తెలంగాణ సాహిత్యాన్ని పరిశోధిస్తున్న సాహితీవేత్తలు, పరిశోధకులు తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుతున్న సందర్భంలో రాత ప్రతులను వెలుగులోకి తెస్తున్నారు. అట్లా తెలుగు సాహిత్యంలో ఇప్పటికే ముద్రపడిపోయి న అనే ప్రక్రియలకు తెలంగాణ సాహిత్యం కేంద్ర బిందువు కావ డం గమనించాల్సిన విషయం. ఎవరికివారు ఇదే తొలి రచన అం టూ పేర్కొంటూ వ్యాసాలు, వ్యాఖ్యానాలు రాస్తున్నారు. కానీ తెలంగాణ సాహిత్యాన్ని తవ్వుతున్నకొద్దీ వెలుగులోకి రాని ఎన్నో రచనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో తెలంగాణ నవల ప్రక్రియ ఒకటి. సాహిత్యాన్ని పరిశోధిస్తున్న వారందరూ తడకమళ్ల వారి కంబుకంధర చరిత్ర రచననే పేర్కొంటున్నారు. అది అలభ్యము, అముద్రితము కూడా. అది యక్షగాన రచన శైలి లో ఉందని సాహితీవేత్తల అభిప్రాయం. (తడకమళ్లవారే స్వయంగా వచన ప్రబంధమని పేర్కొన్నారు) తెలంగాణ పరిశోధకులు మాత్రం కంబుకంధర చరిత్రనే తొలి నవలగా పేర్కొంటూ వస్తున్నారు. కానీ ఇది 8 అశ్వాసాల వచన ప్రబంధం. ఇందులో అక్కడక్కడ పద్యాలున్న ఇప్పటికిది అలభ్యంగా ఉందని పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర (పుట 652)లో ప్రస్తావించారనేది గమనించాల్సిన విషయం.

అయితే తెలంగాణలో తొలిపత్రిక హితబోధినిని వెలువరించిన బరారు శ్రీనివాస శర్మ 1910లోనే ఆశాదోషము అనే నవలను రచించారు. ఇది నేటి వరకు అలభ్యంగానే, అముద్రితంగానే ఉన్నది. దీన్ని సేకరించి భద్రపరిచినవారు తాళపత్ర పరిశోధకుడైన నాగలింగ శివయోగి. వీరు దాదాపు 600 తాళపత్ర గ్రంథాలను అప్పట్లోనే సేకరించి తార్నాకలోని ప్రాచ్యలిఖిత భాండాగారానికి అప్పగించారు. నాగలింగ శివయోగి 60 ఏండ్లుగా ఆశాదోషము నవలను భద్రపరిచిండు. తెలంగాణ సాహిత్యంతో పాటు పాలమూ రు సాహిత్యాన్ని తవ్వితీస్తున్న ప్రముఖ పాలమూరు పరిశోధకుడు భీంపల్లి శ్రీకాంత్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంపాదకత్వంలో ఈ నవలను వెలుగులోకి తీసుకువచ్చి వెలువరించడం అభినందించాల్సిన విష యం. వందేండ్ల కిందటనే రాయబడిన ఈ నవల తెలంగాణ తెలుగు ప్రపంచసభ ల సందర్భంగా వెలుగులోకి రావడం సం తోషించాల్సిన విషయం.తెలంగాణ సాహిత్యాన్ని రాస్తున్న పెద్దలు కొందరు ఆశాదోష ము నవల పేరును ఎక్కడా కూడా పేర్కొనలేదు. మరికొందరు అలభ్యం, అముద్రితమని పేర్కొంటూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ కూడా తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథండ లో ఆశాదోషము నవల అలభ్యమని, అముద్రితమని పేర్కొనడం గమనార్హం. సాహిత్య భీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఆశాదోషం లిఖిత ప్రతిని తాను చూశానని, మహబూబ్‌నగర్ జిల్లా విజ్ఞాన సర్వస్వంలో 1993లోనే పేర్కొన్నారు. పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ కూడా ఆశాదోషము నవల కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఆయనకు ఎక్కడా ఈ నవల లిఖితప్రతి దొరుకలేదు. ఈ ఆశాదోషము తొలి తెలంగాణ నవల ఇప్పటికైనా వెలుగుచూడటం కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వారికి ఆనందం కలిగించే విషయం. ఇలాంటి మరుగున పడి ఉన్న ఆణిముత్యాలను పరిశోధకులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అప్పడే సాహిత్యం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. అప్పడే తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం జెండాలా రెపరెపలాడుతుంది. 

తెలంగాణ తొలి తెలుగు పత్రికను వెలువరించిన బరారు శ్రీనివాసశర్మ పత్రికను వెలువరించకముందే 1910లో దీనిని రచించడం గొప్పవిషయం. ఈ నవల పూర్తిగా కోయిలకొండ దుర్గం చరిత్రను చాటి చెబుతుంది. ఇది సరళ గ్రాంథికంలో రచించబడిన నవ ల. నాటి కోయిలకొండ దుర్గాన్ని అసఫ్‌జాహీ వంశస్థులు ఎలా చేజిక్కించుకున్నారో ఈ నవల కళ్ళకు కడుతుంది. ఇది తెలంగాణ తొలి తెలుగు నవలనే కాదు తెలుగులో తొలి చారిత్రక నవల కూడా ఇదే కావ డం విశేషం. 20 ప్రకరణాలు గల ఈ నవల ఆద్యంతం ఉత్సుకతతో చదివిస్తుంది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ నవల పాఠకులను ఆగకుండా చదివిస్తుంది. తర్వాత ఏమవుతుందనే తాపత్రయాన్ని రచయిత కలిగించాడు. ఈ నవలను ఒక ప్రకరణం చదివి మూసివేయలేమని, తర్వాతి ప్రకరణంలో ఏం జరుగుతుందనే ఆతృతను రచయిత కల్పించాడని పుస్తక సంపాదకులు అభిప్రాయపడ్డారు. ఈ నవలలో యుద్ధాలే కాదు, ప్రేమలు ఉన్నాయి. మాయా పాత్రలున్నాయి, కపట వేషాధారణలున్నాయి. ఈ నవలను రాసిన శ్రీనివాస శర్మ దీన్ని ముద్రించే ప్రయత్నం చేయలేదు. హితబోధిని పత్రి క వ్యవహారంలో పడి ఈ నవలను పట్టించుకోలేదు.వాస్తవానికి తడకమళ్ల వారి కంబుకంధర చరిత్ర తెలంగాణ తొలి నవల కాదు. అది యక్షగాన మూలాలున్న వచన ప్రబంధమే. బరారు శ్రీనివాసశర్మ రాసిన ఆశాదోషము నవలనే తెలంగాణ తొలి నవలగా తెలంగాణ సాహిత్య నిర్మాతలు పేర్కొనవల్సిందే. శ్రీనివా సశర్మనే స్వయంగా దీన్ని నవల అని పేర్కొన్నాడు.

- డాక్టర్ గుంటి గోపి, 80198 08207



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి