అలసిన దేహానికి ఆపన్నహస్తమవుతూనే
పిల్లతెమ్మెరలా నిద్రపుచ్చుతూనే ఉంటుంది
రాత్రి అంటే మనిషిని సేదతీర్చే లేపనం

పగలంతా ప్రపంచాన్ని చుట్టుతూ వస్తూనే
రాత్రయ్యేసరికి చీకటికౌగిట్లోకి జారుకుంటాను
రాత్రి అంటే అలసిన మనసుకు ఉపశమనం

మనసును మరిపించే కష్టాలను మరిపిస్తూనే
అది నెచ్చెలిలా సాంత్వనపరుస్తూనే ఉంటుంది
రాత్రి అంటే మనసుకు ఆనందనిలయం

కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతూనే
సరికొత్త ప్రపంచాన్ని కలగంటూ ఉంటాడు
రాత్రి అంటే కవికి అక్షరాలా తపస్సు

కాలం ఒడిలోని రాత్రి పాన్పుపై నిద్రిస్తూనే
ఆశలదీపాలను వెలిగిస్తూనే ఉంటాడు
రాత్రి అంటే కవికి ఉదయించే రవికిరణం

నవ్య మీడియా :: Feb 23, 2018
✍✍🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి