🌷 మొగ్గలు 🌷
గణేష్ దినపత్రిక 18-03-2018

అసమానతల అడ్డుగోడలను కూలిస్తేనే కదా
సమసమాజం వెలుగుదివిటీలా ప్రకాశించేది
మానవత్వమే మనిషికి మమతలపూదోట

అంటరానితనాన్ని రూపుమాపితేనే కదా
సమాజంలో దురాచారం నిర్మూలించబడేది
అంటరానితనం అవనికే మాయనిమచ్చ

అహంకారాన్ని అందరూ వీడి సాగితేనే కదా
మమకారపు మల్లెతోటలా విరగబూసేది
అహంకారమే మనిషిని కాల్చే నిప్పులకొలిమి 

అసూయను దరికి చేరనివ్వకపోతేనే కదా
ప్రేమానురాగాలు నవపల్లవమై ఆలపించేది
అసూయ మనిషిని దహించివేసే అనుమానం

అజ్ఞానాంధకారాన్ని తొలగించి వేస్తేనే కదా
విజ్ఞానవెలుగులు అవనిలో విరజిమ్మేది
అజ్ఞానం మనిషిని వేధించే చీకటిరాజ్యం 

అన్యాయాన్ని ఆమడదూరం పెడితేనే కదా
న్యాయం చైతన్యకెరటమై ఎగిసిపడేది
అన్యాయం సమాజాన్ని పీడించే జలగ

అవినీతి దుర్గంధానికి దూరం ఉంటేనే కదా
నీతిసుగంధం స్వచ్ఛనదిలా ప్రవహించేది
అవినీతి మనిషిని కాటువేసే లంచావతారం

✍✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి