నవ్య మీడియా :  11 మర్చి : 2018  

అంటరాని కులాల బాలికలకు బడిని నెలకొల్పి
విద్యాబుద్ధులు నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు
సావిత్రిబాయి పూలే అణగారిన ప్రజల ఆశాజ్యోతి
అగ్రకులాల ఆధిపత్యాన్ని అనునిత్యం ఎదిరించిన
బీదప్రజల పాలిట చిరస్మరణీయ సంఘసంస్కర్త
సావిత్రిబాయి పూలే సత్యశోధక సమాజస్ఫూర్తి
కార్మికుల, రైతులకోసం రాత్రిబడులను స్థాపించి
చదువును నేర్పించిన ప్రగతి కాముకురాలు
సావిత్రిబాయి పూలే నిరక్షరాస్యుల కల్పవల్లి
దురాచార మూఢనమ్మకాలను దునుమాడి
వితంతువివాహాలను జరిపించిన వివేకమూర్తి
సావిత్రిబాయి పూలే ప్రగతిదారికి వెలుగుబాట
నవభారతాన్ని నిర్మించాలనే సదాశయంతోనే
సంస్కరణల బీజాలను నాటిన ప్రతిభామూర్తి
సావిత్రిబాయి పూలే భారతదేశ ఆణిముత్యం

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి