🌷 ప్రకృతిలో వాలిన నవ వసంతం 🌷

సాక్షి మహబూబ్ నగర్ 18-03-2018






జీవితం షడ్రుచుల సమ్మేళనమవుతూనే
ఉగాది గొప్ప సందేశమిస్తూనే ఉంటుంది
జీవితమంటే తీపిచేదుల సంగమం

ప్రకృతిని మరింత శోభాయమానం చేస్తూనే
వసంతం సుమధుర పరిమళాన్ని వెదజల్లుతుంది
ఉగాది మనిషిని వెలిగించే మానవతాజ్యోతి

మదిలో సరికొత్త ఆశలను నిత్యం నింపుతూనే
సమతమమతల ప్రభలను వెలిగిస్తుంది
ఉగాది ప్రకృతిలో వాలిన నవవసంతం

జీవితం నిత్యం వసంతమై పూస్తేనే కదా
బతుకునావ హాయిగా ప్రవాహమై సాగిపోయేది
ప్రతి ఉగాది మనిషిని ఉల్లాసపరిచే యవ్వనం

ఛైత్రకాలం కొత్త చిగురులను తొడుగుతూనే
నూతన యవ్వనాన్ని సింగారించుకుంటుంది
ఉగాదికి శాశ్వత ఆత్మీయనేస్తం ఛైత్రమాసం

జీవితంలో వసంతం వాలేది ఒక్కరోజేమి కాదు
రోజూ కొత్త ఆలోచనలు వికసించడానికి
ఉగాది ఒక జ్ఞాపకాల వాసంతసమీరం

ఛైత్రంలో వసంతరుతువు ఆగమిస్తేనే కదా
ఉగాది హరివిల్లులా శోభాయమానమయ్యేది
తెలుగు పండుగంటేనే అందరికీ వెలుగు

✍✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి