*🌷జీవితం మొగ్గలు🌷*
గణేష్ దినపత్రిక 07-03-2018
ఎంతటి అపురూపమైన అందమైనా
ఎప్పుడో ఒకసారి పాలిపోవాల్సిందే
అందం మనిషికి దేవుడిచ్చిన వరం

ఎంతటి ఆహ్లాదపరిచే ఆనందమైనా
ఒక్క నిమిషంలో ఆవిరి కావాల్సిందే
ఆనందం మనసుకు హాయిగొలిపే వసంతం

ఎంతటి రంగుమారే రాజకీయమైనా
ఎప్పుడో ఒకసారి రాజీపడాల్సిందే
రాజకీయం ప్రజలను పీడించే రాక్షసత్వం

ఎంతటి కష్టనష్టాల బతుకైనా
ఎప్పుడో ఒకసారి ఎదురీడాల్సిందే
బతుకు సాగిపోయే జీవితనావ

ఎంతటి ఆటుపోట్ల జీవితమైనా
బతుకు సమరం చేయాల్సిందే
జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం

ఎంతటి సుదూరతీర గమ్యమైనా
ఎప్పుడో ఒకసారి తీరాన్ని చేరాల్సిందే
గమ్యం మనిషి చేరే ఆఖరిప్రస్థానం


✍   🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  🌷


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి