🌷 *మొగ్గలు*🌷

అక్షరాలపూదోటలో మల్లెమొగ్గలుగా
కవితాసుమాలు అంకురిస్తూనే ఉంటాయి
అక్షరమంటే కవితాలతకు ఆరోప్రాణం

వచనకవితా మాగాణంలో పరిమళభరితంగా
కవితామొగ్గలు మొగ్గతొడుగుతూనే ఉంటాయి
*మొగ్గలు* వికసించే సాహితీమందారాలు

అక్షరపూలవనంలో సీతాకోకచిలుకల్లాగా
మొగ్గలు కనువిందు చేస్తూనే ఉంటాయి
*మొగ్గలు* కవుల కలాలకు అక్షరనైవేద్యాలు

మమతల తోరణంలో మానవతాపుష్పాలుగా
సమతామొగ్గలు పరిమళిస్తూనే ఉంటాయి
*మొగ్గలు* నిత్యం వికసించే చైతన్యదీపికలు

కవుల రసహృదయాల్లో కన్నబిడ్డలుగా
మొగ్గలు పురుడు పోసుకుంటూనే ఉంటాయి
*మొగ్గలు* అంటే కవులకు ఎనలేని ప్రీతి

*మొగ్గలు* {{గణేష్ దినపత్రి}} : 
12-02-2018 :  *భీంపల్లి శ్రీకాంత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి