ఆంధ్రభూమి సాహితి సోమవారం 04-06-2018

ఆకాశం ఆనందబాష్పాలను రాల్చినప్పుడల్లా
రైతన్న గుండె పరశించిపోతూనే ఉంటుంది
ఆకాశం నీరే రైతన్న పంటకు పన్నీరు
రైతన్న వాన మొగుల్లను చూసినప్పుడల్లా
అక్కరకు రాని చుట్టం వానచినుకే అవుతుంది
నిత్యగాయంలా వాన కోసం ఎదురుచూపు
ప్రకృతిలో వానకాలం చిగురించినప్పుడల్లా
రైతన్న గుండె తండ్లాడుతూనే ఉంటుంది
జీవితాంతం వాన కోసమే రైతన్న బతుకు
రైతన్న మట్టి కోసం బతుకుతున్నప్పుడల్లా
అది మమకారాన్ని పంచుతూనే ఉంటుంది
మట్టి అన్నం ముద్దను ప్రసవించే అమ్మ
మట్టిలో విత్తనాలు మొలకెత్తినప్పుడల్లా
రైతన్న కంట్లో ఆశలూరుతూనే ఉంటాయ
కాలం కలిసొస్తేనే రైతన్నకు పండుగ


⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి