*🌷ప్రేమ మొగ్గలు🌷*
నవ తెెెెలంగాణ 04-03-2018

నీతో ఏడడుగులు నడవాలనే ఆశతోనే కదా
నేను నీ వెంబడి అడుగులో అడుగులు వేసింది
ప్రేమంటే సప్తస్వరాల అనురాగసంగమం

నీతో ప్రణయగీతాలను ఆలపించేయాలనే కదా
నేను స్వరరాగ సుస్వరాలను పలికించేది
ప్రేమంటే సుమధుర రాగాల ఆలాపన

నీతో జీవితాన్ని పంచుకోవాలనే ఆర్తితోనే కదా
నేను నీతో స్నేహ వారధిని సదా నిర్మించింది
ప్రేమంటే అనుబంధం కోసం చేసే తపస్సు

నీతో ప్రేమ ఊసులను పలికించాలనే కదా
నేను మధురమైన భావాలను పూయించేది
ప్రేమంటే వెన్నెలను వెలిగించే రవికిరణం

నీతో వసంతాలను పూయించాలనే కదా
నేను ఎన్నో శిశిరాలను నేల రాల్చింది
ప్రేమంటే గుండె పలికే మౌనగీతం

✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి