మొగ్గలు 
గణేష్ దినపత్రిక 05-03-2018
కవి మనస్సు గాయపడితేనే కదా
గాయం గేయమై ఆవిష్కృతమయ్యేది
కవి గేయం గుండెను తాకే ఆయుధం

గాలి పరిమళాన్ని మోస్తేనే కదా
పువ్వు వాసంతసమీరమై అల్లుకునేది
గాలి పువ్వును మోసే సుగంధరాజం

గండుకోయిల కమ్మగా కూస్తేనే కదా
వసంతాగమనం పరవశించి అరుదెంచేది
ప్రకృతికే పూసిన ఋతువు వసంతం

గాయపడిన మనిషి గేయమైతేనే కదా
బాధలను గేయాలుగా అక్షరీకరించేది
గేయం గాయపడిన మనిషి జ్ఞాపకం

పచ్చని నేల పరవశంగా ప్రసవిస్తేనే కదా
విత్తనం పసిమొగ్గలా నవ్వి విచ్చుకునేది
కొత్తజన్మకు ఊపిరిపోసేది నేలనే ఎప్పటికీ

🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి