అఖిల భారతావని ముద్దుబిడ్డ
ఆధునికకాలపు మహోదయనేత
రాజకీయాల్లో మేరునగధీరుడు
అందరూ మెచ్చే అజాతశత్రువు
భారతిసిగలో మెరిసిన భారతరత్నం


భారత చందనవృక్షంపై మెరిసి
గంధపుచెక్కలా వెలిగిన శాంతికపోతం
కవితల మాగాణంలో విరిసి
శాంతిగీతాన్ని ఆలపించిన కవితాకోకిల

దార్శనికత ఆయన స్థూలదృష్టి
ఆధునిక భారతం ఆయన దూరదృష్టి
సనాతన భారతీయ విలువలకు
ఆయన నిలువెత్తు రూపం

నీతి, నిజాయితీకి పట్టంకట్టిన
విలువైన ఆభరణం
స్ఫటికం కంటే స్వచ్ఛంగా బతికిన
నేటి మేటి రాజకీయ వజ్రం

నిరుపమానమైన దేశభక్తికి
ప్రతిరూపంలా నిలిచిన రాజనీతిజ్ఞుడు
సమున్నత విలువలు ఆయన సొంతం
అందుకే ఆయనంటే అందరికీ అభిమానం
భారతీయలతకు పూచిన సుమగంధం

 **********************************
🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📰 మనం దినపత్రిక 📰 : 🌷 17-08-2018 🌷
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి