మొగ్గలు
అక్షరనేత్రం పక్ష పత్రిక 
ప్రపంచాన్ని అద్ధంలాగా చూపించినప్పుడల్లా
అమ్మ చెప్పే నీతికథలే జ్ఞాపకమొస్తాయి
జీవితాంతం జ్ఞానరుచిని పంచేది పుస్తకం

మనలోని కల్మషాలను కడిగేసుకున్నప్పుడల్లా
వెలుగుబాటయై దారి చూపిస్తూనే ఉంటుంది
కారుచీకట్లో కాంతిరేఖయై ప్రకాశించేది పుస్తకం

అక్షరాలతో ఆలింగనం చేసుకున్నప్పుడల్లా
భావప్రకాశనాన్ని కలిగిస్తూనే ఉంటుంది
విశ్వమయ జగత్తుకు విజ్ఞాన కేంద్రం పుస్తకం

బాధలబరువుతో మనసు అల్లాడిపోతున్నప్పుడల్లా
సేద తీర్చే ప్రియురాలై సాంత్వన పరుస్తుంది
హృదయానికి హత్తుకునే ఆత్మీయనేస్తం పుస్తకం

మనిషి జీవితంలో విజయాన్ని సాధించినప్పుడల్లా
గమ్యానికి పునాదిరాయై దారిచూపుతూనే ఉంటుంది
తీరాన్ని చేర్చే బతుకు చుక్కాని పుస్తకం

✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷






















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి