🌷🌷 ఆమె దర్శనం కాకపోయినప్పుడల్లా 🌷🌷

నవ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా 18-03-2018


.💗🌷 *ప్రేమ మొగ్గలు* 💗🌷

ఆమె దర్శనం కాకపోయినప్పుడల్లా
నా చుట్టూ అంతా శూన్యవిహారమే
ఆమె అందం ముందు చంద్రుడు దిగదుడుపే

ఆమె ఆలోచనలో పడిపోయినప్పుడల్లా
నన్ను నేను మరచిపోతూనే ఉంటాను
ప్రేమంటే ఎంత శోధించినా కనిపించని వెలుగు

ఆమెను విడిచి ఉండలేకపోయినప్పుడల్లా
నేను జ్ఞాపకాల్లో మునిగిపోతూనే ఉంటాను
ఆమె నా గుండెగదిలో వెలిగే దేవత

ఆమె చూపులబాణాలను విసిరినప్పుడల్లా
నా సున్నిత హృదయం తట్టుకోలేకపోయేది
ఆమె చూపులు విరిసే మన్మథబాణాలు

ఆమె రాక కోసం ఎదురుచూసినప్పుడల్లా
మనస్సు ఉవ్విళ్లూరుతుంటూనే ఉంటుంది
ఆమె రాకనే నాకు నిత్య వసంతోదయం


✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷🌷⚘⚘



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి