకాంత్*
                            07-01-2018

                                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి