*మొగ్గలు*
వానలేేేక పొలం ఎండిపోతున్నప్పుడల్లా
అన్నదాత ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు
అక్కరకు రాని అరుదైన చుట్టం వాన

ఎండకు ఆకాశం మండిపోతున్నప్పుడల్లా
భూమి మాడి మసైపోతూనే ఉంటుంది
మేఘాలను ఆవిరిచేసిన ఎండకాలం

నదీ ప్రవాహం ఆగిపోతున్నప్పుడల్లా
భూమి పగుళ్లిచ్చి పోతూనే ఉంటుంది
పచ్చదనాన్ని ప్రసవించని పుడమితల్లి

కరువు కాలాన్ని కసితీరా కాటేసినప్పుడల్లా
పల్లె వలస బాట పడుతూనే ఉంటుంది
వలసబతుకు నిత్య వసంతం

సాగరం సునామిలా ఎగసిపడుతున్నప్పుడల్లా
అలల అలజడులు రగులుకుంటూనే ఉంటాయి
జీవితం నిత్యం ఆటుపోట్ల సంగమం


*భీంపల్లి శ్రీకాంత్*
 January 15 at 10:54pm

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి