ప్రేమ మొగ్గలు 
నవ తెలంగాణ మహబూబ్ నగర్ 03-06-2018 

నీ జ్ఞాపకాలను చప్పరిస్తూ ఉంటూనే
ప్రేమ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను
ప్రేమంటే తీపి జ్ఞాపకాల ఊటచెలెమె

నా మనోసరస్సులో ఉత్తుంగతరంగలా
నిత్యం ఎగిసెగిసిపడుతుంటావు నువ్వు
ప్రేమంటే సాగర కెరటాల నిత్యహోరు

నా హృదయకోవెలలో దేవతామూర్తిలా 
నిన్ను నిత్యం అభిషేకిస్తూనే ఉంటాను
ప్రేమంటే ఆరాధానుభూతుల మౌనాభిషేకం

నా ప్రణయసీమలో ప్రేమైకమూర్తిలా
నిన్ను ప్రతిక్షణం ఆరాధిస్తూనే ఉంటాను
ప్రేమంటే ఎదురుచూపుల విరహగీతం

నీతో గడిపిన ప్రతి మధురక్షణం 
నాకు ఆనందాల హరివిల్లే అవుతుంది
ప్రేమంటే ఎదను మీటే మధురరాగం

⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి